Politics

శశికళకు తీవ్ర అస్వస్థత-తాజావార్తలు

శశికళకు తీవ్ర అస్వస్థత-తాజావార్తలు

* శశికళకు అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి !మరో వారం రోజుల్లో విడుదల కానున్న శశికళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం.జ్వరంతో బాధపడుతున్న ఆమెను హుటాహుటిన బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి ఆస్పత్రికి తరలించినట్లు చెబుతున్నారు. లెక్క ప్రకారం ఈ నెల 27వ తేదీన శశికళ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. 2016లో జయలలిత చనిపోయిన వెంటనే అన్నాడిఎంకె అధినేత్రిగా శశికళ బాధ్యతలు స్వీకరించారు.అయితే కొద్దిరోజుల్లోనే ఆమె అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి బెంగుళూరు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి కావడంతో ఆమె ఇప్పుడు విడుదల అవుతున్నారు.అయితే త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె జైలు నుంచి విడుదల కావటం రాష్ట్రంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

* శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభినయ్.. కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని తపన స్వచ్ఛంద సంస్థ చైర్మన్ గారపాటి చౌదరి పిలుపునిచ్చారు. దెందులూరు నియోజకవర్గంలో అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభయాన్ కార్యక్రమం ప్రారంభించారు.. అనంతరం చౌదరి మాట్లాడుతూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిర్మాణానికి 1,23,456 రూపాయలు విరాళంగా ఇచ్చా రు. విరాళాల సేకరణకై వస్తున్న రామ సైనికులను స్వాగతించి సహకరించాలని కోరారు రామ భక్తులు 492 సంవత్సరాలుగా నిరంతరం సంఘర్షణ సాగిస్తున్నారని ఈ సంఘర్షణలో లక్షకు పైగా రామభక్తులు బలిదానం ఇచ్చారని ఫలితంగా సమస్త జాతి, వర్గ ,భాష,సాంప్రదాయ బేధం లేకుండా శ్రీ రామ మందిరం కోసం త్యాగాలు చేశారన్నారు. ఈ కార్యక్రమాన్ని దెందులూరు నియోజకవర్గంలో వరుసగా ఏడు రోజులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలంతా మమేకమై ఈ కార్యక్రమంలో పాలుపంచు కుని అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరు తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరుతున్నామని తెలిపారు. భగవాన్ శ్రీ రాముడి భవ్య మందిర నిర్మాణానికి సమస్త సమాజం నుండి సాత్విక దానాన్ని,కోరుతూ ఆ నిధి సమర్పణ కై పిలుపు ఇస్తున్నామని తెలిపారు. మనం అందరం దృఢ సంకల్పంతో,సామూహిక పురుషార్థం తో మళ్లీ రామరాజ్యాన్ని పునః ప్రతిష్ఠ చేయడానికి కంకణ బద్దుల మౌదామన్నారు . ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు కోడూరు లక్ష్మీనారాయణ, పలువురు రామమందిర నిర్మాణం సేవకులు పాల్గొన్నారు.

* కామారెడ్డి జిల్లా జుక్కల్,నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కవిడ్ వ్యాక్సిన్ టీకా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి.జిల్లా కోవిడ్ ఇంచార్జ్ డాక్టర్ శ్రీషా తహసీల్దార్ సత్యనారాయణ డాక్టర్ రాధాకృష్ణ మరియు సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు

* వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రాజభవన్ ముట్టడించడానికి వెళ్లిన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్ శైలజానాథ్, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ తులసి రెడ్డి, మస్తాన్ వలి, పార్టీ మహిళా నాయకురాలు సుంకర పద్మలతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గపు చర్య అని పెనుకొండ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ పాలసముద్రం నరశింహులు తీవ్రంగా మండిపడ్డారు.

