Politics

CRDA మాస్టర్ ప్లాన్‌కు లోబడే ఇళ్లస్థలాల పంపిణీ

AP Govt Issues GO For Home Sites According To CRDA MasterPlan

రాజధానిలో అందరికీ ఇళ్ల పథకం వర్తింపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైతే సీఆర్డీయే మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేయాలని కూడా ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పథకాన్ని అమలు చేయాలని గుంటూరుకృష్టా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం గుంటూరువిజయవాడమంగళగిరితాడేపల్లిదుగ్గిరాలపెదకాకానీలలో ఉండే సుమారు వేల మందికి రాజధానిలో ఉన్న మూడు గ్రామాల్లోని ఎకరాలు కేటాయించాలని జీవోను జారీ చేసింది. ఈ మేరకు లబ్దిదారులను ఎంపిక చేసి.. వారికి ప్లాట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే రాజధాని మాస్టర్ ప్లాన్ అమలులో ఉన్న తరుణంలో రాజధాని పరిధిలో ఉండే ఇళ్లు లేనివారికి గృహాలు ఇవ్వల్సిందేగానీ.. రాజధాని బయట అంటే.. గ్రామాల వెలుపల ఉన్నవాళ్లకు ఎలా ఇళ్ల స్థలాలు ఇస్తారని పేర్కొంటూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ప్రభుత్వం విడుదల చేసిన జీవో ను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరో జీవోను జారీ చేసింది. సీఆర్డీయే చట్టం పరిధికి లోబడే మాస్టర్ ప్లాన్ స్థాయిలో మార్పులు ఉండాలని ఆ జీవోలో స్పష్టం చేసింది.