Sports

రష్యాతో కలిసి చరిత్ర సృష్టించిన కోనేరు హంపి

రష్యాతో కలిసి చరిత్ర సృష్టించిన కోనేరు హంపి

ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది. రష్యాతో కలిసి ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ని సొంతం చేసుకుంది. ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ తొలిసారి స్వర్ణం సాధించింది. 93 ఏళ్ల చెస్‌ ఒలింపియాడ్ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. భారత్‌ను విజేతగా నిలపడంలో కోనేరు హంపి కీలక పాత్ర పోషించారు. ఫైనల్‌లో రష్యాకు చెందిన అలెగ్జాండ్రాతో తలపడ్డారు. మ్యాచ్‌ డ్రా కావడంతో ఫిడే అధ్యక్షుడు డ్వోర్కోవిచ్‌ భారత్‌- రష్యాను ఉమ్మడి విజేతగా ప్రకటించారు. తొలి రౌండ్‌ 3-3 పాయింట్లతో డ్రా అయ్యింది. అయితే రెండో రౌండ్‌ కొనసాగుతుండగా ఇంటర్నెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. అప్పటికి రష్యా 4.5-1.5 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో తొలుత రష్యాను విజేతగా ప్రకటించినప్పటికీ.. కాసేపటి తర్వాత డ్రాగా తేల్చారు. భారత్‌-రష్యాలను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.