Health

జలుబు వస్తే ఆవిరి పట్టవచ్చా?

జలుబు వస్తే ఆవిరి పట్టవచ్చా?

జలుబు, దగ్గు వంటి లక్షణాలున్నపుడు పసుపు,ఆకుపచ్చని ట్యాబ్లెట్లతో ఆవిరి పట్టడం మంచిదే. ఆవిరి వల్ల ముక్కులో, గొంతులో, శ్వాస నాళాల్లో చేరిన వైరస్‌లు ఏవైనా అంతమయ్యే అవకాశం ఉంటుంది. దీనిపై పలువురు పలు రకాలుగా ప్రచారం చేస్తున్నా ఆవిరి పట్టడం మంచిదే.కరోనా సోకిన వారిలో మొదట జ్వరం, ముక్కు, గొంతుకు సంబంధించి లక్షణాలు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటివి కనిపిస్తాయి. 4, 5 రోజుల తర్వాత వాసన తెలియకపోవటాన్ని చాలామందిలో గుర్తిస్తున్నారు. కరోనా సోకిన వారం తర్వాత వాసన సాధారణ స్థితికి వస్తుంది. వాసన పోయిందని చెప్తున్నవారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. గొంతులో నొప్పి, గొంతు గరగర, ఇతర వ్యాధి లక్షణాలున్నట్టు అనిపిస్తే టెస్ట్‌ల కోసం పరుగెత్తకుండా వైద్యుని సంప్రదించాలి. వారి సలహా మేరకు టెస్ట్‌లు చేయించుకోవాలి. మందులు వాడాలి. శ్వాస తీసుకోవటంలో తేడాలుంటే మాత్రం దవాఖానలో చేరాలి.