Devotional

విశ్రాంతి పొందుతున్న దేవుళ్ల మధ్య సరదా సంభాషణ

A funny conversation between gods and goddess

దేవుళ్ళమధ్య సరదా సంభాషణ

వెంకన్న దుర్గమ్మతో

చెల్లీ యెలా ఉన్నావు? కరోనా ప్రభావం మీ ఊర్లో యెలా ఉంది?

దుర్గమ్మ:
అన్నా చాల విశ్రాంతిగా, ప్రశాంతంగా
ఉన్నాను. ఇంత తీరిక చిక్కి యెన్నేళ్ళయిందో! అబ్బ! భక్తుల తాకిడితో ఊపిరి ఆడేదికాదు. కరోనా దెబ్బతో మనకు విశ్రాంతి దక్కింది.

స్వామి: అవును చెల్లీ!
వాళ్ళకు స్వస్థతయేమో గాని మనకు కొన్నాళ్ళు పాపాల వైరస్ సోకకుండా ఉంటుంది! స్వచ్ఛమైన గాలి పీల్చికోవచ్చు. ఈ విరామకాలంలో మనంకూడ కొత్తశక్తిని పుంజుకోవచ్చు!

దుర్గమ్మ: అవునన్నా! మనం కూడ మన కుటుంబాలతో సంతోషంగా గడపవచ్చు. నేను శ్రీశైలం వెళదామను కుంటున్నాను. ఆయనా తీరికగానే ఉన్నారు కదా! కాణిపాకం నుంచి గణపతిని మోపిదేవి నుంచి సుబ్రహ్మణ్యుడిని కూడ రమ్మంటాను. ఉగాది పండుగ, శ్రీరామ నవమి చక్కగా చేసుకోవచ్చు

వెంకన్న: నిజమే సుమా! నేనూ అర్ధరాత్రులు కొండదిగకుండా రోజంతా తిరుచానూరులోనే ఉండవచ్చు, పద్మతో పాచికలాడుతూ! అబ్బ! ఇంత మంచి అవకాశం మళ్ళీ వస్తుందో లేదో!
వెంటనే వినియోగించుకోవాలి. మళ్ళీ ప్రభుత్వాలు ఆంక్షలు యెప్పుడు యెత్తేస్తాయో యేమో!

మంచి సూచన చేశావు చెల్లీ! ధన్యవాదములు. ఉంటాను!

దుర్గమ్మ: మంచిది అన్నయ్యా! హ్యాపీ టైం విత్ ఫ్యామిలీ!