Sports

రికార్డులు బద్ధలు

Swedish Pole Walter Armand Duplantis 2020 Record

పోల్‌వాల్ట్‌లో అనితర సాధ్యమైన రికార్డులు నెలకొల్పాడు ఉక్రెయిన్‌ స్టార్‌ సెర్గీ బుబ్కా. అవి ఏళ్ల తరబడి నిలిచి ఉన్నాయి. అలా 26 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఓ రికార్డును స్వీడన్‌ అథ్లెట్‌ ఆర్మండ్‌ డుప్లాంటిస్‌ బద్దలు కొట్టాడు. రోమ్‌లో జరుగుతున్న గోల్డెన్‌ గాలా అథ్లెటిక్‌ మీట్‌లో పురుషుల పోల్‌వాల్ట్‌ ఔట్‌డోర్‌ పోటీల్లో రెండో ప్రయత్నంలో 6 మీటర్ల 15 సెంటీమీటర్లు ఎగిరిన ఈ స్వీడన్‌ స్టార్‌.. 1994లో బుబ్కా (6.14 మీటర్లు) నెలకొల్పిన రికార్డును దాటేశాడు. ఈ ఫిబ్రవరిలో గ్లాస్గోలో జరిగిన అథ్లెటిక్స్‌ మీట్‌లో డుప్లాంటిస్‌ ఇండోర్‌ ప్రపంచ రికార్డు (6.18 మీటర్లు)ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ‘‘ఎట్టకేలకు ఔట్‌డోర్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పా. 6.15 మీటర్లు దూకాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఈ ఘనత సాధించిన తర్వాత ఎంతో సంతోషంగానే కాదు భారం తీరినట్టు ఉంది’’ అని 20 ఏళ్ల డుప్లాంటిస్‌ చెప్పాడు. వయసు విభాగాల టోర్నీల్లోనూ రికార్డులు సృష్టించిన డుప్లాంటిస్‌.. పెరిగింది అమెరికాలో అయినా, తాను పుట్టిన స్వీడన్‌ తరఫున పోటీ పడుతున్నాడు.