DailyDose

14వ తేదీన లాక్‌డౌన్ అంతం-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Modi Tells Chief MInisters That Lock Down Ends 14th

1. ఈనెల 15 తర్వాత లాక్ డౌన్ సడలింపు ఉంటుందని వీడియోకాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోది వ్యాఖ్యలు చేశారు.ప్రజలు ఒకేసారి రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోడీ కోరారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అలుపెరగని పోరు చేస్తోందని ప్రధాని అన్నారు. రైతుల పంటలు కొనుగోలు చేయడానికి మార్కెట్ యార్డులతోపాటు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని రాష్ట్రాలకు సూచించారు. లాక్ డౌన్ తర్వాత ఎలాంటి ప్రణాళికలు ఉండాలన్న దానిపై సలహాలు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రులను కోరారు.

2. కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 135కి చేరాయి.గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20పాజిటివ్ కేసులు.ప్రకాశం జిల్లాలో 17 కృష్ణా,వైయస్ఆర్ జిల్లాల్లో 15 చొప్పున,పశ్చిమగోదావరి జిల్లాలో 14 ,విశాఖ జిల్లాలో 11,తూర్పు గోదావరి జిల్లాలో 9,చిత్తూరు జిల్లాలో 8 కరోనా కేసులు నమోదయ్యాయి.

3. రేపు రాష్ర్ట గవర్నర్లతో రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్ లో సంభాషించనున్నారు.కరోనా నియంత్రణ చర్యలపై రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి వారితిో చర్చిస్తారు.

4.ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ కు లేఖ రాసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.కరోనా నేపథ్యంలో నాడు – నేడు కార్యక్రమాన్ని వాయిదా వేయాలి.కూలీలు,ఇసుక,నిర్మాణ సామగ్రి తీసుకెళ్లడం ఇబ్బంది.ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాణ పనులు చేపట్టడం సాధ్యం కాదని తెలియచేశారు.

5.టిడిపి మాజి మంత్రి కేఎస్ జవహర్ శ్రీ వైయస్ జగన్ పై ధ్వజమెత్తారు.పోయిన ఏప్రియల్ తరువాత పండుగ అన్న పదమే బ్రహ్మ పదార్థ మైంది ,పాదం మోపిన క్షణం నుండి ప్రతీది అందని ద్రాక్ష అయిందెందుకంటారు , జగన్ గారు .ఏమైనా ! అంటానికి ఎవరినంటే ఎముంది అంతా ఖర్మ పాపమేనా ! అలా సరిపెట్టుకోవలసిందేనా ! అని వ్యంగవిమర్శలు చేశారు.

6. ఫేస్‌బుక్‌లో తన పేరిట ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారంటూ పోలీసులకు శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారుడు శ్రీ రమణ దీక్షితులు ఫిర్యాదు చేశారు. తన ప్రమేయం లేకుండానే తన పేరు… ఫోటో పెట్టి ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్ ఓపెన్ చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

7.డబ్ల్యూహెచ్ఓ వంటి ప్రపంచ సంస్థల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వరకు కరోనాను సీరియస్ గా తీసుకోమని హెచ్చరిస్తుంటే కరోనా పెద్ద సమస్య కాదని, జలుబు, జ్వరంతో సమానమని సీఎం జగన్ సెలవిచ్చారంటూ టిడిపి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.
గతంలో మీరు, మీ పార్టీ చంద్రబాబు, కరువు కవల పిల్లలని పాట పాడారు.మరి ఇప్పుడు ఏమంటారంటూ ప్రశ్నించారు.

8.రాజధాని పరిధిలో ఇళ్ల స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం సిఆర్ డిఏను ఆదేశించింది. గుంటూరు, కృష్ణా కలెక్టర్ల అభ్యర్థనలను పరిగణనలోనికి తీసుకుని చర్యలు ప్రారంభించాల్సిందిగా పురపాలశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఆదేశాలు జారీచేశారు.సుప్రీం, హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని ఉత్తర్వులు

9.తమ ప్రమేయం లేకుండా అధికారులు పింఛను అందజేశారంటూ ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం సీతానాగులవరంలో పదిమంది వాలంటీర్లు రాజీనామా చేశారు.

10. కరోనాపై ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ సమీకరణపై చర్చించారు. ప్రతి జిల్లా ఆసుపత్రికి వెయ్యి పీపీఈలు సరఫరా చేయాలన్నారు. నాలుగు రాష్ట్రస్థాయి కొవిడ్-19 ఆస్పత్రులకు రోజూ 2500 పీపీఈలు పంపుతారు. వైద్యులు, సిబ్బందికి దుస్తులకు సంబంధించిన కొన్ని నమూనాలు పరిశీలించారు.

11. పంచాయతీ రాజ్ ,గ్రామీణాభివృద్ధి,మైనింగ్ శాఖల నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.200.11 కోట్లవిరాళం ప్రకటించారు.ఆ మొత్తాన్ని సీఎం శ్రీ వైయస్ జగన్ కు చెక్ ద్వారా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందించారు.

