Food

వాల్‌నట్స్‌తో అదుపులోకి మధుమేహం

వాల్‌నట్స్‌తో అదుపులోకి మధుమేహం

బిజీ లైఫ్.. జీవనశైలి సమస్యల వల్ల డయబెటీస్ ఇప్పుడు చిన్నవయస్సులోనే దాడి చేస్తోంది. ఆ మహమ్మారికి చిక్కకుండా ఉండాలంటే.. తప్పకుండా వాల్‌నట్స్ తీసుకోవాలట.

మధుమేహం (డయాబెటీస్) ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ వచ్చేస్తోంది. ఒకప్పుడు వయస్సు మీదకు వచ్చినప్పుడు మాత్రమే ఈ వ్యాధి బయటపడేది. ఇప్పుడు మారిన జీవశైలి, ఒత్తిడి వల్ల ఇది సాధారణ వ్యాధిగా మారిపోయింది. చిన్న వయస్సులోనే ఈ వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఒకవేళ డయబెటీస్‌కు గురైనట్లే అస్సలు ఆందోళనకు గురికావద్దు. శరీరంలో ఇన్సులిన్ మోతాదు ఏ స్థాయిలో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. వైద్యుల సూచనతో సమయానికి మందులు తీసుకుంటూనే.. ఆహార నియమాలు పాటించండి. అయితే, మీ డైట్‌లో తప్పకుండా వాల్‌నట్స్‌ను చేర్చండి.

డయబెటీస్ భయం మీమ్మల్ని వెంటాడుతుంటే.. తప్పకుండా వాల్‌నట్స్ తినండి. దీనివల్ల టైప్-2 డయబెటీస్ ముప్పు తగ్గుతుందని ఓ పరిశోధనలో తెలిసింది. రోజూ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వాల్‌నట్స్ తీసుకునేవారితో పోలిస్తే 3 టేబుల్ స్పూన్ల వాల్‌నట్స్ తినేవాళ్లలో

మధుమేహం ముప్పు 47 శాతానికి తగ్గిందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు గుర్తించారు. రోజుకు 28 గ్రాములు లేదా 4 టేబుల్ స్పూన్ల వాల్‌నట్స్ తిన్నట్లయితే ఈ ముప్పు తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మధుమేహంతో ఉన్నవారు వీటిని తింటే.. బ్లడ్ సుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని తెలుపుతున్నారు.