DailyDose

హ్యూస్టన్ దౌత్య కార్యాలయంలో కీలకపత్రాలు తగలబెట్టిన చైనా-నేరవార్తలు

China Diplomat Office On Fire In Houston - Telugu Crime News

* దౌత్యకార్యాలయం ఖాళీ చేయాలని అమెరికా ఆదేశించడంతో కీలక పత్రాలు దహనం చేసిన చైనా అధికారులు!హ్యూస్టన్ నగరంలో ఉన్న చైనా దౌత్య కార్యాలయాన్ని మూసివేయాలంటూ అమెరికా ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆసక్తికర పరిణామాలు జరిగాయి. రాయబార కార్యాలయం ముసుగులో గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపించిన అమెరికా, కార్యాలయాన్ని ఖాళీ చేయాలంటూ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు వెలువడిన కాసేపటికే హూస్టన్ లోని చైనా రాయబార కార్యాలయంలో భారీగా పొగలు వెలువడ్డాయి. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బందిని చైనా దౌత్యాధికారులు లోపలికి అనుమతించలేదు.దాంతో డ్రోన్ లు, నిచ్చెనల సాయంతో అగ్నిమాపక అధికారులు లోపల జరుగుతున్న తతంగాన్ని గమనించారు. పెద్ద ఎత్తున కీలక పత్రాలను దహనం చేస్తున్నట్టు గుర్తించారు. అందుకే అంతగా పొగలు వచ్చినట్టు తెలుసుకున్నారు. అంతేకాదు, చైనా దౌత్యాధికారులు పెద్ద ఎత్తున వాహనాల్లో సామగ్రిని తరలించారు. చైనా గూఢచర్యం ద్వారా రాబట్టిన సాంకేతిక పరిజ్ఞానం, సైంటిఫిక్ డేటాను ఇప్పటివరకు ఈ దేశం సరిహద్దులు దాటిస్తున్నట్టు భావిస్తున్నారు.

* ఏ వో బీ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టుల మృతి.జనుపల్లి..దంగుడుపల్లి అటవీప్రాంతంలో ఘటన.రెండు మృతదేహాలను బలపం పంచాయతీ కి తరలిస్తున్న పోలీసులుమృతిచెందిన మావోయిస్టులను గుర్తించే క్రమంలో మాజీ మావోయిస్ట్ లను సంప్రదిస్తున్న పోలీసులుమృతుల్లో ఓ మహిళా మావోయిస్టు

* సీఎం నియోజకవర్గం పులివెందుల లో ఉద్రిక్తత పరిస్థితి……భూకబ్జాలపై ఆందోళన బాట పట్టిన బాధితులు……కదిరి పులివెందుల ప్రధాన రహదారిపై భైఠాయించి ధర్నాకు దిగిన వెంకటాపురం గ్రామస్తులు..గ్రామ పొలాల నీటి కుంటలు సైతం వదలకుండా కబ్జా చేస్తున్న భూబకాస్వర్లు…ప్లాట్లు వేసి విక్రయిస్తుడటంపై గ్రామస్తుల ఆగ్రహం……కిలోమీటర్ల మేర స్థంభించిన ట్రాఫిక్……కాసేపు ఉద్రిక్త పరిస్థితులు……భూ బకాస్వరుల కబంధహస్తాల నుంచి మా నీటి కుంటలు కాపాడాలంటూ రైతులు గ్రామస్తులు నినాదాలు ……ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తామని నేతలు హామీ ఇవ్వడంతో శాంతించిన గ్రామస్థులు….సీఎం నియోజకవర్గంలో కోట్లల్లో పలుకుతున్న ఎకరం భూమి.జాగా కనిపిస్తే కబ్జా చేసి ప్లాట్లు వేసి విక్రయిస్తున్న కబ్జాదారులు.కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి.

* తాడేపల్లిగూడెం ఎల్.అగ్రహారం క్వారంటైన్ సెంటర్ లో డెలివరీ బోయ్ ల చేతి వాటంబయట నుంచి వచ్చే పార్సిల్స్ లోన ఉన్న కోవిడ్ పేషేంట్లకు తేవాలంటే రూ.50 నుంచి రూ.200 వరకూ వసూలుముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారంటూ కోవిడ్ పేషంట్ల ఆవేదనకాదంటే పార్సిల్ తెచ్చిన చోటే వదిలేస్తున్న డెలివరీ బోయ్స్డబ్బులు లేకుంటే ఫోన్ పే, గూగుల్ పే ల ద్వారా డబ్బులు వేయమంటున్నారంటున్న పేషేంట్లుపార్సిల్ తెచ్చేటప్పుడు, తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు రెండుచోట్లా డబ్బులు వసూలు చేస్తున్నారని వాపోతున్న బాధితులు.

* ★ తమిళనాడులో ఓ కారులో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన రూ. 5 కోట్ల 27 లక్షల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టింది.★ శుక్రవారం నుంచే ప్రాథమిక దర్యాప్తును ఆరంభించింది.★ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదుతో ఈడీ ఈ దర్యాప్తును ప్రారంభించింది.★ మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ అంశంపై దర్యాప్తు చేయాలని రామ్మోన్ నాయుడు ఫిర్యాదు చేశారు.★ దీంతో ఈడీ రంగంలోకి దిగింది.★ ఈనెల 15న తమిళనాడు అరంబక్కంలోని ఎలవూరు చెక్‌పోస్టు వద్ద కారు నుంచి తమిళనాడు పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.★ ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.★ అక్రమంగా నగదు తరలిస్తున్న కారుపై ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో రాజకీయ దుమారం రేపింది.★ అధికార పార్టీకి చెందిన నాయకుల అక్రమార్జనే పట్టుబడిందంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపణలు గుప్పించారు.★ అయితే నగదు తనదేనని బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు చెప్పారు.★ వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ను తన డ్రైవర్ అతికించాడని చెప్పారు. ★ ఆ నగదుకు పత్రాలు ఉన్నాయన్నారు.★ లాక్ డౌన్ సమయంలో చెక్ పోస్టుల వద్ద సులువుగా వెళ్లేందుకు మాత్రమే తన డ్రైవర్ స్టిక్కర్ పెట్టడాని చెప్పారు.★ మరోవైపు ఏపీ మంత్రి బాలినేని అనుచరుడే నల్లమల్లి బాలు అనే ఆరోపణలు గుప్పుమన్నాయి.★ అయితే ఆ నగదుకు తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి ప్రకటించారు.★ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేరుతో ఉన్న స్టిక్కర్ జరాక్స్ కాపీ అని ఐటీ అధికారులు గుర్తించారు.★ బాలుతో తనకు పరిచయం లేదని రాంబాబు చెప్పారు.★ తన స్టిక్కర్ వేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరిన విషయం తెలిసిందే.