Politics

వివేకా కేసు చరిత్ర మొత్తం CBI వద్దకు

వివేకా కేసు చరిత్ర మొత్తం CBI వద్దకు

వైఎస్ వివేకా హత్య కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు..!

మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసుపై తాజాగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను సీబీఐకు వెంటనే అందజేయాలని పులివెందుల మెజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది.

వివేకా హత్యకు సంబంధించి తమకు రికార్డులు ఇవ్వాలని సీబీఐ అధికారుల బృందం పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అయితే దీనిపై తమకు పై నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని, రికార్డులు ఇవ్వడం సాధ్యం కాదని మెజిస్ట్రేట్ కోర్టు తెలిపింది.

దీంతో ఈ కేసుకు సంబంధించి రికార్డులను తమకు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది.

ఈ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు వివేకా కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను సీబీఐకు అప్పగించాలని పులివెందుల మెజిస్ట్రేట్‌కు హైకోర్టు సూచించింది.

అయితే ఈ కేసు విచారణ చేపట్టిన బృందంలో చాలా మంది అధికారులు కరోనా బారిన పడడంతో కొద్ది రోజులుగా కేసు విచారణకు బ్రేక్ పడింది.

అయితే ఇప్పుడిప్పుడే అధికారులు కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకోవడంతో సీబీఐ ఈ కేసుపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టబోతుంది.