12. రాష్ర్టవ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లలో
తనిఖీలు నిర్వహించారు. ఆక్వా రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ప్రాసెసింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతూ కూలీల సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తామని అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వ్యాపారులు కొనుగోలు చేయాలని కోరారు.

13.కరోనా మహమ్మారి బాధితులకు ప్రభుత్వ సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
రూ 1300 కోట్లు మంజూరు చేసింది….కరోనా బారిన పడి విలవిల్లాడుతోన్న నిరుపేదలకు ప్రభుత్వం సాయంగా నిలిచింది.దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదల కుటుంబాలకు రూ. వెయ్యిరూపాయల చొప్పున సాయాన్ని చెల్లిస్తారు..

14. కరోనా వైరస్‌ నియంత్రణ నేపథ్యంలో రక్త పరీక్షా కేంద్రాలు, స్క్రీనింగ్‌ యూనిట్లు, ఇతర ఎక్విప్‌మెంటు కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ 186 కోట్లను మంజూరు చేసింది. ప్రభుత్వ ఖజానాలో నిదుల కొరత ఎదురుకావడంతో జిల్లా ఖనిజ నిధి (డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌)నుంచి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు నిధులను వెచ్చిస్తున్నారు.

15.దేశంలో కరోనా కు సంబంధించి 1,964 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 50 మంది మరణించారు. కాగా, కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకువచ్చింది. దీనిపేరు ‘ఆరోగ్య సేతు’.కరోనా పాజిటివ్ బాధితుల వివరాలు ఇందులో ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేస్తుంటారు ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే, ఒకవేళ మీకు సమీపంలోకి ఎవరైనా కరోనా బాధితుడు వస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది.

16.కరోనాపై రాపిడ్‌ యాంటీ బాడీ టెస్టులు నిర్వహించాలని వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) సూచించింది.రద్దీగా ఉండే ప్రాంతాల్లో జనాభా ఎక్కువ ఉన్న చోట్ల ఈ పరీక్షలు నిర్వహించాలని చెప్పింది. గొంతు, ముక్కు రంధ్రాల వద్ద ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో పాజిటివ్‌ వస్తే సంబంధిత వ్యక్తిని చికిత్సకు పంపాల్సి ఉంటుందని వైద్య పరిశోధన మండలి తెలిపింది.

17.మహమ్మారి కరోనా నియంత్రణకై లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ గేబ్రియేసస్‌ ప్రశంసించారు. బలహీన వర్గాలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని అన్నారు..

18.కరోనా కట్టడికి లాక్ డౌన్ ఉల్లంఘిస్తే కాల్చివేతే సరైన చర్య అని ఫిలిప్పీన్స్ కఠిన నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు పోలీసులకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో ఆదేశాలు.

19.గుంటూరు నగరం శివారుప్రాంతమైన పెదకాకాని వై జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తే లారీలో ప్రయాణిస్తున్న 13 మంది లారీ డ్రైవర్లు కనిపించారు.వారిలో 12 మంది గుంటూరులోని పలు ప్రాంతాల వాసులుగా గుర్తించారు.పట్టుబడిన వారు కోల్ కతా నుంచి వస్తున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడించారు.వైద్య పరీక్షల అనంతరం వారిని హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.

20.రాజధాని మహిళలపై అసభ్యపదజాలంతో ఫేస్బుక్ లో పోస్టులు పెట్టినటువంటి కడప జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిపై తుళ్లూరు మహిళలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.రవీంద్రారెడ్డితోపాటు,ఇటువంటి పోస్టులు పెట్టే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుని మా ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూడాలని పోలీసులను కోరారు.

21.తబ్లిగి జమాత్ వల్ల దేశంలో 400 మేర కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకటించింది.

22.దేశమంతా లాక్ డౌన్ అమలులో ఉంది. ఏపీలో మాత్రం ప్రజలెవరూ బయటకు రావద్దని చెప్పాల్సిన ప్రభుత్వమే, ఇసుకను యధేచ్చగా తవ్వుకోడానికి అనుమతులు ఇస్తోంది. తూర్పుగోదావరి జిల్లా తొర్రేడు గ్రామం వద్ద ఏకంగా 200 లారీలను గ్రామస్థులు అడ్డుకున్నారంటే ఏ స్థాయిలో తవ్వకాలు జరుగుతున్నాయో చూడండి. అంటూ తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది.

23. ప్రభుత్వం వద్ద గతేడాదికన్నా రూ.30 వేల కోట్లు అధనంగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలే చెబుతున్నాయి. మరి అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల్లో కోతలు ఎందుకు విధించినట్లు.?రైతుల నుండి పంటలను ఎందుకు కొనుగోలు చేయడం లేదు.కరోనాపై ఖర్చు ఎందుకు తగ్గించినట్లు.? కొత్తగా కరోనా నిర్ధారణ ల్యాబ్స్ ఏర్పాటుకు నిధులు ఎందుకు వెచ్చించడం లేదు.? అంటూ ప్రశ్నలు వేస్తూ టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ కు లేఖ రాశారు.