* రాష్ట్రంలో విద్యుత్ వాహ‌నాల త‌యారీ ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు రెండు పారిశ్రామిక సంస్థ‌లు ముందుకు వ‌చ్చాయ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మలు, పెట్టుబ‌డుల శాఖామంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి తెలిపారు. ఆయ‌న విజ‌య‌న‌గ‌రంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్ర‌తిపాద‌న‌లు ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ని అన్నారు. అదేవిధంగా సోలార్ సెల్స్‌ త‌యారీ ప‌రిశ్ర‌మ కూడా రాబోతుంద‌ని చెప్పారు. సుల‌భ‌త‌ర వాణిజ్యంలో భాగంగా, ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఈ ఏడాది తొలి వ‌ర్క్‌షాపును విజ‌య‌న‌గ‌రంలో ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా, పారిశ్రామిక రంగం కూడా దెబ్బ‌తిన్న‌ద‌ని, అయితే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి ఇచ్చిన ప్ర‌త్యేక ప్యాకేజీ, రాయితీలు కార‌ణంగా తిరిగి కోలుకుంద‌ని చెప్పారు. సేల్స్ టేక్స్‌, ఉపాధి క‌ల్ప‌న‌లో సాధించిన ప్ర‌గ‌తే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి దూర‌దృష్టి, తీసుకున్న చ‌ర్య‌లు కార‌ణంగా, పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డంలో మ‌న రాష్ట్రం, మ‌హారాష్ట్ర త‌రువాత‌ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింద‌ని మంత్రి తెలిపారు.

* కూకట్పల్లి నియోజకవర్గం లో ఈరోజు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలోని బేగంపేట బాలానగర్ బాలాజీ నగర్ కెపిహెచ్బి డివిజన్లలో అభివృద్ధి పనులకు మంత్రులు ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మినీ ఇండియాగా భావించే కూకట్ పల్లి నియోజకవర్గం లో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. తాగునీరు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఫ్లైఓవర్లు అండర్ పాస్ లు వంటి కనీసం మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

* విశాఖ వేదికగా స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 12 వ తేదీ నుంచి జరిగే జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయి. విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ , మాజీ శాసనసభ్యులు మళ్ల విజయప్రసాద్ తదితరులు జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్ కప్ ను ఆవిష్కరించారు . అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ నిజిషోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే జాతీయస్థాయి ఛాంపియన్ షిప్ కరాటే పోటీలు వచ్చే నెల 12 నుంచి మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరుగుతుందన్నారు. విశాఖకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేలా ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ పోటీలు ఈసారి కూడా విజయవంతం కావాలన్నారు . జాతీయ స్థాయిలో గుర్తింపు గుర్తింపు లభించే విధంగా కరాటే పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు .

* కర్నూలు జిల్లా ఆదోనిలో 32 వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు సందర్భంగా ఆదోని పట్టణంలో ట్రాఫిక్ సిఐ లక్ష్మయ్య ఆదర్యంలో వివిధ కళాశాలల విద్యార్థులతో కలిసి ఎమ్మిగనూరు రోడ్డు నుండి శ్రీనివాస్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డు భద్రత నియమాలపై అవహగన కల్పించారు ఈ సందర్భంగా సి ఐ లక్ష్మయ్య మాట్లాడు తు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించి ప్రాణాలను కాపాడుకోవలన్నారు సీటు బెల్టు,హెలిమెంట్,ధరించి వాహనాలు నడపాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐలు,ఎస్ ఐ లు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

* 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అన్న నినాదం 4వందల రోజుల మైలురాయికి చేరుకొంది. మహిళలు, వృద్ధులు సహా ఇంటిల్లిపాదీ దీక్షా శిబిరాలలోనే ఉంటూ అమరావతి రామాల ప్రజలు పట్టు వదలకుండా పోరాటం సాగిస్తున్నారు..ప్రభుత్వం, నేతల వ్యవహార శైలి నానాటికీ కుంగదీస్తుండగా.. మనోవ్యథతో కొందరు అసువులు బాశారు.

* ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీని పరిశీలించిన ప‌రిశీలించిన టిటిడి ఈవోనరసింగాపురంలోని ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ, న‌ర్స‌రీని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి బుధ‌వారం ఉద‌యం అధికారులతో క‌లిసి ప‌రిశీలించారు.ఆయుర్వేద ఫార్మసీలో ముడి ప‌దార్థాలు, ప‌రిశోధ‌న శాల, మందుల త‌యారీ విభాగం, ఆయుర్వేదంపై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేదుకు ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న శాల, న‌ర్శ‌రీని ప‌రిశీలించారు.ఈ సంద‌ర్భంగా ఆయుర్వేద ఫార్మ‌సీ ఇన్‌ఛార్జి డాక్ట‌ర్ నార‌ప‌రెడ్డి ఆయుర్వేద మందుల త‌యారీని ఈవో, జెఈవోల‌కు వివ‌రించారు.

* కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం పెడన మండలం నరసప్ప చెరువు గ్రామంలో వేప చెట్టుకు పాలు కారడం తో జనాలను ఆశ్చర్యపోతున్నారు ఇదే గ్రామంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి కావడంతో ప్రజలంతా వేప చెట్టుకు పూజలు చేస్తూ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.