WorldWonders

తప్పుడు వార్త రాసినందుకు కరోనా అంటిస్తామని బెదిరింపు

Madhya Pradesh Siblings Share Video On Why They Were Threatening About Corona

కరోనా వైరస్‌ అంటిస్తామని బెదిరించిన అక్కాతమ్ముడిపై మధ్యప్రదేశ్‌లోని ఖార్‌గోన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు అక్క చేసిన ఓ వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు చర్య తీసుకున్నారు. అరెస్టయిన అనంతరం ఆమె మరో వీడియో చేశారు. కొవిడ్‌-19 బాధితుడైన తమ తండ్రి గురించి పాత్రికేయులు తప్పుడు వార్తలు రాశారని, దీంతో నిరాశ, కోపం వల్లే ఇంతకుముందు అలా బెదిరించానని ఆమె చెప్పారు. ఈ అక్కాతమ్ముడు చైనాలో వైద్యవిద్యను అభ్యసించారు. వీరి తల్లి కూడా కరోనా బారినపడ్డారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది.