Food

సోంపుతో కడుపు మంటకు చెక్

సోంపుతో కడుపు మంటకు చెక్

సరైన ఆహార వేళలు పాటించకపోవడం, సరిపడని ఆహారం తినడం వల్ల కడుపులో గ్యాస్‌ చేరుతుంది. దాంతో కడుపూ, ఛాతీలో ఇబ్బందిగా అనిపిస్తుంది. దీన్ని నియంత్రించుకోవడానికి మందులకు బదులుగా వంటింట్లో ఉండే దినుసులను వాడితే సరి…

సోంపు: కడుపులో మంటగా ఉంటే కాసింత సోంపు నోట్లో వేసుకుంటే సరి. లేదా రెండు కప్పుల నీటిలో చెంచా సోంపు వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని రోజులో రెండుమూడుసార్లు తాగితే ఉపశమనంగా ఉంటుంది. భోజనం చేసిన వెంటనే కొంచెం సోంపు నోట్లో వేసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

పుదీనా: దీనిలోని ఔషధ గుణాలు ఉదర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కొన్ని నీళ్లలో గుప్పెడు పుదీనా ఆకులు వేసి మరిగించి వడకట్టి తీసుకుంటే సరి.

లవంగాలు: రోజుకు రెండు మూడు లవంగాలు తినడం వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది. మలబద్ధకం ఉండదు. గ్యాస్‌, కడుపు నొప్పి లాంటి ఇబ్బందులు రావు.

వాము: గ్లాసు నీటిలో అరచెంచా వాము వేసి బాగా మరిగించాలి. దీన్ని కొద్దికొద్దిగా తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

బొప్పాయి: కడుపులో మంట, నొప్పి, మలబద్ధకం లాంటి సమస్యలతో బాధపడేవారు రోజూ దీన్ని ఆహారంలో చేర్చుకుంటే ఈ ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. ఇది పొట్టలోని వాయువులను బయటకు పంపిస్తుంది.