Fashion

మాటే మహిమాన్వితం

మాటే మహిమాన్వితం

మనలో ఎంతో మంది పది మందిలో కూరుంటే చక్కగా కబుర్లు చెప్పగలవారే. ఏదైనా స్టేజ్‌పైన నాలుగు మాటలు చెప్పవలసి వస్తే ఎంతో కంగారు పడతారు. అలాగే మనలో ఎంతో మంది విద్యాధికులు, ప్రపంచ విషయాల పట్ల కుతూహలం, అవగాహన ఉన్నవాళ్లే. కానీ ఎవళ్లతో మాట్లాడకుండా బిడియంగా ఉంటారు. ఇలాగే ఆఫీసుల్లో పబ్లిక్ ప్లేసుల్లో ముడుచుకుపోయి కూర్చుంటే మానవ సంబంధాలు తక్కువై పోతూ ఉంటాయి. ఎంతోమందిలో ఈ బిడియం వాళ్లను వెనకే ఉండిపోయేలా చేస్తాయి. ఈ బిడియం వదిలించుకోగలిగితే కానీ కొత్త అనుబంధాలు మొలకెత్తవు. సంతోషంగా సరదాగా ఉండలేరు. పైగా ఇప్పుడు ఇంటర్ నెట్ ఈ మెయిల్స్ వచ్చాయి. ఆ కాస్త మనుషులను కలుసుకోవటం, వాళ్లతో ధారాళంగా మాట్లాడే అవసరమే లేకుండా పోతుంది. ఒక చిన్న మెసేజ్‌తో పనులయిపోతాయి. ప్రతిఫలం ఆశించకుండా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సాగిపోతేనే ఏ సమాజం అయినా అభివృద్ధి బాటలో నడుస్తుంది. సహాయం అంటే మాట సాయం, పలకరింపు, చిన్ని ఓదార్పు, స్నేహంతో కూడిన సంభాషణ. వ్యక్తుల్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. అసలెందుకు కొందరే బాగా మాట్లాడతారు. కొందరు ఎందుకు నోరు విప్పరు అంటే అది చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు కూడా అంటారు నిపుణులు. మన ఇళ్లలో పెద్దవాళ్లు మాట్లాడుతూ ఉంటారు. వాళ్లు తమకంటే చిన్నవాళ్లని కొన్ని పదాలతో పలకరిస్తారు నీకేం తెలుసు, నోర్మూసుకో, ఎక్కువ మాట్లాడకు, చిన్నా పెద్దా లేదా, సలహాలు ఇచ్చేంత వాడివా, అసలు నీకు ఈ పని అప్పగించటం నాదే తప్పు.” ఇలాంటి పదాలు ఎదుటివాళ్లను నిరాశ పరుస్తాయి. వా ళ్లపైన వాళ్లకి విశ్వాసం తగ్గిస్తాయి. కానీ మన శరీరంలోని అన్ని ప్రధాన భాగాలు ఈ ప్రకృతితో సాటి మనుషులతో సం బంధాలు ఏర్పరుచుకొనేందుకే ఏర్పడ్డాయి పనిచేస్తాయి. కళ్లతో చూస్తాం, చెవులతో విం టాం, ఎదుటివాళ్ల భాషను అర్థం చేసుకుంటాం. మనస్సుతో, బు ర్రతో, బుద్ధితో దాన్ని విశ్లేషించుకొని మన కంఠం విప్పి సమాధానం చెప్పి ఒక కమ్యూనికేషన్ ఏర్పరుచుకుంటాం. ఈ పనులన్నీ చు ట్టూ సమాజం లో మన సంబంధాలు మెరుగుపరిచేవి కదా! మరి అలాంటప్పుడు కంఠం ఎందుకు సవరించుకోం అది ఒక చక్కని వా యిద్యం వంటిది. ఆరోహణ అవరోహణలను పలికిస్తుంది, లాలనగా మాట్లాడుతుంది, కోప్పడుతుంది, ప్రేమిస్తుంది. ఒక పసిబిడ్డతో ఎదిగిన పిల్లల తో, భార్యతో, ఆఫీసు కొలిగ్స్‌తో, తల్లిదండ్రులతో ఒక భిన్నమైన స్వ రంతో మాట్లాడతాం. మన భాష కంఠం తో ఎన్నో వి ధాలుగా అవతలవాళ్లకు చేరుతుంది. చక్కగా మాట్లాడితేనే మనకు సంఘంతో సమాజంతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇలాంటి మాటలని మనం ఎంత చక్కగా ఉపయోగించు కోవాలి?
*సిగ్గు పడటం వదిలేయాలి
మనలో బిడియం పోతేనే కొత్త సంబంధాలు వస్తాయి. సరైన ఉద్యోగాలు,సమాజంలో గుర్తింపు వస్తాయి. ముక్త్తసరి సమాధానాలు ఎదుటివాళ్ల మ నసులకు ఎక్కవు. మాటలు వేదమంత్రాలతో సమానం. ఎవరైనా, ఎం త గొప్పవాళ్లయి నా, ఎంతటి కుటుంబ హోదా ఉన్నా, అందమైన పర్సనాలటీ ఉన్నా కమ్యూనికేషన్ లేకపోతే అవన్నీ వృథా. మాటలు మాట్లాడటం ఒక ఆర్ట్‌లాగే అభ్యసించవచ్చు. తడుముకోకుండా స్పష్టంగా మాట్లాడే వ్యక్తి ఎవరితోనైనా పరిచయం చేసుకోగలడు. ఎలాం టి కష్టతరమైన, అసాధ్యమైన అంశాన్ని కూడా సాధ్యం చేసుకోగలడు మాటకుండే శక్తి అది. సాధారణంగా ఒక పార్టీలోకి లేదా పదిమంది ఉన్న సమూహంలోకి వెళ్లినప్పుడు ఎదుటి వాళ్ల కళ్లలోకి చూస్తే వారి తో మనం మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని అర్థం అయిపోతుందట. ఆ తరవాత మనం ఎక్కడికి వెళ్లామో, ఎందుకు ఎవరితో మాట్లాడుతున్నామో మనసులోఊహించుకుంటూ మాటలు మొదలుపెట్టొచ్చు. అలాగే మాట్లాడాలంటే అసలు విషయ పరిజ్ఞానం ఉండాలి. ప్రపంచం లో జరిగే విషయాలు, రాజకీయాలు, క్రీడ లు, సినిమాలు వీటిపైనఅవగాహన ఉండాలి. మనం వెళ్లిన ప్రదేశంలో ఎంతో మందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్లకు నచ్చే అంశాలు ఎన్నో ఉంటాయి. సందర్భవశాత్తూ కొన్ని మాటలు దొర్లితే, ఎదుటివాళ్ల అభిరుచిని బట్టి సంభాషణ కొనసాగించాలి అంటే ముందు మనకు అన్ని విషయాల పట్ల కనీస పరిజ్ఞానం ఉండాలి. ఆఫీసులో, ఉద్యోగంలో, సమాజంలో చక్కని చిన్న సంభాషణలే ఎంతో ఉపయోగ పడతాయి. మాటకారితనం మనుషుల్ని ముందు వరసలో నిలబెడుతుంది.
*తప్పక వినాలి కూడా
మంచి శ్రోత కాని వాళ్లు మంచి వక్తలు కూడా కాలేరు. మనం రోజూ ఎన్నో ప్రసంగాలు చేసే నాయకులను చూస్తూ ఉంటాం. వాళ్లు చక్కగా వినటం వచ్చిన వాళ్లూ కూడా. చుట్టూ వేర్వేరు ప్రాంతాల్లో ఉండే కార్యకర్తలు చెబుతున్న విషయాలు శ్రద్ధగా విని, ఆ ప్రాంతాల్లో ఉండే సమస్యలు అవగాహన చేసుకుని, దానిని ప్రజల ముందుకు, ప్రభుత్వం ముందుకు తీసుకు వస్తారు. ఎంతో చక్కని వక్తలయితే అంత చక్కని శ్రోత అయి ఉంటారు. ఏ మనిషీ నేర్చుకోకుండా మంచి స్పీకర్ అవలేడు. నేర్చుకోవాలంటే విని తీరాలి మాట్లాడటం వచ్చాక వినటం మానేస్తే ఇక ఒక రకంగా అభివృద్ధి ఆగిపోయినట్లే. “వినదగు ఎవ్వరు చెప్పినా” అంటాడు సుమతీ శతకకారుడు. ఈ ప్రపంచంలో వృద్ధిలోకి రావాలనుకున్న ప్రొఫెషనల్స్‌కి కొన్ని లక్షణాలు ఉండాలి వినటం, మాట్లాడటం ముందుగా ఉండాలి. ఆ తరువాతే బాగా చదవటం, బాగా డ్రాఫ్ట్ చేయటం మిగిలినవన్నీ. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషీ ఒకళ్లమాట ఒకళ్లు వినాలి. మన మనసు నిమిషానికి వంద పదాలు విని అర్థం చేసుకోగలుగుతుంది ఆలోచించి, విశ్లేషిస్తుంది. ఇలా వింటే ఎలా విన్నా దాన్ని మాట్లాడగలమో అభ్యాసంతో వస్తుంది. ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే చక్కగా మాట్లాడటం రావాలి బాగా మాట్లాడాలి. బాగా మాట్లాడాలి అంటే బాగా వినాలి. వినటం కూడా గొప్ప లక్షణమే!