DailyDose

ప్రారంభమైన రష్యా వ్యాక్సిన్ ఉత్పత్తి-తాజావార్తలు

ప్రారంభమైన రష్యా వ్యాక్సిన్ ఉత్పత్తి-తాజావార్తలు

* కరోనాతో విలవిల్లాడుతున్న ప్రపంచం ముందుకు వ్యాక్సిన్‌ను తీసుకొచ్చామని ప్రకటించి అందరినీ రష్యా ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశం మరో మందుడుగు వేసినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని ప్రారంభించినట్లు సమాచారం. అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు చెప్పినట్లు ఇంటర్‌ఫ్యాక్స్‌ అనే న్యూస్‌ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది.

* కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి మొట్టమొదటి టీకాను పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు రష్యా ప్రకటించింది. ఇప్పటికే రెండు దశల ప్రయోగాలు పూర్తి చేసుకుని.. కీలకమైన మూడో దశ ప్రయోగాల్లోకి అడుగుపెడుతోంది. దీంతో ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తిపై అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌కు చెందిన కంపెనీలు కూడా ఫేజ్‌-1, ఫేజ్-2 క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన సాంకేతిక సమాచారం కోరినట్లు ఆ దేశ మీడియా స్పుత్నిక్‌ పేర్కొంది. వ్యాక్సిన్‌ దేశీయ ఉత్పత్తికి, ఎగుమతికి కూడా అనుమతి కోరినట్లు తెలిపింది. ఈ మేరకు రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌)తో చర్చించినట్లు పేర్కొంది.

* ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(కేకేఆర్‌) ప్రస్థానం ప్రత్యేకం. ఇప్పటివరకు ఆ జట్టు నలుగురు సారథులను మార్చింది. అయితే, అందరిలో ఎక్కువకాలం సారథ్య బాధ్యతలు చేపట్టిన గౌతమ్‌ గంభీర్‌.. ఆటగాళ్లకు భరోసానిచ్చాడని, అలాగే ఉత్తమ సారథిగా నిలిచాడని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. తాజాగా అతడు కేకేఆర్‌ జట్టు ప్రయాణంపై తన యూట్యూబ్‌ ఛానల్‌లో స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా కోల్‌కతా ప్రిన్స్‌ సౌరభ్‌ గంగూలీని తొలగించి దిల్లీ బ్యాట్స్‌మన్‌ గౌతమ్‌ గంభీర్‌ను ఆ జట్టు సారథిగా మార్చడం కీలక మలుపు అని వ్యాఖ్యానించాడు.

* ప్రధాని జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ముందు ఎన్నోరోజుల నుంచే ఎర్రకోట వద్ద అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తుంటారు. దానిలో భాగంగానే ఈసారి భారత్‌లో తయారైన యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ కూడా ప్రధాని మోదీ భద్రతను తన లేజర్‌ కళ్లతో పర్యవేక్షించింది. ఇది వేదిక సమీపంలో ఆకాశం మొత్తాన్ని స్కాన్ చేసి, డ్రోన్ల జాడను పట్టేస్తుంది. డీఆర్‌డీఓ అభివృద్ది చేసిన ఈ లేజర్ ఆయుధం ఎర్రకోటకు సమీపంలోని మూడు కిలో మీటర్ల పరిధిలో తిరుగాడే మైక్రో డ్రోన్లపై కన్నేసింది. ఇది వాటిని గుర్తించి, కదలకుండా చేయగలదు. అలాగే దేశ పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో ఇటీవల కాలంలో పెరిగిన డ్రోన్‌ కార్యకలాపాలను ఇది సమర్థవంతంగా ఎదుర్కోగలదని వారు వెల్లడించారు. కాగా, దిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో రోజూ ఎనిమిది వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో (9అం-9అం) కొత్తగా 8,732 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,81,817కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 88,138 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,91,117మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ఒక్క రోజులో 10,414 మంది కోలుకున్నారని వెల్లడించింది. గత 24 గంటల్లో 53,712 నామూనాలు పరీక్షించగా.. ఇప్పటి వరకు మొత్తం 28,12,197 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

* కరోనాతో పోరాడుతూ ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ తన తండ్రి అభిమానులు, శ్రేయోభిలాషులకు ఆడియో సందేశాన్ని పంపారు. ‘‘ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. నిన్న వెంటిలేటర్‌‌పై ఉంచడం ఆయనకు ఎంతో ఉపయోగపడింది. నెమ్మదిగా కోలుకుంటున్నారు. త్వరలోనే ఆయన ఈ పరిస్థితి నుంచి బయటపడి సాధారణ స్థితికి వచ్చేస్తారు. నాన్నగారి ఆరోగ్యంపై నేను అప్‌డేట్‌ ఇస్తాను’’ అని చరణ్ సందేశంలో‌ తెలిపారు.

* తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదలు రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదలపై రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సీఎస్‌, డీజీపీ మంత్రులతో సీఎం మాట్లాడారు. వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. జిల్లాల పరిస్థితిని సమీక్షించి తగు సూచనలు చేశారు. హైదరాబాద్‌లో రెండు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

* 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. అటు పాకిస్థాన్‌కు, ఇటు చైనాకు హెచ్చరికలు జారీ చేశారు. ఎల్‌ఓసీ నుంచి ఎల్‌ఏసీ వరకూ దేశ సార్వభౌమత్వానికి సవాలు విసిరిన వారికి భారత సైన్యం తగిన రీతిలో సమాధానమిచ్చిందని పేర్కొన్నారు. ఉగ్రవాదంతోపాటు విస్తరణవాదంపై కూడా భారత్‌ కృత నిశ్చయంతో పోరాడుతోందని స్పష్టం చేశారు.

* ప్రముఖ వీడియో యాప్‌ టిక్‌టాక్‌కు ట్రంప్‌ కొంత ఊరటనిచ్చారు. అమెరికాలో ఆ కంపెనీ కార్యకలాపాల్ని నిలిపివేయడమో లేదా తమ దేశకంపెనీకి విక్రయించడమో చేసేందుకు ఇచ్చిన గడువును తాజాగా పొడిగించారు. గతంలో ఈ గడువు 45 రోజులు కాగా.. దాన్ని మరో 45 రోజులు పొడిగించారు. ఈ మేరకు మరో కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు. దీంతో టిక్‌టాక్‌కు నవంబర్‌ 12 వరకు గడవు లభించింది.

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను మీడియాతో వెల్లడిస్తున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఇవాళ కూడా మీడియా ముందుకొచ్చారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ నూతన జాతీయ విద్యావిధానంపై తన ప్రసంగంలో ప్రస్తావించారు. దీనిపై రఘురామ్‌ స్పందిస్తూ.. తెలుగు నేర్చుకోవడాన్ని అంటరానితనంతో సీఎం పోల్చడం బాధాకరమన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని కొందరు అడ్డుకుంటున్నారని చెప్పడం దురదృష్టకరమని చెప్పారు.

* కరోనాతో విలవిల్లాడుతున్న ప్రపంచం ముందుకు వ్యాక్సిన్‌ను తీసుకొచ్చామని ప్రకటించి అందరినీ రష్యా ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశం మరో మందుడుగు వేసినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని ప్రారంభించినట్లు సమాచారం. అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు చెప్పినట్లు ఇంటర్‌ఫ్యాక్స్‌ అనే న్యూస్‌ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది.

* ఒకప్పుడు మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థే కాల్‌ చేసి ఈ పాట కావాలా? ఆ పాట కావాలా? అంటూ వినిపించి.. నచ్చిన దాన్ని కాలర్‌ ట్యూన్‌గా సెట్‌ చేసేది. ఇప్పుడు అలాంటి కాల్స్ ‌రావడం దాదాపుగా తగ్గిపోయాయి. డిజిటల్‌ యుగంలో మొబైల్‌ నెటవర్క్స్‌ సంస్థలు సొంతంగా మ్యూజిక్‌ యాప్స్‌ను తీసుకొచ్చి.. ఆ యాప్‌లో నచ్చిన పాటను కాలర్‌ట్యూన్స్‌గా సెట్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి.

* ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా తమ ప్రభుత్వ హయాంలో మహిళలకు ఇస్తోన్న ప్రాముఖ్యతను చాటిచెప్పారు. మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ..శానిటరీ ప్యాడ్లను రూపాయికే అందజేస్తోన్న విషయాన్ని వెల్లడించారు. బహిరంగంగా మాట్లాడటానికి ఇప్పటికీ ఇష్టపడని రుతుక్రమం అంశంపై ప్రధాని చూపిన చొరవకు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి.

* ఆగస్టు 15.. భారతదేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు. తెల్లదొరలపై పోరాటంలో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలకు ప్రతిఫలం దక్కిన రోజు. 1947లో బ్రిటీష్‌ పాలకుల నుంచి స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి ఏటా ఆగస్టు 15న భారతీయులమంతా గర్వంగా.. ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటూ ఉన్నాం. మనం సరే.. ఇదే రోజున మనతోపాటు మరికొన్ని దేశాలు కూడా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని మీకు తెలుసా?

* మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దేశభక్తి చిత్రం ‘రోజా’. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఇందులోని ‘వినరా.. వినరా.. దేశం మనదేరా’ పాటను 5 భాషల్లో 65మంది గాయకులు ఆలపించారు. ‘టుగెదర్‌ యాజ్‌ వన్‌’ పేరుతో తీర్చిదిద్దిన ఈ పాటను రామ్‌చరణ్‌ విడుదల చేశారు.