Movies

హీరోయిన్‌పైనే దృష్టి ఉంటుంది

Tapsee Pannu On Her Story Choices

తెలుగు సినిమాతో కెరీర్ ప్రారంభించినా బాలీవుడ్లో బ్రేక్ అందుకున్నారు తాప్సీ. కథా బలం, కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు ఆమె కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఇటీవల ‘థప్పడ్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇంత క్రేజ్ ఉన్నా.ఆమెతో సినిమాలు చేయడానికి కొందరు హీరోలు నిరాకరించారట. ఇటీవల ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ప్రస్తుతం నేను లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి సారిస్తున్నా. అలాంటి సినిమాల్లో ఫోకస్ అంతా హీరోయిన్పైనే ఉంటుందని, హీరోలను పెద్దగా పట్టించుకోరని రెండు, మూడు సినిమాలు చేసిన హీరోలు నా సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకోలేదు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా పూర్తి బడ్జెట్ స్టార్ హీరో పారితోషికం అంత కూడా ఉండదు. ఈ విషయంలో మార్పు రావాలి. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు వస్తేనే ఈ మార్పు సాధ్యమవుతుందని నా అభిప్రాయం. అందుకు కథానాయికలు కూడా ముందుకు రావాలి’’ అని తాప్సీ చెప్పారు