Health

ఆంక్షల సడలింపుతో పెరుగుతున్న కరోనా కేసులు-TNI బులెటిన్

ఆంక్షల సడలింపుతో పెరుగుతున్న కరోనా కేసులు-TNI బులెటిన్

* కొవిడ్‌-19 డెల్టా వేరియంట్‌ వ్యాప్తి స్థాయి మున్ముందు ఎక్కు వగా ఉండే అవకాశం ఉందని, అందువల్ల కేసులు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. ము ఖ్యంగా వ్యాక్సిన్‌ తక్కువ వినియోగించిన దేశాల్లో ఆరో గ్య రంగంపై ఎక్కువ భారం పడుతుందని పేర్కొంది. కొవిడ్‌ సాంక్రమిక వ్యాధుల అధ్యయనానికి సంబంధించిన తాజా వివరాలను డబ్ల్యూహెచ్‌ఓ మంగళవారం విడుదల చేసింది. డెల్టా వేరియంట్‌ కారణంగా ప్ర పంచ వ్యాప్తంగా పెరిగిన కొవిడ్‌ కేసుల వివరాలను వెల్లడించింది. ఈ నెల 13 నాటికి 111 దేశాల్లో డెల్టా వేరియంట్‌ను గుర్తించినట్లు పేర్కొంది. రాబోయే నెల ల్లో ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రబలే ప్రమాదం ఉం దని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా గత వారం అంటే ఈ నెల 5 నుంచి 11 వరకు 30 లక్షల కేసులు నమోదయ్యాయి.

* ఏపీలో కొవిడ్ బాధితులకు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు రూ.4 కోట్ల విలువైన సాయం.స్టేట్ కొవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్.రెండు ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించనున్న మహీంద్రా అండ్ మహీంద్రా.విశాఖపట్నంలో 500 ఎల్పిఎం ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం.కర్నూలు లో 1000 ఎల్పిఎం ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం.పశ్చిమ గోదావరి జిల్లాకు 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు .చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలకు రెండు అంబులెన్స్ లు .సాయం అందించిన మహీంద్రా అండ్ మహీంద్రా యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు.కొవిడ్ బాధితుల్ని ఆదుకునేందుకు సంస్థలు ముందుకు రావాలి.డాక్టర్ అర్జా శ్రీకాంత్ పిలుపు.

* ఆంక్షల సడలింపుతో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది.గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు.. మళ్లీ 40వేలపైకి చేరుకున్నాయి.కొత్తగా 41,806 మందికి వైరస్​ సోకింది. వైరస్ బారినపడి 581 మంది ప్రాణాలు విడిచారు. కొత్తగా 39,130 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.మొత్తం కేసులు: 3,09,87,880.మొత్తం మరణాలు: 4,11,989.కోలుకున్నవారు: 3,01,43,850.యాక్టివ్​ కేసులు: 4,32,041.దేశంలో ఇప్పటివరకు 43,80,11,958 కరోనా పరీక్షలు నిర్వహించారు. బుధవారం 19,43,488 కరోనా టెస్టులు జరిపినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.దేశంలో ఇప్పటివరకు 39,13,40,491 డోసులు పంపిణీ చేసినట్లు ఐసీఎంఆర్​ వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే 34,97,058 డోసులు అందించినట్లు తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 5,54,510 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 8,715 మంది చనిపోయారు.

* వెలగపూడి : కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్కులు లేని వారిని అనుమతిస్తే రూ.10వేల నుంచి రూ.20వేల వరకు జరిమానా విధిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.జరిమానా మొత్తాన్ని అక్కడి పరిస్థితుల ఆధారంగా ఖరారు చేస్తారని తెలిపారు.అలాగే రెండుమూడు రోజులపాటు సంబంధిత సంస్థను మూసివేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.దీనికోసం ప్రత్యేకంగా వాట్సప్‌ నెంబరును ప్రకటిస్తామన్నారు.