Health

ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం-TNI బులెటిన్

Nellore Anandayya COVID Medicine Starts Distribution

* నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య ఇస్తున్న క‌రోనా మందుకు ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రావ‌డంతో ఇవాళ పంపిణీ చేప‌ట్టారు. స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌ ప్ర‌జ‌ల‌కు ఔష‌ధాన్ని ఇస్తున్నారు. క్యూలో నిల్చున్న వారికి ఇబ్బందులు లేకుండా ఆనంద‌య్య సోద‌రుడు, బృందం మందును పంపిణీ చేస్తున్నారు. ఈ ఔష‌ధం కోసం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆనంద‌య్య మాట్లాడుతూ.. తొలుత సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇంటింటికీ ఔష‌ధం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర ప్రాంతాల వారికి త‌ర్వాత ఇస్తామ‌ని.. ఇక్కడకు వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు.

* ఏపీలో నేడు నమోదైన మొత్తం కరొన కేసుల వివరాలు8976

* కొవిడ్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన నష్టానికి చైనా పరిహారం చెల్లించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన ఉత్తర కరోలినాలోని రిపబ్లికన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మాట్లాడుతూ‘‘అమెరికా, మిగిలిన ప్రపంచానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. వారు చైనాను పరిహారం కోరాలి. కరోనా మహమ్మారికి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా బాధ్యత స్వీకరించాలి. పరిణామాలను చైనా అనుభవించాలని ప్రపంచం మొత్తం ముక్తకంఠంతో చెప్పాలి. అన్ని దేశాలు కలిసి పనిచేసి చైనాకు కనీసం 10 ట్రిలియన్‌ డాలర్లకు తక్కువ కాకుండా పరిహారం చెల్లించాలని బిల్లు ఇవ్వాలి. వారు చేసిన నష్టానికి అది కూడా చాలా తక్కువ. ఇప్పటికే చైనా నుంచి తీసుకొన్న అప్పుల చెల్లింపును నిలిపివేయాలి. దానిని తొలి విడత పరిహారం చెల్లింపుగా భావించాలి. ప్రపంచ దేశాలు చైనాకు డబ్బులు చెల్లించకూడదు. అది చాలా దేశాలను ఆర్థికంగా సర్వనాశనం చేసిందని ఆరోపించారు.

* ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు పంపిణీ జరిగిన రెండు వందల కోట్ల కొవిడ్‌-19 టీకా డోసుల్లో సుమారు 60% డోసులు కేవలం అమెరికా, భారత్‌, చైనా దేశాల్లో మాత్రమే వేశారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సీనియర్‌ సలహాదారు ఒకరు తెలిపారు. ‘‘ఈ వారం మనం రెండు వందల కోట్ల డోసులను దాటేస్తాం. 212కుపైగా దేశాల్లో ఇప్పుడు టీకాల పంపిణీ జరుగుతోంది’’ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ గేబ్రియేసస్‌కు సీనియర్‌ సలహాదారుగా ఉన్న బ్రూస్‌ అయిల్వార్డ్‌ వెల్లడించారు. ‘‘ఈ రెండు వందల కోట్ల డోసులను పరిశీలిస్తే.. 75 శాతానికిపైగా డోసులు కేవలం పది దేశాలకు అందాయి. అంతేకాదు 60 శాతానికిపైగా డోసులు కేవలం మూడు దేశాలకు (అమెరికా, చైనా, భారత్‌లకు) చేరాయి’’ అని వివరించారు. 127 దేశాలకు కొవిడ్‌-19 టీకా పంపిణీ, అనేక దేశాలు టీకా కార్యక్రమం ప్రారంభించడానికి కొవాక్స్‌ కీలక పాత్ర పోషిస్తోందని, టీకాల సేకరణే సవాలుగా ఉందని చెప్పారు. అమెరికా, చైనా, భారత్‌లు పొందిన 60% టీకాలు దేశీయంగా సేకరించి ఉపయోగించినవేనని ఆయన స్పష్టంచేశారు. ప్రపంచ జనాభాలో పది శాతం వాటా ఉన్న అల్పాదాయ దేశాలకు కేవలం 0.5 శాతం డోసులే అందాయని ఆవేదన వ్యక్తంచేశారు.