Health

ఆనందయ్య మందుతో భారీ వ్యాపారానికి ప్లాన్-TNI కోవిద్ బులెటిన్

ఆనందయ్య మందుతో భారీ వ్యాపారానికి ప్లాన్-TNI కోవిద్ బులెటిన్

* సర్వేపల్లి వైకాపా ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి .. ఆనందయ్యమందుతో భారీ వ్యాపారానికి కుట్ర పన్నారని తెదేపా సీనియర్‌నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సెశ్రిత కంపెనీ ఆనందయ్య మందు పేరుతో వెబ్‌సైట్‌ తయారు చేసిందని, ఆ కంపెనీ నిర్వాహకులు ఎమ్మెల్యే కాకాణి, వైకాపాకు అత్యంత సన్నిహితులని వెల్లడించారు. నకిలీ మద్యం తరహాలోనే నకిలీ వెబ్‌సైట్‌ రూపకల్పన జరిగిందని సోమిరెడ్డి అన్నారు. ఆనందయ్య ఔషధం ఒక్కో ప్యాకెట్‌ 167 రూపాయలకు అమ్ముకునేందుకు పన్నాగం పన్నారని ధ్వజమెత్తారు.

* ప్రముఖ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గుర్తింపు పొందిన వ్యాక్సిన్ల జాబితాలో చేర్చే దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది.

* TS News: రాష్ట్ర వ్యాప్తంగా ఆగిన రిజిస్ట్రేష‌న్లు…స‌ర్వ‌ర్‌లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో రాష్ట్ర‌వ్యాప్తంగా రిజిస్ట్రేష‌న్లు నిలిచిపోయాయి.ఈ స‌మ‌స్య‌తో రెండు రోజులుగా న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్న రిజిస్ట్రేష‌న్లు పూర్తిగా ఆగిపోయాయి.ఇవాళ‌ ఇప్ప‌టి వ‌ర‌కూ ఇంకా స‌ర్వ‌ర్ క‌నెక్ట్ కాలేదు. దీంతో క్ర‌య విక్ర‌య‌దారులు రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల వ‌ద్ద ప‌డిగాపులు కాస్తున్నారు.లాక్‌డౌన్ నిబంధ‌న‌ల నేప‌థ్యంలో మ‌ధ్యాహ్నం వర‌కే ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ప‌ని చేస్తుండటంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.దీనిపై రిజిస్ట్రేష‌న్ల ప‌రిపాల‌నా డీఐజీ సుభాషిణీ స్పందించారు.స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌తో రిజిస్ట్రేష‌న్లు నెమ్మ‌దిగా సాగుతున్నాయ‌ని తెలిపారు.ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి ఐటీ విభాగం శ్ర‌మిస్తోంద‌ని వివ‌రించారు.

* మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మూడో డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బాలరాజ్ ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదగా 150 మంది మీర్పేట్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

* తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 1,38,182 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,070 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,89,734కి చేరింది. తాజాగా మరో 18 మంది మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 3,364కి పెరిగింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి 3,762 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,208 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది.

* ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 88,441 మంది నమూనాలు పరీక్షించగా 10,373 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 80 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 11,376కి చేరింది. గడచిన 24 గంటల్లో 15,958 మంది కొవిడ్‌ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,28,108 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.