Food

కరోనా చింత తీర్చే చింత

Tamarind Helps To Fight CoronaVirus

సి-విటమిన్‌ ఎక్కువగా ఉండే చింతకాయలు ఆరోగ్యానికి మంచిదన్నది తెలిసిందే. అయితే అచ్చం చింత రుచిలోనే ఉండే బ్లాక్‌ వెల్వెట్‌ చింతలో విటమిన్‌-సి, ఎలతోపాటు ఫోలిక్‌ ఆమ్లం, నియాసిన్‌, రిబోఫ్లేవిన్‌… వంటి పోషకాలన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా పెరిగే ఈ చెట్లకు కాసే పండ్లలో కూడా చింతలో మాదిరిగానే పండిన తరవాత పెంకు ఊడిపోతుంది. గుజ్జు అచ్చం చింతపండు రుచిలోనే ఉంటుంది కానీ పులుపుకన్నా తీపి ఎక్కువ. ఈ పండ్లతోపాటు చెట్టు ఆకులూ బెరడూ అన్నీ అనేక వ్యాధుల నివారణకు తోడ్పడతాయి. ముఖ్యంగా శ్వాసకోశవ్యాధులకు ఈ పండ్లు మంచి మందులా పనిచేస్తాయి. ఈ పండ్లను నానబెట్టి నీటిని తాగితే జ్వర తీవ్రత కూడా తగ్గుతుందట. డయేరియానీ మూత్రపిండ వ్యాధుల్నీ నిరోధిస్తుంది. ఇందులోని పొటాషియం బీపీ, మధుమేహాలను తగ్గించడంతోపాటు అల్సర్లకీ ఔషధంలా పనిచేస్తుందట. దంతాలమీద పాచినీ బ్యాక్టీరియానీ తొలగించి చిగుళ్లవ్యాధుల్నీ పంటినొప్పినీ కూడా నివారిస్తుంది. నెలసరి సమస్యలతో బాధపడేవాళ్లకి ఈ పండ్లలోని పోషకాలు మందులా పనిచేస్తాయి. పాలు తక్కువగా ఉండే గర్భిణీల్లో ఈ పండ్లు పాలు పడేలా చేస్తాయి. రక్తహీనతనీ తగ్గిస్తాయి. దీని ఆకులూ బెరడు కషాయం మలేరియాకి మంచి మందు. ఇవేకాదు, మరెన్నో వ్యాధుల్ని నియంత్రించే ఈ చింతని ఆరోగ్యంలో భాగంగా చేసుకుంటే మంచిదన్న కారణంతో దీన్ని ఇప్పుడు మనదేశంలోనూ పెంచుతున్నారు.