Politics

TNI – రాజకీయం 30/1/2022

TNI  – రాజకీయం 30/1/2022

* ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం
టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ పక్షనేత శ్రీ కె.కేశవరావు, లోక్ సభ లో టీఆర్ఎస్ పార్టీ పక్షనేత శ్రీ నామా నాగేశ్వర రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంత రావు, శ్రీ కె.ఆర్.సురేష్ రెడ్డి, జోగినిపల్లి సంతోష్ కుమార్, శ్రీ బడుగుల లింగయ్య యాదవ్, లోక్ సభ సభ్యులు బి.బి.పాటిల్, పి.రాములు, పసునూరి దయాకర్ మన్నె శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేత, శ్రీమతి మాలోత్ కవితా నాయక్, శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

* బీజేపీలో చేరిన వివాదాస్పద మౌలానా కోడలు
హిందువులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మౌలానా తౌకీర్ రజా ఖాన్ కోడలు నిడా ఖాన్ ఆదివారం బీజేపీలో చేరారు. బీజేపీ పరిపాలనలో మాత్రమే ఉత్తర ప్రదేశ్‌ ముస్లిం మహిళలకు రక్షణ ఉందని ఆమె చెప్పారు. ఆమె ట్రిపుల్ తలాక్ బాధితురాలనే విషయం గమనార్హం. గతంలో ఆమె మాట్లాడినపుడు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తన సోదరి అని చెప్పిన సంగతి తెలిసిందే. నిడా ఖాన్ ఆదివారం లక్నోలో బీజేపీలో చేరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ట్రిపుల్ తలాక్ విధానానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడటం వల్ల కీలక మలుపు వచ్చిందని చెప్పారు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం చట్టం చేసిందని, ఈ ఎన్నికల్లో ఈ అంశానికి చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ‘‘నేను మహిళను, పోరాడగలను’’ అనే నినాదాన్ని వినిపిస్తోందని, అయితే మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఆరోపించారు. అయితే బీజేపీ మహిళల రక్షణకు హామీ లభించేవిధంగా మహిళా సాధికారత కోసం కృషి చేసిందని చెప్పారు. అందుకే తాను బీజేపీలో చేరానని చెప్పారు. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

* మహాత్మా గాంధీ లేరనేది హిందుత్వవాదుల భావన : రాహుల్ గాంధీ
జాతి పిత మహాత్మా గాంధీ లేరని హిందుత్వవాదులు భావిస్తున్నారని, అయితే ఆయన సజీవంగానే ఉన్నారని, సత్యం ఉన్న చోట ఆయన ఉంటారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. గాంధీజీ 74వ వర్థంతి సందర్భంగా ఆయన #ForeverGandhi హ్యాష్‌ట్యాగ్‌తో ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఆదివారం మహాత్మా గాంధీకి నివాళులర్పించింది. ‘‘గాంధీజీని ఓ హిందుత్వవాది కాల్చి చంపాడు. గాంధీజీ లేరని హిందుత్వవాదులంతా భావిస్తున్నారు. సత్యం ఉన్న చోట బాపూ ఇంకా సజీవంగా ఉన్నారు’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘‘సత్యం, ప్రేమ ఎల్లప్పుడూ విజయం సాధించినట్లు చరిత్ర చెప్తోందనే విషయాన్ని నేను నిరుత్సాహంగా ఉన్నపుడు గుర్తు చేసుకుంటాను. నియంతలు, హంతకులు ఉన్నారు, కొంత కాలంపాటు వారు ఎదురులేనివారిగా కనిపిస్తారు. కానీ చివరికివారు పతనమవుతారు. ఎల్లప్పుడూ దీని గురించి ఆలోచించాలి’’ అని గాంధీజీ చెప్పిన మాటలను ఈ ట్వీట్‌లో రాహుల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి రాహుల్ శ్రద్ధాంజలి ఘటించారు.

* ప్రజలకు జగన్‌రెడ్డి, కొడాలి నాని సమాధానం చెప్పాలి: దేవినేని ఉమ
గుడివాడ కేసినోపై మాటలతో బూతుల మంత్రి కొడాలి నాని దొరికిపోయారని, మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? లేక పెట్రోల్ పోసుకుంటారో ఆయన కర్మ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేసినో వ్యవహారంలో అడ్డంగా దొరికారు కాబట్టి.. సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి కొడాలి నాని ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసినో పెట్టానని మంత్రే స్వయంగా ఒప్పుకున్నారన్నారు. కేసినో పెట్టినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని,.. పెట్రోల్ పోసుకుంటానని సవాల్ విసిరారు.. ఇప్పుడేం చేస్తారని దేవినేని ఉమ ప్రశ్నించారు.

* పీఆర్సీ ఇలా రావడానికి మా తప్పు కూడా ఉంది: వెంకట్రామిరెడ్డి
పీఆర్సీ ఇలా రావడానికి తమ తప్పు కూడా ఉందని సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాలు నష్టం కలిగించాయని, తమలో అనైక్యతను ప్రభుత్వం అలుసుగా తీసుకుందని ఆయన చెప్పారు. కర్నూలులో ఉద్యోగుల దీక్షల్లో వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై ఉద్యోగసంఘాలు ఐక్య పోరాటం చేస్తామని ప్రకటించారు. ఉద్యోగుల్లో చీలిక తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. పీఆర్సీ సాధించే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఉద్యోగులు సమ్మెకి వెళ్లకుండా నివారించడమనేది.. ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

* 99 మంది నేరచరితులకు బీజేపీ టిక్కెట్లు: అఖిలేష్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేరచరితులకు టిక్కెట్లపై ఎస్‌పీ, బీఎస్‌పీ మధ్య మాటల యుద్ధం అంతకంతకూ పెరుగుతోంది. దీనిపై బీజేపీ నేతలు అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్ పదేపదే చేస్తున్న విమర్శలను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అంతే ధీటుగా తిప్పికొట్టారు. నేరచరితులకు టిక్కెట్ల విషయంలో బీజేపీ సెంచరీకి చేరువలో ఉందని ప్రత్యారోపణ చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన 99 మందికి బీజేపీ ఇంతవరకూ టిక్కెట్లు ఇచ్చిందని ఆరోపించారు. “బీజేపీ సెంచరీకి చేరువలో ఉంది. 99 మంది నేరచరితులకు వాళ్లు టిక్కెట్లు ఇచ్చారు” అని అఖిలేష్ ఆదివారంనాడు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

* ప్రజలకు జగన్‌రెడ్డి, కొడాలి నాని సమాధానం చెప్పాలి: దేవినేని ఉమ
గుడివాడ కేసినోపై మాటలతో బూతుల మంత్రి కొడాలి నాని దొరికిపోయారని, మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? లేక పెట్రోల్ పోసుకుంటారో ఆయన కర్మ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేసినో వ్యవహారంలో అడ్డంగా దొరికారు కాబట్టి.. సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి కొడాలి నాని ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసినో పెట్టానని మంత్రే స్వయంగా ఒప్పుకున్నారన్నారు. కేసినో పెట్టినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని,.. పెట్రోల్ పోసుకుంటానని సవాల్ విసిరారు.. ఇప్పుడేం చేస్తారని దేవినేని ఉమ ప్రశ్నించారు

* తెలంగాణ ఏర్పడిన తర్వాతనే దేవాలయాల అభివృద్ధి: మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాతనే పలు చారిత్రక దేవాలయాల అభివృద్ధి జరుగుతోందని పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దైవ చింతన కలిగిననేత అని అందుకే ప్రజల మనోభావాలకనుగుణంగా దేవాలయాలను తీర్చిదిద్దతున్నారని అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లాలోని కొమురవెళ్లి మల్లన్న నుకొండ పోచమ్మ అమ్మవారి నికుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. కొమురవెళ్లి ఆలయం వద్ద భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు.

*పురపోరులో మా సత్తా చూపుతాం: Kamal
మున్సిపల్‌ ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యం సత్తా ఏమిటో చూపుతామంటూ ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌ శపథం చేశారు. శనివారం ఉదయం ఆయన అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల చేశారు. నగరంలోని ఏడు వార్డుల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో సుస్థిర పాలన, రాష్ట్రంలో స్వయం పరిపాలన, నగరాలు, గ్రామాల్లో సుపరిపాలన అనే లక్ష్యాలను కలిగిన తమ పార్టీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని నగరాన్ని సింగపూర్‌ తరహాలో అభివృద్ధి చేయడమే తమ పార్టీ ఆశయమని, ఆ దిశగానే పార్టీ తరఫున నిజాయితీ పరులైన అభ్యర్థులను బరిలోకి దింపుతుందన్నారు. నగరంలో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత ప్రాతిపదికన పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి నగరాలు, పట్టణాల్లో ఎక్కువగా ఓట్లు పడ్డాయని, దీనిని బట్టి తమ పార్టీకి నగరాలు, పట్టణాల్లో మంచి పట్టు ఉందని రుజువైందని చెప్పారు. పార్టీ శ్రేణులంతా ఈ ఎన్నికల్లో సైనికుల్లా అభ్యర్థుల విజయం కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు

* పిల్లలకు పంచే చిక్కీలో కూడా జగన్‌రెడ్డి కక్కుర్తి: పట్టాభి
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో అనేక రకాల స్కామ్‌లు చూశామని, ఇసుక, మద్యం, మైనింగ్ ఇలా దేనిని వదిలిపెట్టలేదని ఆరోపించారు. ఆదివారం ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడు రాష్ట్రానికి సీఎం అయితే.. ఏ విధంగా దోచుకుంటారో జగన్‌రెడ్డి ప్రత్యేక్ష ఉదాహరణ అని అన్నారు. వివిధ స్కామ్‌ల ద్వారా వేలకోట్లు దిగమింగిన జగన్ రెడ్డి… వారానికి మూడుసార్లు పిల్లలకు పంచే చిక్కీలో కూడా కక్కుర్తి పడ్డారని విమర్శించారు.

* మణిపూర్‌లో వికటించిన పొత్తు.. ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధం
మణిపూర్‌లో నేషనల్ పీపుల్స్ పార్టీతో భారతీయ జనతా పార్టీకి ఉన్న పొత్తు వికటించింది. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి వెళ్తున్నట్లు బీజేపీ ఆదివారం ప్రకటించింది. నిన్నటి వరకు ఎన్‌పీపీతో కలిసే బీజేపీ పోటీ చేయనుందని అనుకున్నప్పటికీ ఇరు పార్టీ మధ్య సీట్ల పంపకాల్లో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో 40 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితం ఎన్‌పీపీ అధినేత, మణిపూర్ సీఎం కోన్రాడ్ సంగ్మా ప్రకటించారు. అయితే సగం స్థానాలు కావాలని బీజేపీ పట్టు పట్టినట్లు సమాచారం.

*వీఐపీ సంప్రదాయాన్ని ఈఐపీగా మార్చాం: రాజ్‌నాథ్
ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, ప్రతి పౌరునికి రాష్ట్రంలో గుర్తింపు లభించిందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇప్పటి వరకు ఉన్న వీఐపీ (వెరీ ఇంపార్టెంట్ పర్సన్) సంప్రదాయాన్ని తాము ఈఐపీగా (ఎవరీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్) మార్చామని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్ల తమ పాలనలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి జరిగిందని రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. ‘సబ్‌ కా సాత్.. సబ్‌ కా వికాస్.. సబ్ కా విశ్వాస్’ నినాదంతో పాలన చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీయేనని రాజ్‌నాథ్ అన్నారు.

*Goa ఎన్నికల్లో కన్నడ నేతల హవా
గోవా రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో కన్నడ నేతల హవా సాగుతోంది. గోవా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా బెంగళూరు ఎమ్మెల్యే దినేశ్‌ గుండూరావు వ్యవహరిస్తున్నారు. తాజాగా రెండు రోజులుగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఎన్నికల కసరత్తు, ప్రచారం కోసం గోవా వెళ్లారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి నెల రోజులుగా గోవాలోనే మకాం వేశారు. అభ్యర్థుల ఎంపికతోపాటు ప్రచారం, తదితర వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. గోవాలో అవినీతిపరమైన బీజేపీ పాలన సాగిందనే డీకే శివకుమార్‌ శుక్రవారం నాటి వ్యాఖ్యలపై సీటీ రవి తీవ్రంగా స్పందించారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా డీకే శివకుమార్‌ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. గోవాలో బీజేపీ పాలనలో మనోహర్‌ పారిక్కర్‌, ప్రమోద్‌ సావంత్‌ నేతృత్వంలో ఉత్తమ పాలన సాగిందని, గతంలో మాదిరి గోవా కాదని ఇదో కొత్త గోవా అన్నారు. కొత్త ఎయిర్‌పోర్ట్‌, భారీ ఫ్లై ఓవర్‌, ఐఐటీ, మెడికల్‌ కళాశాల బీజేపీ ప్రభుత్వంలో సాధనలన్నారు. కాంగ్రెస్‌ వంశపారంపర్యం మినహా గోవాకు గానీ, దేశానికిగానీ సాధించిదీ ఏమీ లేదన్నారు. అవినీతి గురించి డీకే శివకుమార్‌ మాట్లాడే ముందు గతంలో ఎందుకు జైలుకు వెళ్లారో, ఎన్నిసార్లు దాడులు జరిగాయో గుర్తుంచుకుంటే మంచిదన్నారు. ఇలా గోవా వెళ్లిన కర్ణాటక నేతలు అక్కడి అభివృద్ధి, అక్కడి నేతలకు సంబంధించిన విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యత ఇచ్చారు.

* రేపు ఆమోదించనున్న గవర్నర్‌ హరిచందన్‌?
ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60నుంచి 62ఏళ్లకు పొడిగించిన ప్రభుత్వం దీనికి సంబంధించి ఆర్డినెన్స్‌ జారీ చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 21న జరిగిన కేబినెట్‌లో ఆమోదించిన ముసాయిదా ఆర్డినెన్స్‌ను న్యాయశాఖ పరిశీలన అనంతరం గవర్నర్‌ ఆమోదానికి పంపించింది. ఆ ముసాయిదా ప్రతి శనివారం రాజ్‌భవన్‌కు చేరింది. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దాన్ని మరోసారి పరిశీలించి ఆమోదం తెలపగానే ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేస్తుంది. ఈ ముసాయిదాను గవర్నర్‌ సోమవారం ఆమోదించే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం ఉద్యోగుల పదవీ విరమ ణ వయసు పెంచాలంటే చట్ట సవరణ చేయాల్సి ఉంది. 2014 జూన్‌లో అప్పటి టీడీపీ ప్రభుత్వం శాసనసభలో బిల్లుపెట్టిuj సభ ఆమోదించి రిటైర్మెంట్‌ వయసును 58నుంచి 60 ఏళ్లకు పొడిగించింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏపీ పబ్లిక్‌ ఎప్లాయింట్‌మెంట్‌ యాక్ట్‌ 1984కు సవరణ చేయాల్సి ఉంటుంది.