ScienceAndTech

అమెరికాపైకి సోలార్ ఫ్లేమ్

Solar Flames To Attack On USA - Telugu Tech News

సౌరతుఫాను భూమివైపు దూసుకువస్తోంది. నేడు కెనడా, ఉత్తర యునైటెడ్‌ స్టేట్స్‌ వద్ద దీని ప్రభావం చూపనుంది. దీనివల్ల జీపీఎస్‌ పొజిషనింగ్‌లోపాలు కలిగి, కమ్యూనికేషన్‌ వ్యవస్థకు అంతరాయం కలుగొచ్చని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. ఈ వారం ప్రారంభంలో సూర్యుడి నుంచి ఒక సౌర మంట (సోలార్‌ ఫ్లేమ్‌) పేలింది. దీనివల్ల సౌర తుఫాను నెమ్మదిగా భూమి వైపు విస్తరించింది. కెనడా, ఉత్తర యునైటెడ్ స్టేట్స్ అంతటా భూ అయస్కాంత తుఫాను, నార్తర్న్ లైట్స్(తీవ్రమైన కాంతిపుంజం) ప్రభావం కనిపించనుంది. సోమవారం ఏఆర్‌2790 అని పిలిచే సన్‌స్పాట్‌నుంచి సౌరమంట ప్రారంభమైంది. మొదట్లో ఇది సాధారణంగానే ఉన్నా క్రమంగా బలపడిందని అంతరిక్ష వాతావరణ శాస్త్రవేత్తలు వివరించారు. చికాగో, డెట్రాయిట్, బోస్టన్, సీటెల్ వరకు దక్షిణాన అరోరా బోరియాలిస్ (నార్తర్న్ లైట్స్) ఏర్పడనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.