Sports

BMW Maintenance ఖర్చులు భరించలేక….

Here is the reason why Dyuti Chand auctioned her BMW

భారత స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ ఇటీవల తన బీఎండబ్ల్యూ కారు అమ్మకం కోసం సోషల్‌మీడియలో పోస్టు చేయడం, దాన్ని తొలగించడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై బుధవారం ట్విటర్‌ వేదికగా ఓ పోస్టు చేసిన ఆమె అంత లగ్జరీ కారును ఎందుకు అమ్మాలనుకుంటున్నదీ వివరించారు. అందరూ అనుకుంటున్నట్లు శిక్షణ కోసం కాదనీ, ఆ కారుకు అయ్యే నిర్వహణ ఖర్చులు‌ భరించలేక అమ్మాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అలాంటి కారు ఉండటం తనకు ఇష్టమే అయినా, దాన్ని నిర్వహించేంత ఆర్థిక స్థోమత తనకు లేదని చెప్పారు. ఆ కారును ఎక్కువగా వాడటం లేదని, అలాగే తన శిక్షణ కోసమే దాన్ని అమ్మాలనుకుంటున్నట్లు ఎప్పుడూ చెప్పలేదని ఆ ప్రకటనలో వివరించారు.