WorldWonders

ఈ రైల్వే స్టేషన్ రూటే వేరు

ఈ రైల్వే స్టేషన్ రూటే వేరు

ఆదాయం లేని రైల్వే స్టేషన్లలో రైళ్ల స్థాపింగ్ ను  అధికారులు ఎత్తేస్తుంటారు.  కదా! రాజస్థాన్లోని జల్సూ నానక్ స్టేషన్ దీ అదే పరిస్థితి . ఈ గ్రామం నుంచి సైన్యంలో పనిచేసే వారు ఎక్కువ . కానీ , రైళ్లు ఆగకపోవడంతో వారి రాకపోకలకు ఇబ్బందిగా మారింది . రైల్వే అధికారులతో మాట్లాడితే .. రోజుకు 50 చొప్పున నెలకు 1500 టికెట్లు కొనుగోలు చేస్తేనే స్టేషన్లో రైళ్లను ఆపుతామని తేల్చిచెప్పారు . దాంతో గ్రామస్థులంతా కలిసి చర్చించుకున్నారు . తలాకొంత వేసుకొని ప్రతి రోజూ 50 టికెట్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు . ఆ ఊరి వాళ్లతో పాటు రైలు ఎక్కేందుకు వచ్చే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకూ టికెట్లు అమ్మే బాధ్యతను ఓ వ్యక్తికి అప్పగించారు . అతడికి నెలకు రూ .5 వేలు కూడా ఇస్తున్నారట . టికెట్లు ఏమైనా మిగిలితే , ఆ రోజుకు వృథా అయినట్లే . ప్రస్తుతం పది రైళ్లు ఆగుతున్న ఈ స్టేషన్లో గ్రామస్థులే తాగు కుర్చీలు తదితర సౌకర్యాలనూ ఏర్పాటు చేసుకున్నారు.. అలా 2005 నుంచి ప్రజలే నిర్వహిస్తున్న రైల్వే స్టేషన్ గా దీనికి పేరొచ్చింది.