Politics

నోటాపై సుప్రీం సంచలన తీర్పు-తాజావార్తలు

News Roundup - Supreme Court Verdict On NOTA

* సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.ఏదైనా నియోజకవర్గంలో అన్నింటికంటే నోటాకు ఎక్కువగా ఓట్లు వస్తే ఆ రిజల్ట్ ను ఆపేయాలని, తిరిగి ఎన్నికలు జరపాలని తీర్పునిచ్చింది.లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్ పరిశీలించి, వాదనను విన్న సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

* మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో కొనసాగుతున్న సీఎం భేటీ.మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ కొనసాగుతోంది. మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికపై చర్చిస్తున్నారు. ‌మంత్రులు, నేతల ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారైన స్థానాల్లో అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు.పరిశీలనలో అభ్యర్థులు:గుంటూరు మేయర్ అభ్యర్థిగా మనోహర్ నాయుడు.కర్నూల్ మేయర్ అభ్యర్థిగా రామయ్య (బీసీ).కడప మేయర్ అభ్యర్థిగా సురేశ్‌ బాబు (బీసీ).ఒంగోలు మేయర్ అభ్యర్థిగా సుజాత (ఎస్సీ).తిరుపతి మేయర్ అభ్యర్థిగా డా.శిరీష(బీసీ).విజయవాడ మేయర్ అభ్యర్థిగా భాగ్యలక్ష్మి(బీసీ).విశాఖ మేయర్ అభ్యర్థిగా శ్రీనివాస్, శ్రీధర్, ఉషశ్రీ.విజయనగరం మేయర్ అభ్యర్థిగా ఎడ్ల కృష్ణవేణి.

* 2021లో జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష-నీట్​ (యూజీ) ఒకేసారి నిర్వహించనున్నట్లు ప్రకటించారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​. ​నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ(ఎన్​టీఏ) ఈ పరీక్ష నిర్వహిస్తుందని తెలిపారు.నీట్​ నిర్వహణపై భాజపా ఎంపీ లల్లూ సింగ్​ అడిగిన ప్రశ్నకు లోక్​సభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు పోఖ్రియాల్​.ఎంబీబీఎస్​లో ప్రవేశానికి గాను విద్యా శాఖ ఆధ్వర్యంలో నీట్​ పరీక్షను ఎన్​టీఏ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మరోవైపు నీట్​ పరీక్షను ఒకేసారి నిర్వహించే అంశంపై తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ఎన్​టీఏ పేర్కొంది.నీట్​ పరీక్షను 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది ఆగస్టు 1న (ఆదివారం) పెన్ను, పేపర్​ విధానంలో చేపడుతున్నారు.

* ఆన్‌లైన్‌లో తన ఉన్నత చదువులకు ల్యాప్‌టాప్‌ అవసరమని సోషల్‌ మీడియాలో సాయం కోరిన డిఫార్మసీ విద్యార్ధికి తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు.సదరు విద్యార్ధికి గవర్నర్‌ నిధి నుంచి కొనుగోలుచేసిన ల్యాప్‌టాప్‌ను విద్యార్ధికి అందజేశారు.విషయానికి వస్తే రంగారెడ్డిజిల్లా చేగూర్‌గ్రామానికిచెందిన విద్యార్ధి బి. ప్రమోద్‌ డిఫార్మసీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.కరోనా నేపధ్యంలో ప్రస్తుతం చాలా విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ద్వారానే క్లాసులు నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే.

* గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 147 మందికి కరోనా సోకింది. కరోనాతో ఒకరి మృతి చెందారు.రాష్ట్రంలో కరోనా నుంచి మరో 103 మంది బాధితులు కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 1,443 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.మరోవైపు గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీలో కరోనా కలకలం రేగింది. 9 మంది మున్సిపల్ సిబ్బందికి సోకింది.దీంతో మిగతా సిబ్బంది అందరికి టెస్టు చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.తిరుమల ధర్మగిరి వేదపాఠశాలలో మరో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది.దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికే వేదపాఠశాలలో 57మంది విద్యార్థులతో పాటు ఓ అధ్యాపకుడికి కరోనా సోకిన విషయం తెలిసిందే.

* కాంగ్రెస్‌ పార్టీకి మూడు నెలల పాటు దూరంగా ఉంటానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.భాజపాలో చేరడంలేదని ఆయన స్పష్టం చేశారు. 3నెలల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భాజపాలో చేరతారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌కు మూడు నెలలపాటు దూరంగా ఉంటానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.2014 లోక్‌సభ ఎన్నికల్లో విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఆ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి రంజిత్‌రెడ్డి చేతిలో విశ్వేశ్వర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు.

* తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త కేసులు పెరుగుతున్నాయి. తిరుమల వేదపాఠశాలలో మరో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఇటీవల తిరుమల ధర్మగిరి వేదపాఠశాలలో 57మంది విద్యార్థులతో పాటు ఓ అధ్యాపకుడికి కరోనా సోకింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో కూడా కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే సుభాష్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరికి కరోనా వచ్చింది. కార్ఖానా గడ్డ హైస్కూల్, సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేపడంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్కూల్లో మిగతా వారికి పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల ప్రభుత్వ బాలికల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 12 మంది టీచర్లు, ఇద్దరు వంట సిబ్బంది, ఓ విద్యార్థినికి కరోనా సోకింది.

* ప్రైవేటీకరణకు లాభనష్టాలు కొలమానం కాదని కేంద్రం స్పష్టంచేసింది. ప్రైవేటీకరణ ద్వారా సమకూరిన వనరులను వివిధ సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించడమే ప్రధాన ఉద్దేశమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌కు తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష వ్యయాలు, అప్పులపై అధిక వడ్డీలు, తక్కువ ఉత్పాదకత, వినియోగ సామర్థ్యమే ప్రధాన కారణాలని చెప్పారు.

* వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే ఆరోపణలను ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా ఖండించింది. ఈ మేరకు ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని యూరప్‌లోని కొన్ని దేశాలు తాత్కాలికంగా నిలిపి వేస్తుండటంపై సంస్థ సోమవారం స్పందించింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారి రక్తంలో సమస్యలు ఏర్పడటానికి టీకాకు ఎటువంటి సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ వల్ల రక్తం గడ్డకడుతోందనడానికి రుజువులు లేవని నిపుణులు తేల్చి చెప్పినట్లు ప్రకటించింది.

* తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో ఈనెల 12న తెరాస ఎంపీ సురేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ సమాధానమిచ్చారు. నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రీజినల్‌ ఆఫీస్‌ కం ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ పేరిట దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.