Devotional

తంజావూరు ప్రాచీన శివాలయాన్ని చూసి వద్దాం రండి

తంజావూరు ప్రాచీన శివాలయాన్ని చూసి వద్దాం రండి

శివ దర్శనం

☘️☘️☘️☘️☘️☘️☘️☘️

కార్తీకమాసం సందర్భం గా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం. ….

బృహదీశ్వర ఆలయం- తంజావూరు

☘️☘️☘️☘️☘️☘️☘️☘️

ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడింది.

భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది.

దీనిని చోళ రాజు రాజ రాజ చోళుడు నిర్మించాడు. చాల ప్రసిద్ది చెందిన ఆలయం. చాల పెద్ద ఆలయం.. . గర్బ గుడి లోని శివ లింగం 13 అడుగుల ఏక శిలా నిర్మితం. ఈ ఆలయ ప్రాకారాలు చాల విశాలమైనవి. ప్రాకారం పొడవు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు..

1. ఈ ఆలయం లో ఉన్న శివుడి పేరు రాజ రాజేశ్వరుడు. మరాఠాలు దీనికి బృహదీశ్వర ఆలయం అని పేరు పెట్టారు

2. ప్రధాన ఆలయం మొత్తం గ్రానైట్ తో నిర్మించబడినది. సుమారు 130,000 టన్నుల గ్రానైట్ వాడారని ఒక అంచనా. గ్రానైట్ ని ఈ రోజుల్లో ముక్కలు చేయడమే కష్టం అలాంటిది అన్ని టన్నుల గ్రానైట్ ఎలా ముక్కలు చేశారో ఇప్పటికి ఎవరికి అంతు పట్టదు

3. ఆలయం లో ఉన్న నంది వాహనం కూడా తక్కువేం కాదు. ఇదొక ఏకశిలా విగ్రహం. 20 టన్నుల బరువు, 2 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల పొడవు, 2. 5 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది

4. ప్రధాన విమానం 200 అడుగులు ఎత్తు ఉంటుంది దీన్ని దక్షిణ మేరు అంటారు

5. ఈ దేవాలయం నిర్మాణానికి అవసరమైన గ్రానైట్ నిక్షేపాలను ఇక్కడికి 150 కిలోమీటర్ల దూరంలో వున్న’పుదుకోవై’ అనే ప్రాంతంలోని కొండలను తొలిచి అక్కడినుంచి తెప్పించి ఉంటారని చెబుతుంటారు.
ఆలయ పైభాగానికి కప్పుగా 80 టన్నుల బరువుగల ఏకశిలను ఉపయోగించారు. ఈ రాయిని గుడి పైకి చేర్చడానికి వారు ప్రత్యేకమైన వంతెన వంటి నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుస్తోంది. 13 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మించడమే కాకుండా, నర్మదా నదీ ప్రాంతం నుంచి తెప్పించిన 13 అడుగుల ‘ఏకశిల’ను గర్భాలయంలో శివలింగంగా మలిచారు. ఈ శివలింగానికి అభిషేకం నిర్వహించడానికి రెండు వైపులా మెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక 8 అడుగుల వెడల్పు … 12 అడుగుల ఎత్తు గల నందీశ్వరుడి విగ్రహాన్ని కూడా ఏకశిలలోనే మలిచారు. లేపాక్షి బసవన్న తరువాత ఆ స్థాయి విగ్రహం ఇదేనని చెబుతూ వుంటారు.

6. వెయ్యేళ్ల కిందట కట్టిన ఈ ఆలయం అప్పట్లో ఇండియాలోనే అతిపెద్ద ఆకాశహర్మం. 13 అంతస్తులు కలిగిన ఈ ఆలయంలో ఇండియాలోనే అతిపెద్ద శివలింగం ఉన్నది. దీని ఎత్తు 3. 7 మీటర్లు.

7. ఆలయం నిర్మించటానికి సిమెంట్, ఉక్కు వాడలేదు. పూర్తిగా 13 అంతస్తులు గ్రానైట్ రాయితోనే కట్టించారు.

8. ప్రధాన ఆలయానికి గోపురం .13 అంతస్తులు ఎటువంటి గోడ సహాయం లేకుండా నిలబడటం అనేది….ఆశ్చర్యకరమైన విషయం

9. ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో అంశం మిట్టమధ్యాహ్నం ఆలయం యొక్క గోపురం నీడ ఎక్కడా పడకపోవడం. గుడి నీడన్న పడుతుందేమో గానీ గోపురం నీడ అస్సలు పడదు.

10. ఆలయంలో అనేక సొరంగమార్గాలు ఉన్నాయి. కొన్ని తంజావూరులోని ఆలయాలకు దారితీస్తే, మరికొన్ని మరణానికి దారితీసేవిగా ఉన్నాయి. వీటిని రాజరాజచోళుడు తగుజాగ్రత్తల కోసం ఏర్పాటుచేసుకున్నాడని చెబుతారు

11. వందల సంవత్సరాల క్రితం నాటి గుడులు ఇప్పుడు శిధిలావస్థ దశలో ఉంటాయి. అయితే ఈ గుడి మాత్రం చెక్కుచెదరకుండా అత్యద్భుతంగా, ఇప్పుడిప్పుడే కట్టారా ? అన్న రీతిలో ఉంటుంది. ఇన్ని వింతలు, విశేషాలు నెలకొన్న ఈ గుడి ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది.

12. గుడి చుట్టుపక్క ప్రాంతాలలో ఇప్పటికీ పురావస్తుశాఖ వారు తవ్వకాలను జరుపుతున్నారు. తవ్వకాలు జరిపిన ప్రతిసారి ఎదో ఒక శిల్పమో లేదా ఆనాటి కాలానికి సంబంధించిన వస్తువో బయటపడుతూ ఉంది … ఆనాటి వైభవాన్ని చాటుతూ ఉంది.

13. గుడిలో ఆశ్చర్యపరిచే మరో టెక్నాలజీ అంశం గుడి చుట్టూ ఉన్నరాతి తోరణాలు. ఈ తోరణాల యొక్క రంధ్రాలు ఆరు మీ.మీ ల కన్నా తక్కువ సైజులో వంపులతో ఉంటాయి. అంత చిన్నగా ఎందుకు పెట్టారో ఎవరికీ తెలీదు.

14. ఆలయ శబ్ద పరిజ్ఞానాన్ని మెచ్చుకోకతప్పదు. ఆలయ ప్రాంగణం సువిశాలంగా ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకొనే శబ్దాలు మళ్ళీ ప్రతిధ్వనించవు.
….
ఓం నమః శివాయ ??

☘️☘️☘️☘️☘️☘️