Devotional

నేటి మీ రాశిఫలం-మార్చి 20 2020

రాశిఫలం – 20/03/2020

తిథి: 

బహుళ ఏకాదశి ఉ.7.37, కలియుగం-5121 ,శాలివాహన శకం-1941

నక్షత్రం: 

శ్రవణం సా.6.19

వర్జ్యం: 

రా.10.35 నుండి 12.17 వరకు

దుర్ముహూర్తం: 

ఉ.8.24 నుండి 9.12 వరకు, తిరిగి మ.12.24 నుండి 1.12 వరకు

రాహు కాలం: 

ఉ.10.30 నుండి 12.00 వరకు ,విశేషాలు: సర్వేషాం ఏకాదశి

మేషం: 

(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా నుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.

వృషభం: 

(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మిథునం: 

(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

కర్కాటకం: 

(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. ఋణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలుండవు.

సింహం: 

(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో, ఋణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య: 

(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా వున్నాయి. వేళ ప్రకారం భుజించుటకు ప్రాధాన్యమిస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులెదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు.

తుల: 

(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కోపాన్ని అదుపులో నుంచుకొనుట మంచిది. మానసికాందోళన తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా నుండవు. వృధా ప్రయాణాలెక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.

వృశ్చికం: 

(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు.

ధనుస్సు: 

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తపడుట మంచిది.

మకరం: 

(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందుతారు.

కుంభం: 

(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) మనస్సు చంచలంగా వుంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అకాల భోజనంవల్ల అనారోగ్య బాధలనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. చెడు సహవాసానికి దూరంగా నుండుటకు ప్రయత్నించాలి.

మీనం: 

(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్ర్తిలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుంటాయి.

######################
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

?1351 : ఢిల్లీ సుల్తాను ముహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం.

?1602 : డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడినది.

?1726 : ప్రముఖ శాస్త్రవేత్త, సర్ ఐజాక్ న్యూటన్ మరణం. (జననం;1642)

?1855 : మొట్టమొదట సిమెంట్ ను కనుగొన్న జె.ఏస్పిడిన్ మరణం..(జ.1788)

?1951 : భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు మదన్‌లాల్ జననం.

?1966 : భారత గాయకురాలు అల్కా యాగ్నిక్ జననం.

?2008: తెలుగు సినీ నటుడు శోభన్ బాబు మరణం.

?2010 : నేపాల్ మాజీ ప్రధానమంత్రి గిరిజాప్రసాద్ కొయిరాలా మరణం???????????????☘??????

########################
శుభమస్తు

తేది : 20, మార్చి 2020

సంవత్సరం : వికారినామ సంవత్సరం

ఆయనం : ఉత్తరాయణం

మాసం : ఫాల్గుణమాసం

ఋతువు : శిశిర ఋతువు

కాలము : శీతాకాలం

వారము : శుక్రవారం

పక్షం : కృష్ణ (బహుళ) పక్షం

తిథి : ఏకాదశి
(నిన్న తెల్లవారుజాము 4 గం॥ 27 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 6 గం॥ 0 ని॥ వరకు)

నక్షత్రం : శ్రవణము
(నిన్న మద్యాహ్నం 2 గం॥ 53 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 5 గం॥ 7 ని॥ వరకు)

యోగము : శివము

కరణం : బాలవ

వర్జ్యం : (ఈరోజు రాత్రి 9 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 19 ని॥ వరకు)

అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 28 ని॥ వరకు)

దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 33 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 47 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 35 ని॥ వరకు)

రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 22 ని॥ వరకు)

గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 20 ని॥ వరకు)

యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 54 ని॥ వరకు)

సూర్యోదయం : ఉదయం 6 గం॥ 20 ని॥ లకు

సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 26 ని॥ లకు

సూర్యరాశి : మీనము

చంద్రరాశి : మకరము