NRI-NRT

బెజవాడలో ఇప్పటివరకు 10వేల మందికి తానా అన్నదానం

Venkat Koganti Helped 10000 Poor In Vijayawada via TANA

మే 11వ తేదీ నుండి ఇప్పటివరకు రోజుకి 1000మంది తానా ఆధ్వర్యంలో విజయవాడలో అన్నదానం నిర్వహిస్తున్నారు. నేటితో ఈ సంఖ్య 10వేలు దాటినట్లు అన్నదాన కార్యక్రమానికి సమన్వయకర్తగా, దాతగా వ్యవహరిస్తున్న తానా సహాయ కోశాధికారి కోగంటి వెంకట్ తెలిపారు. విజయవాడలో అలంకార్‍ సెంటర్‍, రైల్వేస్టేషన్‍, అన్న క్యాంటీన్‍, బెంజ్‍ సర్కిల్‍, రామవరప్పాడు రింగ్‍ రోడ్డు ఇతర చోట్ల ఈ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో అన్నదాన కార్యక్రమ నిర్వహణకి సహకరించిన మిత్రులు కోనేరు శ్రీకాంత్, శ్రీనివాస్‍ వల్లూరిపల్లిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తానా కార్యవర్గం వెంకట్ సేవలను అభినందించింది.