NRI-NRT

మలేషియాలో అట్టహాసంగా బతుకమ్మ సంబరాలు

మలేషియాలో అట్టహాసంగా బతుకమ్మ సంబరాలు

మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యములో బతుకమ్మ పండుగను ఈ సంవత్సరం కూడా కరోనా విపత్తు కారణముగా అంతర్జాల వేదికగా నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా రాజ్య సభ సభ్యులు బండ ప్రకాష్, తెలంగాణ తెలుగు మహిళా ప్రెసిడెంట్ జ్యోత్స్న, శాసనసభ సభ్యుడు కే పి వివేకానంద గౌడ్, మరియు మలేషియా తెలుగు పునాది ప్రెసిడెంట్ కాంతారావు, తెరాస మలేషియా ప్రెసిడెంట్ చిట్టి పలువురు తెలంగాణ ప్రముఖులు వర్చ్యువల్ వేదికగా ఈ బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు. బండప్రకాష్ మాట్లాడుతూ ఈ సంబరాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ ను ఆయన అభినందించారు. అలాగే మన తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ నలుమూలల వ్యాప్తి చేస్తున్నందుకు గాను మైట సభ్యులను అభినందించారు. జ్యోత్స్న తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆమె వివరించారు, మరో అతిథి కాంతారావు గతంలో వారు మైటాతో జరుపుకున్న వేడుకలను గుర్తుచేసుకొని ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య , వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్ , జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్,ట్రేసరర్ మారుతీ జాయింట్ ట్రేసరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ రవి వర్మ,కృష్ణ వర్మ,కిరణ్ గాజంగి,హరి ప్రసాద్,వివేక్,రాములు,సుందర్,కృష్ణ రెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, అశ్విత ,యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ – కిరణ్ గౌడ్, రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ విజయ్ కుమార్, చందు, రామ కృష్ణ, నరేందర్ , రంజిత్ , సంతోష్ , ఓం ప్రకాష్, అనూష ,దివ్య , సాహితి , సాయిచరని, ఇందు,రోజా ,శ్రీలత . మైగ్రంట్ వింగ్ మెంబర్స్ ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్ , సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Malaysia Telugu NRI NRT News - Batukamma 2021 In Malaysia
Malaysia Telugu NRI NRT News - Batukamma 2021 In Malaysia
Malaysia Telugu NRI NRT News - Batukamma 2021 In Malaysia
Malaysia Telugu NRI NRT News - Batukamma 2021 In Malaysia
Malaysia Telugu NRI NRT News - Batukamma 2021 In Malaysia