Movies

సీతగా అవకాశం?

సీతగా అవకాశం?

ప్రభాస్‌ కథానాయకుడిగా ‘ఆదిపురుష్‌’ తెరకెక్కబోతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం సన్నాహాలు ఊపందుకున్నట్టు తెలుస్తోంది. నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టింది చిత్రబృందం. రామాయణంలోని ఓ ఘట్టం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీరాముడిగా ప్రభాస్‌ నటిస్తారు. సీత పాత్ర విషయంలో పలువురు కథానాయికల పేర్లు తెరపైకొస్తున్నాయి. తాజాగా కియారా అడ్వాణీ పేరు వినిపిస్తోంది. చిత్రబృందం ఆమెని సంప్రదించారని తెలిసింది. ఇటీవల దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ కథానాయిక పేరూ వినిపించింది. మరి సీత పాత్రలో ప్రభాస్‌ సరసన సందడి చేసే ఆ భామ ఎవరనేది తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాల్సిందే. ప్రభాస్‌ త్వరలోనే ‘రాధేశ్యామ్‌’ చిత్రాన్ని పూర్తి చేయడం కోసం రంగంలోకి దిగుతారు.