Devotional

నేటి నుండి శ్రీశైలం దర్శనాలు ప్రారంభం

నేటి నుండి శ్రీశైలం దర్శనాలు ప్రారంభం

శ్రీశైల దేవస్థానంలో ఆగస్టు 14 నుండి దర్శనాలు తిరిగి ప్రారంభం.

శ్రీశైలమహాక్షేత్రంలో ని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాలు ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 5.30 గంటల నుండి7.30 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు.

10 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయసు ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు.

దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా ఆన్ లైన్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అలాగే భక్తులు తమ వెంట ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు.