DailyDose

TNI – నేటి నేర వార్తలు – 27/01/2022

TNI – నేటి నేర వార్తలు – 27/01/2022

* చెన్నై- కలకత్తా 16వ నెంబరు జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జె.పంగులూరు మండలం రేణంగివరం వద్ద సుబాబుల్ లోడు ట్రాక్టర్ ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురం వాటర్ ట్యాంకు ఎదురు సోదా వెంకట్రావు, కళావతి దంపతులు కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ప్రసన్న, భాస్కర్ లు ఉన్నారు. పెద్ద కుమారుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు భాస్కర్ ను అమెరికా పంపించేందుకు చెన్నై ఎయిర్పోర్ట్ కు కారులో బుధవారం రాత్రి వెళ్లారు. ఫ్లైట్ ఎక్కించి వెంకట్రావు, కళావతి, ప్రసన్నలు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది. వీరిలో వెంకటరావు, ప్రసన్న లు మృతి చెందగా కళావతి, డ్రైవర్ తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. పొద్దు పొద్దున్నే ఈ విషాద వార్త అందడంతో చిలకలూరిపేట పట్టణంలోని సాంబశివ నగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

*రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది.మద్యం మత్తులో కారు నడిపిన ఓ యువతి రోడ్డుపై వెళుతున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.కారును స్థానికులు అడ్డుకోవడంతో వారితో యువతి, వాహనంలో ఉన్న మరో వ్యక్తి వాగ్వాదానికి దిగారు.ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.మద్యం మత్తులో ఉన్న యువతి, ఆమెతో ఉన్న వ్యక్తిని పీఎస్‌కు తరలించారు. కారులో ఉన్న వారు మద్యం తాగినట్లు బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో తేలిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

* లిఫ్ట్‌ ఇస్తానంటూ రోడ్డుపై ఒంటరిగా ఉన్న ఓ మహిళను బైక్‌పై ఎక్కించుకున్న ఓ వ్యక్తి మార్గం మధ్యలో ఆమెపై అత్యాచారం చేశాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం ఖానాపూర్‌కూచూరు గ్రామాల సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. నవాబ్‌పేట మండలంలోని ఓ గ్రామం నుంచి జడ్చర్ల మండలంలోని మరో గ్రామానికి మంగళవారం రాత్రి ఓ మహిళ ఒంటరిగా వెళ్తోంది. నవాబ్‌పేట మండ లం కూచూరు గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డి లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి ఆమెను తన బైక్‌పై ఎక్కించుకున్నాడు. దారిలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ మహిళ చెవికమ్మలుమెడలో ఉన్న బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు. బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

* జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజ్బాగ్లోని ఒక వాణిజ్య భవనంలో గురువారం మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఫైర్సెఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. కాగా, ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు ఫైరింజన్ సహయంతో మంటలను అదుపులోనికి తీసుకొని వచ్చారు.

* మన దేశ రాజధానిని ‘రేప్ క్యాపిటల్’ అని విమర్శిస్తుంటారు. ఈ విమర్శను జీర్ణంచుకోవడం కష్టమే అయినా మన దేశంలో ఎక్కవ అత్యాచారాలు జరుగుతున్నది ఢిల్లీలోనే అని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. తాజాగా జరిగిన ఒక ఘటన రేప్ స్థాయిని మించిపోయింది. అత్యాచారానికి గురైన యువతికి చేయూతనివ్వాల్సింది పోయి చెప్పుల దండ వేసి మరింతగా హింసించారు. ఇది ఆమెను రేప్ చేసిన మానసిక రోగులు చేసిన నిర్వాకం కాదు. ఆమెలాంటి సాటి మహిళలు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

*బైక్ రేసులో గాయపడిన విద్యార్థి దిల్ షా మృతి చెందాడు. గత రాత్రి పట్టాభిపురం స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ రేస్‌లో దిల్ షా ప్రమాదానికి గురయ్యాడు. విద్యానగర్ రోడ్డుపై వెళ్తున్న మరో బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. రేస్ బైక్‌పై వెనక కూర్చున్న దిల్ షా మృతి చెందాడు. తీవ్ర గాయాలతో బైక్‌ను నడిపిన రేసర్ చికిత్స పొందుతున్నాడు.

*అక్రమంగా తరలిస్తున్న వెయ్యి కిలోల గంజాయిని సంగారెడ్డి జిల్లా పోలీసులు బుధవారం పట్టుకున్నారు. దీని విలువ మార్కెట్‌లో రూ.2 కోట్లు వరకు ఉంటుంది. ఈ సరుకును రవాణా చేస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణ కుమార్‌ విలేకరులకు వివరించారు. సదాశివపేట మండలంలోని నందికంది పరిధిలో 65వ నంబర్‌ జాతీయ రహదారిపై సీఐ గూడూరి సంతో్‌షకుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ లారీలో 500 ప్యాకెట్ల(ఒకొక్కటి రెండు కేజీలు)లో గంజాయిని గుర్తించారు. ఇందుకు సంబంధించి షేక్‌ సలీం, అజీజ్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఓ లారీ, 3 మొబైల్‌ ఫోన్లు, 500 ప్యాకెట్ల గంజాయి, 3,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే, అరెస్టు చేసిన వారిని రిమాండ్‌కు తరలించామని, పరారైన వ్యక్తి కోసం గాలిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.

*అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో ఓ పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 39 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం తీరప్రాంత అధికారులు వెతుకులాట ప్రారంభించారు. మానవ స్మగ్లింగ్‌కు ఉపయోగించినట్లు భావిస్తున్న ఈ పడవ కరేబియన్‌ దేశమైన బహమాస్‌ నుంచి బయలుదేరినట్టు అధికారులు చెబుతున్నారు. పోర్టుపియర్స్‌కు తూర్పున 72 కిలోమీటర్ల దూరంలో పడవను పట్టుకొని వేలాడుతున్న వ్యక్తిని గుర్తించిన ఓ సమారిటన్‌ మంగళవారం కోస్టుగార్డ్‌కు ఫోన్‌కాల్‌ ద్వారా సమాచారం అందిచాడని సముద్ర భద్రతా ఏజెన్సీ తెలిపింది

*బ్రాడీపేటకు చెందిన షేక్‌ కరీముల్లా కుటుంబ తగాదాల నేపథ్యంలో ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. స్థానిక రామకృష్ణా సెంటర్‌లో కరీముల్లా ఆప్టికల్‌ షాపు నడుపుతున్నాడు. సోదరి, కుటుంబ సభ్యుల మధ్య వున్న ఆస్తి తగాదాలతో మంగళవారం రాత్రి అతడు పురుగుల మందు తాగాడు. బుధవారం ఉదయం లేవకపోవడంతో ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతిచెందినట్టు వైద్యు లు ధ్రువీకరించారు. భార్య దిల్‌షా బేగం ఇచ్చిన ఫిర్యా దుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ డి.సురేష్‌బాబు తెలిపారు.

*ఆదోని-నగరూరు రైల్వే స్టేషన్ల మధ్య కి.మీ 493/11-13 నంబర్‌ సమీపంలో బుధవారం కురువ వీరేష్‌ (21) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భవన నిర్మాణ పనులలో ప్రమాదవశాత్తు కాలు విరగడంతో ఆయన మనస్తాపంతో ఉన్నాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఎస్ఐ సుబ్బారాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

*ఓ పాఠశాల బాలికను కిడ్నాప్ చేసి, అటవీప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేసి వదిలిపెట్టిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని దుంగార్ పూర్ జిల్లాలో వెలుగుచూసింది. బిచివారా గ్రామానికి చెందిన ఓ బాలిక తన సోదరుడితో కలిసి పాఠశాలకు వెళ్లింది. భోజన విరామ సమయంలో బాలిక బయటకు రాగా, 12వతరగతి చదివే ఓ విద్యార్థి బాలికను బలవంతంగా మోటారుసైకిలుపై ఎక్కించుకొని అటవీప్రాంతానికి తీసుకువెళ్లి ఆమెపై గంటల తరబడి అత్యాచారం చేశాడు. అనంతరం అమ్మాయిని ఆమె ఇంటి వద్ద వదిలేశాడు.అత్యాచారానికి గురైన బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

*జే.పంగులూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాగర్లమూడివారిపాలెం సమీపంలో కట్టెల లోడ్‎తో వెళ్తున్న ట్రాక్టర్‎ని ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*ఓ పాఠశాల బాలికను కిడ్నాప్ చేసి, అటవీప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేసి వదిలిపెట్టిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని దుంగార్ పూర్ జిల్లాలో వెలుగుచూసింది. బిచివారా గ్రామానికి చెందిన ఓ బాలిక తన సోదరుడితో కలిసి పాఠశాలకు వెళ్లింది. భోజన విరామ సమయంలో బాలిక బయటకు రాగా, 12వతరగతి చదివే ఓ విద్యార్థి బాలికను బలవంతంగా మోటారుసైకిలుపై ఎక్కించుకొని అటవీప్రాంతానికి తీసుకువెళ్లి ఆమెపై గంటల తరబడి అత్యాచారం చేశాడు. అనంతరం అమ్మాయిని ఆమె ఇంటి వద్ద వదిలేశాడు. అత్యాచారానికి గురైన బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

*ఏపీలో దేవాలయాలపై దాడులు కాస్త తగ్గాయనుకుంటే.. తిరిగి మళ్లీ ప్రారంభమయ్యాయి. హిందూ దేవాలయాల్లో వరుస దాడుల తర్వాత జనం కాస్త ఊపిరి పీల్చుకుంటుండగానే.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాక ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. కాణిపాక ఆలయంలో పాత రథ చక్రాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. గోశాల పక్కన నిల్వ ఉంచిన పాత రథచక్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనా? లేక కావాలని ఎవరైనా చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

* సంపూర్ణ మద్యనిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మరణించారు. బీహార్‌లోని బక్సర్ జిల్లా దుమ్రావ్‌లో కల్తీ మద్యం తాగి ఐదుగురు వ్యక్తులు మరణించారు. కల్తీ మద్యం తాగిన మరో నలుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.ఐదుగురి మృతిపై అధికార యంత్రాంగానికి సమాచారం అందించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని బక్సర్ ఎస్పీ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు.మురార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్సారీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బీహార్‌లోని సరన్ జిల్లాలోనూ కల్తీ మద్యం తాగడం వల్ల ఐదుగురు మరణించిన ఘటర జరిగిన వారంలోపే మరో విషాదం జరిగింది. దానికి వారం రోజుల ముందు నలంద జిల్లాలో కల్తీ మద్యం తాగి 11 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు.గత ఏడాది కల్తీ మద్యం తాగి 40 మందికి పైగా మరణించారు. ఈ ఘటనపై బీహార్ సీఎం నితీష్ కుమార్ దర్యాప్తునకు ఆదేశించారు.కల్తీ మద్యం తాగి మరణిస్తున్న ఘటనలు తరచూ జరుగుతుండటంతో ప్రతిపక్షాలు సీఎం నితీష్ కుమార్ పై విమర్శలకు దిగారు.