Movies

బాయ్‌ఫ్రెండ్ దర్శకత్వంలో పాయల్

Payal Acts In Her Boyfriend's Short Film

బాయ్‌ఫ్రెండ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఓ షార్ట్‌ఫిల్మ్‌లో పాయల్‌ రాజ్‌పుత్‌ నటించారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో వెండితెరకు పరిచయమై ప్రేక్షకులను అలరించిన నటి పాయల్‌ రాజ్‌పుత్‌. బోల్డ్ తరహా పాత్రతో మొదటి సినిమాతోనే ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్ క్యాన్సిల్‌ కావడంతో పాయల్ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ సౌరభ్ ధింగ్రా డైరెక్షన్‌ తెరకెక్కిన ‘ఏ రైటర్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లో నటించారు.