Movies

సోనుది సోనమైన మనస్సు

Sonu Sood Takes 400 Families As Responsibility

లాక్‌డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స కార్మికుల‌కు బాస‌ట‌గా నిలిచిన బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ తాజాగా మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు. దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ కార‌ణంగా మ‌ర‌ణించిన, గాయాల‌పాలైన దాదాపు 400 వ‌ల‌సకార్మిక‌ కుటుంబాల‌ను ఆర్థికంగా ఆదుకుంటాన‌ని హామీ ఇచ్చారు. ‘మృతిచెందిన వ‌ల‌స కార్మికుల కుటుంబాల‌ భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకొని వారికి ఆర్థికస‌హాయం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. వారికి మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం నా వ్య‌క్తిగ‌త బాధ్య‌త‌గా భావిస్తున్నాను’ అని సోనూసూద్ అభిప్రాయ‌ప‌డ్డాడు.