Politics

తెలంగాణాలో 23 జర్నలిస్టులకు తెరాస ఎమ్మెల్యేకు పాజిటివ్

హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న మరో 23 మంది జర్నలిస్టుల కు కరోనా పాజిటివ్….జర్నలిస్ట్ మనోజ్ మరణం తర్వాత హైదరాబాద్ లోపని చేస్తున్న 140 మంది జర్నలిస్టులు విడతలుగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు…కాగా తాజాగా వీరిలో 23 మంది జర్నలిస్టుల కు కరోనా పాజిటివ్ వచ్చింది.

తెలంగాణలో మరో శాసనసభ్యుడు కరోనా బారినపడ్డారు. నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజులుగా నలతగా ఉండడంతో నిన్న బాజిరెడ్డితో పాటు ఆయన సతీమణికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అవగా.. భార్యకు నెగెటివ్‌ వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే దంపతులు హైదరాబాద్‌కు బయలుదేరారు.