DailyDose

బీరూట్ పేలుళ్లో నూతన రహస్యాలు-నేరవార్తలు

బీరూట్ పేలుళ్లో నూతన రహస్యాలు-నేరవార్తలు

* అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో అప్పుల బాధ తట్టుకోలేక రైతు రమేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య.

* తెలంగాణ నుండి ఆంధ్రాకు మద్యం తరలిస్తుండగావిస్సన్నపేట మం మోతిరావుపేట చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు386 మద్యం సీసాలు స్వాధీనంఒక కారు సీజ్ నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేసినట్లు ఎస్సై యం లక్షణ్ తెలిపారు

* అనంతపురం జిల్లా లేపాక్షి సమీపంలో అదుపు తప్పి ద్విచక్ర వాహనం బోల్తా కొండూరు గ్రామానికి చెందిన నగేష్ అనే యువకుడు మృతి.

* లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని పోర్టు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగిన రెండు భారీ పేలుళ్ల ధాటికి పెద్ద పెద్ద భవనాలు సైతం నేలమట్టం అయ్యాయి. భారీ భూకంపం సంభవిస్తే ఏస్థాయిలో విధ్వంసం ఉంటుందో అంతకన్నా ఎక్కువ స్థాయిలో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. పేలుళ్ల ఘటనలో 100 మందికి పైగా మరణించారు. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.ఓడరేవు నుంచి ఇంకా పొగ వస్తూనే ఉన్నది. వీధులన్నీ శిథిలాలు, దెబ్బతిన్న వాహనాలతో నిండిపోయాయి. పరిసర ప్రాంతాల్లో భవనం పైకప్పులు కూడా ఎగిరిపోయాయి. ఈ ప్రమాదంలో 100మందికి పైగా మరణించారని, సుమారు 4వేల మందికి పైగా గాయపడ్డారని లెబనీస్‌ రెడ్‌క్రాస్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు. పేలుళ్లకు కారణమేమిటో ఇప్పటి వరకు తెలియలేదు. గాయపడిన వారి సంఖ్య వేలల్లో ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.ఓడరేవు వద్ద ఓ గిడ్డంగిలో నిల్వ చేసిన 2,700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఒక్కసారిగా పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని ఆదేశ అంతర్గత మంత్రి మొహమ్మద్‌ ఫాహ్మి స్థానిక టీవీ ఛానెల్‌తో చెప్పారు. ఈ పేలుడు వల్ల బీరుట్ ఓడరేవు పూర్తిగా ధ్వంసమైంది.

* రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన బొమ్మన మధు (30) ఇంజినీరింగ్‌ వరకు చదివాడు. చేస్తున్న ఉద్యోగం వదిలేశాక..ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరక్క పోవటంతో ఈనెల మూడో తేదీన కలుపు నివారణ మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో ఎకాఎకిన జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. అంతే కళ్లెదుటే కొడుకు విగతజీవిగా కనబడటంతో తల్లిదండ్రులు మహేశ్వరి, కరుణాకర్‌రావు, సోదరి స్వాతి గుండెలవిసేలా రోదించారు.

* వాహనాల రిజిస్ట్రేషన్‌ అక్రమాల కేసులో అరెస్టయిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. రిమాండ్‌లో ఉన్న వీరిద్దరికి మూడు కేసుల్లో అనంతపురం ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌ -4గా రిజిస్ట్రేషన్‌ చేసిన కేసులో వీరిద్దరిని పోలీసులు గతంలో హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరిని అనంతపురానికి తరలించారు. 154 లారీలకు అక్రమ రిజిస్ట్రేషన్‌ చేశారని ఆర్టీఏ అధికారులు వారిపై అభియోగాలు మోపారు.

* బీమా వైద్య సేవల కుంభకోణం (ఐఎంఎస్‌)లో అవినీతి నిరోధక శాఖ (అనిశా) మరింత పురోగతి సాధించింది. నిందితుడి ఆస్తుల జప్తునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. నిందితుడిగా ఉన్న బాబ్జీ, అతని కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. పలు అక్రమాలకు పాల్పడి కోట్లు కూడబెట్టినట్లు ప్రభుత్వానికి అనిశా లేఖ రాసింది. ల్యాబ్‌ కిట్ల విక్రయంతో పాటు పలు అక్రమాలకు పాల్పడినట్లు తన లేఖలో పేర్కొంది. బినామీ పేర్లతో రూ.162 కోట్లకుపైగా ఆస్తులను కూడబెట్టినట్లు అనిశా గుర్తించింది. మరోవైపు బాబ్జీ అక్రమాలపై అనిశా న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.