NRI-NRT

ఇరు తెలుగు రాష్ట్రాల్లో “ఆటా” ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపిణీ

ఏపీలో “ఆటా” ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపిణీ

కొవిడ్‌ రోగులకు ప్రాణవాయువు అందించడంలో సాయం అందించేందుకు అమెరికా తెలుగు అసోసియేషన్‌ ‘ఆటా’ ముందుకు వచ్చింది. 50 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డికి ఆటా ప్రతినిధులు అందజేశారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 600 కాన్సన్‌ట్రేటర్లు ఉచితంగా అందజేసినట్టు ఆటా ప్రతినిధులు వెల్లడించారు. రాష్ట్రంలో అవసరం మేరకు మరిన్ని ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందజేస్తామని ఈ సందర్భంగా ఆటా ఏపీ ప్రతినిధి గోసుల శివ భారత్‌రెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మెరుగైన వైద్య సేవల కోసం సహాయమందించేందుకు ఆటా సిద్ధంగా ఉందన్నారు. తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ… కరోనా రోగులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలందిస్తోందన్నారు. కొన్ని చోట్ల సరైన పరికరాలు, సదుపాయాలు లేని కారణంగా మెరుగైన వైద్యం అందడం లేదని, రోగుల ప్రాణాలు కాపాడేందుకు అమెరికా తెలుగు సంఘం ముందుకు వచ్చిందన్నారు. తెలుగురాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు 600 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు.