Devotional

TNI మహాశివరాత్రి ప్రత్యేక కథనాలు – 28/2/2022

TNI  మహాశివరాత్రి ప్రత్యేక కథనాలు – 28/2/2022

1.భారత్‏లో ప్రసిద్ధి చెందిన 12 జ్యోతిర్లింగాలు.. ఏ పేర్లతో పిలుస్తారు.. ఎక్కడున్నాయంటే..
అభిషేక ప్రియుడు, బోళా శంకరుడు, అర్ధనారీశ్వరుడు, నీలకంఠుడు, ఈశ్వరుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పరమేశ్వరుడికి ఎన్నో నామాలు. ఇక భారత దేశంలో శివుడుకి ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికి వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యతను పొందాయి. మరి ఆ 12జ్యోతిర్లింగాలు మన భారత దేశంలోనే ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..
*వైద్యనాధ్ జ్యోతిర్లింగం..
శ్రీవైద్యనాథేశ్వరుడు పాట్నా నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో కంతిపూర్‌ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు. ఈ రెండింటి నేపథ్యమూ రామాయాణాంతర్గత రావణాసురిడి కథతో ముడిపడి ఉంది.
*వైద్యనాధ్ జ్యోతిర్లింగం..
శ్రీవైద్యనాథేశ్వరుడు పాట్నా నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో కంతిపూర్‌ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు. ఈ రెండింటి నేపథ్యమూ రామాయాణాంతర్గత రావణాసురిడి కథతో ముడిపడి ఉంది.
* భీమశంకర జ్యోతిర్లింగం..
శ్రీభీమేశ్వరుడు డాకిని, భువనగిరి జిల్లా, మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతఘాట్‌లో పూణేకు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమ నది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసింది. కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది.
* భీమశంకర జ్యోతిర్లింగం..
శ్రీభీమేశ్వరుడు డాకిని, భువనగిరి జిల్లా, మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతఘాట్‌లో పూణేకు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమ నది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసింది. కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది.
*శ్రీఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం..
శ్రీ ఘృష్ణేశ్వరుడు మహారాష్ట్ర ఔరంగబాద్‌ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో శ్రీవిఘ్నేశ్వరాలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో ఘృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు, ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు, దేవగిరి కొండపై ఘృష్ణేశ్వరుని ఆలయం వెలిసింది.
* శ్రీఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం..
శ్రీ ఘృష్ణేశ్వరుడు మహారాష్ట్ర ఔరంగబాద్‌ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో శ్రీవిఘ్నేశ్వరాలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో ఘృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు, ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు, దేవగిరి కొండపై ఘృష్ణేశ్వరుని ఆలయం వెలిసింది.
* కేదార్‏నాద్ జ్యోతిర్లింగం..
శ్రీ కేధారేశ్వరుడు ఉత్తరాంచల్‌ రాష్ట్రంలో కేదారేశ్వలయం ఉంది. హిమాలయశిఖరం మందాకిని నదీతీరంలో సముద్ర మట్టానికి 3585 మీటర్ల ఎత్తులో ఎద్దుమూపుర ఆకారంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. గౌరీకుండ్ నుంచి 14కిలోమీటర్ల దూరం గుర్రాలుపై గానీ, డోలీలో గానీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయంను సంవత్సరంలో 6నెలలు మాత్రమే తెరుస్తారు. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కల్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథలో ఉంది.
*కేదార్‏నాద్ జ్యోతిర్లింగం..
శ్రీ కేధారేశ్వరుడు ఉత్తరాంచల్‌ రాష్ట్రంలో కేదారేశ్వలయం ఉంది. హిమాలయశిఖరం మందాకిని నదీతీరంలో సముద్ర మట్టానికి 3585 మీటర్ల ఎత్తులో ఎద్దుమూపుర ఆకారంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. గౌరీకుండ్ నుంచి 14కిలోమీటర్ల దూరం గుర్రాలుపై గానీ, డోలీలో గానీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయంను సంవత్సరంలో 6నెలలు మాత్రమే తెరుస్తారు. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కల్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథలో ఉంది.
* శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం..
శ్రీశైలం మల్లికార్జునేశ్వరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా దోర్నాల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి 52 కిలోమీటర్ల, హైదరాబాద్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠములలో ఒక్కటి. పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభువుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడుగా వెలిశాడు.
* శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం..
శ్రీశైలం మల్లికార్జునేశ్వరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా దోర్నాల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి 52 కిలోమీటర్ల, హైదరాబాద్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠములలో ఒక్కటి. పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభువుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడుగా వెలిశాడు.
* నాగనాధేశ్వర జ్యోతిర్లింగం..
శ్రీనాగనాథేశ్వరుడు లేదా నాగేశ్వరుడు .మహారాష్ట్ర ప్రభాస రైల్వేస్టేషన్‌కు సమీపంలో శ్రీనాగనాథేశ్వర ఆలయం ఉంది. ఈ జోతిర్గింగాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోగిర్లింగంగా పరిగనిస్తారు. పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ.
* నాగనాధేశ్వర జ్యోతిర్లింగం..
శ్రీనాగనాథేశ్వరుడు లేదా నాగేశ్వరుడు .మహారాష్ట్ర ప్రభాస రైల్వేస్టేషన్‌కు సమీపంలో శ్రీనాగనాథేశ్వర ఆలయం ఉంది. ఈ జోతిర్గింగాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోగిర్లింగంగా పరిగనిస్తారు. పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ.
* ఓంకారేశ్వర జ్యోతిర్లింగం..
మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. శ్రీ ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు-మామలేశ్వరము,శివపురి, మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో వింద్య పర్వత సానువుల్లో నర్మదానది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. ఇక్కడ ఓ లింగము రెండు భాగములుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతున్నాడు. ఇక్కడున్న అమ్మవారు అన్నపూర్ణదేవి.
*ఓంకారేశ్వర జ్యోతిర్లింగం..
మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. శ్రీ ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు-మామలేశ్వరము,శివపురి, మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో వింద్య పర్వత సానువుల్లో నర్మదానది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. ఇక్కడ ఓ లింగము రెండు భాగములుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతున్నాడు. ఇక్కడున్న అమ్మవారు అన్నపూర్ణదేవి.
* రామేశ్వర జ్యోతిర్లింగం..
తమిళనాడు లోని రామేశ్వరంలో కల రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాదిన ప్రసిద్ధ యాత్రా స్థలంగా పేరు పడింది.శ్రీరామేశ్వరుడు తమిళనాడు రాష్ట్రంలో శ్రీ రామేశ్వరాలయం ఉంది. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి.
* రామేశ్వర జ్యోతిర్లింగం..
తమిళనాడు లోని రామేశ్వరంలో కల రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాదిన ప్రసిద్ధ యాత్రా స్థలంగా పేరు పడింది.శ్రీరామేశ్వరుడు తమిళనాడు రాష్ట్రంలో శ్రీ రామేశ్వరాలయం ఉంది. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి.
*సోమనాధ జ్యోతిర్లింగాలయం…
గుజరాత్‌ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికీ ప్రజ్వరిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమ నాథేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణాల్లో ఉంది.
*సోమనాధ జ్యోతిర్లింగాలయం…
గుజరాత్‌ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికీ ప్రజ్వరిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమ నాథేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణాల్లో ఉంది.
* త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం..
శ్రీత్రయంబకేశ్వరుడు మహారాష్ట్రలోని నాసిక్‌కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబుకేశ్వరాలయం ఉంది. బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా వెలసి బ్రాహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలందుకొన్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
* త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం..
శ్రీత్రయంబకేశ్వరుడు మహారాష్ట్రలోని నాసిక్‌కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబుకేశ్వరాలయం ఉంది. బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా వెలసి బ్రాహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలందుకొన్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
*మహాకాళేశ్వర జ్యోతిర్లింగం..
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఉజ్జయినీ పట్టణంలో శ్రీ మహా కాళేశ్వరాలయం ఉంది. క్షిప్ర నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో 7 సాగరతీర్థములు, 28 తీర్థంలు, 84 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండము ఉన్నాయి. మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతి ర్లింగం.
*మహాకాళేశ్వర జ్యోతిర్లింగం..
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఉజ్జయినీ పట్టణంలో శ్రీ మహా కాళేశ్వరాలయం ఉంది. క్షిప్ర నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో 7 సాగరతీర్థములు, 28 తీర్థంలు, 84 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండము ఉన్నాయి. మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతి ర్లింగం.
* విశ్వేశర జ్యోతిర్లింగం..
శ్రీవిశ్వనాథేశ్వరుడు జ్యోతిర్లింగం వారణాసిగా జగత్‌ప్రసిద్ధి చెందిన కాశీక్షేత్రంలో ఉంది. దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీపట్టణం. గంగానది తీరంలో బౌద్ధ, జైన మతాలవారు, హైందవులు అనేకమంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు.
*విశ్వేశర జ్యోతిర్లింగం..
శ్రీవిశ్వనాథేశ్వరుడు జ్యోతిర్లింగం వారణాసిగా జగత్‌ప్రసిద్ధి చెందిన కాశీక్షేత్రంలో ఉంది. దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీపట్టణం. గంగానది తీరంలో బౌద్ధ, జైన మతాలవారు, హైందవులు అనేకమంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు.
np3
1. శివ‌పూజ‌కు ఏం కావాలి? రుద్రుడిని ఎలా పూజించాలి?
శివపూజకు కావాల్సింది.. కలశంలో నీళ్లు.. దోసెడు విభూది.. చిటికెడు కుంకుమ.. ఒక మారేడు దళం.. వీటిలో లోటుపాట్లున్నా.. నాలోనే శివుడు ఉన్నాడన్న భావన ప్రధానంగా ఉండాలి. మదిలో రుద్రుడిని నిలిపి, మహిమగల రుద్రుడిని అభిషేకించాలి. శివుడిగా, పరమేశ్వరుడిగా, మహాదేవుడిగా, శంకరుడిగా.. అనంత నామాలతో పిలుచుకొని, ఆరాధనలు అందుకునే రుద్రుడు ఎవరు? ఒకే దేవుడికి ఇన్ని పేర్లు ఎందుకు? భక్తులకు కలిగే సందేహాలివి. ప్రతి సందేహం వెనుక సందేశాత్మక వివరణలు ఇచ్చాయి మన పురాణాలు. యజుర్వేదంలోనూ ఈ ప్రశ్నలకు సంబంధించి అనేక వివరణలు ఉన్నాయి.
*ఇంతకీ ఎవరీ రుద్రుడు?
రుద్ర శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. ‘రుతం సంసార దుఃఖం ద్రావయతీతి రుద్రః’- సంసార దుఃఖాన్ని నాశనం చేసేవాడు రుద్రుడు. ‘రుత్యా వేద రూపాయ ధర్మాదీనవలోకయతి ప్రాపయతీతి వా రుద్రః’- వేదరూపంలో ధర్మాన్ని మనకు అందజేసేవాడు రుద్రుడు. ‘రుత్యా ప్రణవ రూపాయా స్వాత్మానం ప్రాపయతీతి రుద్రః’- తనను తాను ప్రణవ నాద రూపంలో ఆవిష్కరింపజేసుకునేవాడు రుద్రుడు. ఇలా అనేక రకాలుగా మన ప్రాచీనులు రుద్ర శబ్దానికి అర్థాన్ని వివరించారు. బృహదారణ్యక ఉపనిషత్తులో ‘రుద్ర’ శబ్దానికి నిర్వచనంతోపాటు, ఎందరు రుద్రులు ఉన్నారు అనే వివరాలు ఉన్నాయి.మనిషిలో ఉండే ప్రాణాలు, మనసు, జీవాత్మ.. ఇవన్నీ కలిపి ఒకటి. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు కలిపితే పది. మొత్తంగా పదకొండు మంది రుద్రులు. వారి పేర్లు రుద్రుడు, త్రయంబకుడు, మహేశ్వరుడు, అహిర్బుధ్న్యుడు, హరుడు, ఏకపాదుడు, అజుడు, పినాకి (త్రిభువనుడు అని కొన్నిచోట్ల పేర్కొన్నారు), శంభుడు, అపరాజితుడు, ఈశానుడు. వీరందరూ రుద్రులే! ఏకాదశ రుద్రులను రుద్రాభిషేకంతో అర్చిస్తారు. రుద్రాభిషేకంలో ముందుగా భౌతిక పూజ, తర్వాత మానసిక పూజ. అటుపై సర్వమూ శివమయం అని గుర్తించి శివ స్వరూపులం కావాలి. ‘నారుద్రో రుద్రమర్చయేత్‌’ అన్నారు. అంటే ‘రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకానికి అర్హుడు కాదు’ అని ప్రమాణ వచనం. రుద్రుడు నేనే అన్న భావన పరిపూర్ణంగా కలిగి శివార్చన చేయాలి. రుద్రాభిషేకం చేయడానికి అధికారి కావడానికి, రుద్రుడిని తన ఆత్మలో నిలపడానికి రౌద్రీకరణం చేసుకోవాలి. అందుకు మహన్యాసం తోడ్పడుతుంది. రుద్రుడిని తనలో ఆవాహన చేసుకొని, తానే రుద్రుడు అయి, రుద్రార్చనకు అధికారి అవుతాడు కర్త. కృష్ణ యజుర్వేద తైత్తిరీయ సంహిత చతుర్థకాండంలోని పంచమ, సప్తమ ప్రపాఠకాలను ‘నమకం, చమకం’ అంటారు. రెండూ కలిపితే రుద్రం. నమక-చమకాలు స్వరబద్ధంగా చదువుతూ అభిషేకం నిర్వహిస్తారు. నమకంలో విశ్వంలోని ప్రతి అణువూ రుద్రుడే అని భావన చేస్తూ, ఆయా రూపాల్లో వ్యక్తమయ్యే రుద్రుడికి నమస్కారం చెయ్యటం ప్రధానాంశంగా ఉంటుంది. చమకంలో ఇందుకు భిన్నంగా భక్తుడు తన కోరికల చిట్టాను భగవంతుడి ముందు సమర్పిస్తాడు. ‘శివా! వీటన్నిటినీ నాకు అనుగ్రహించవలసింది’ అని ప్రార్థిస్తాడు. సద్యోజాత,వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన పేర్లతో పంచముఖాలతో నాలుగు దిక్కులను, ఊర్ధదిశను చూస్తూ జగత్తును రక్షిస్తున్న రుద్రుడికి, పరమాత్మకు ఆత్మార్పణం చేస్తున్నానన్న భావనతో రుద్రాధ్యాయాన్ని పారాయణం చేస్తారు.
*శివారాధనలో ప్రముఖమైన రుద్రాభిషేకాన్ని వివిధ రకాలుగా ఆచరిస్తారు. ఏకాదశ రుద్రాభిషేకం, లఘురుద్రం, శతరుద్రీయం ఇలా శక్తిసామర్థ్యాలను బట్టి భక్తులు దీనిని నిర్వహిస్తూ ఉంటారు. నమక-చమకాల సంఖ్య ఆధారంగా వీటిని వివిధ రకాల రుద్రాభిషేకాలుగా పిలుస్తారు. శ్రీకృష్ణుడు ఒక ఏడాదిపాటు పాశుపత దీక్ష చేసి, విభూదిని వంటినిండా అలుముకొని, రుద్రాధ్యాయాన్ని పారాయణ చేశాడని కూర్మ పురాణం చెబుతున్నది. జాబాల ఉపనిషత్తులో బ్రహ్మచారులు ‘కిం జప్యేన అమృతత్వమశ్నుతే?’ (దేనిని జపించడం వల్ల అమృతత్వం కలుగుతుంది) అని ప్రశ్నిస్తారు. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి ‘శత రుద్రీయం’ చేయడంతో అమృతత్వం సిద్ధిస్తుందని సమాధానం చెబుతాడు. నిత్యం రుద్రాధ్యాయాన్ని జపించేవాళ్లు ముక్తిని పొందుతారని స్మృతులు చెబుతున్నాయి. ఐహిక భోగాలు, మోక్షం, పాప ప్రాయశ్చిత్తం కోరుకునేవారికి రుద్రుడి ఆరాధనకు మించిన మార్గం లేదు.
**లోకం చల్లగా ఉండాలని
‘అభిషేక ప్రియః ఈశ్వరః’- ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. శివుడు విశ్వరూపుడు కనుక, రుద్రాభిషేకంతో విశ్వం చల్లబడుతుంది. ఈ లోకం సుఖశాంతులతో చల్లగా ఉంటుంది. పంచామృతాలతో, గంగాజలంతో రుద్రుణ్ని అభిషేకించి, తుమ్మిపూలతో, మారేడు దళాలతో పూజించి, గోక్షీరాన్ని, కదళీ (అరటి) ఫలాన్ని నైవేద్యం పెట్టాలి. చతుఃషష్టి (64) ఉపచారాలతో అర్చించాలి. కుదరక పోతే షోడశోపచారాలతో అయినా పూజించాలి. మనకు పంచేంద్రియాలను అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా కనీసం పంచోపచారాలతోనైనా పూజించాలి. ఏ మంత్రాలూ రాకున్నా.. మనసు నిండా భక్తి భావంతో శివపంచాక్షరి జపం చేసినా శివయ్య అనుగ్రహం తప్పక లభిస్తుంది.

2.కాశీకి వెళ్తే 9 రాత్రులు నిద్ర చేయాల‌ని అంటారు.. ఎందుకు
27 హిమగిరి సొగసులు కాదని, కాశీ ( Kashi ) నగరానికి కోరి వచ్చాడు కైలాసనాథుడు. ఆ విశ్వనాథుడి వెంటే.. విశాలాక్షి. ఆమెకు తోడుగా అన్నపూర్ణ. వారికి నీడగా డుండి గణపతి. వీళ్లందరి వెంట కాలభైరవుడు. ఒకరి తర్వాత ఒకరు.. ఒకరి కన్నా వేగంగా ఇంకొకరు.. మొత్తంగా ముక్కోటి దేవతలు వారణాసిని మరో మజిలీగా మార్చుకున్నారు. గంగ ఒడ్డున ఆలయాలు.. వీధి మలుపులలో గుళ్లూ గోపురాలు.. ఇండ్ల మధ్య ఇలవేల్పులు.. గుడిగంటలకు విరామం ఉండదు. ఏదో ఒక ఆలయం నుంచి ప్రణవనాదం వినిపిస్తూనే ఉంటుంది. కాశీవాసులకు అందులో వింతేమీ తోచకపోవచ్చు. కానీ, అక్కడికి వెళ్లిన యాత్రికులకు మాత్రం కాశీలో అడుగడుగునా ఓ అద్భుతం దర్శనమిస్తుంది. పీల్చే గాలిలో, తాగే నీటిలో, తినే ఆహారంలో అన్నిటా శివతత్తం గోచరం అవుతుంది. సాధువులు, సత్సంగాలు, బారులుతీరిన భక్తులు, గంగలో మునకల అపురూప దృశ్యకావ్యం విరామం లేకుండా దర్శనమవుతూ ఉంటుంది. మహాశివరాత్రి ( Maha shivaratri )సందర్భంగా మహిమాన్విత క్షేత్రం వారణాసి ( Varanasi ) విశేషాలు…
*‘భక్తులు, యోగులు మొదలైన వారి పాదాలకు కొలువైన క్షేత్రం, భవబంధాలను చీల్చి చెండాడి, వాటినుంచి విముక్తి కలిగించే క్షేత్రం, పరమ పవిత్రమైన గంగానది ఉన్న క్షేత్రం, ఎన్నెన్నో దైవికమైన క్షేత్రాలకు నిలయం వారణాసి’ అని కాశీ వైభవాన్ని చాటి చెబుతాడు సత్య హరిశ్చంద్రుడు. ఈ వాక్యాల్లోని ప్రతీ అక్షరం హరిశ్చంద్రుడి మాటంత సత్యమైంది.
*అతి పురాతనమైనదిగా చెప్పే రుగ్వేదంలోనూ కాశీ ప్రస్తావన కనిపిస్తుంది. వేద కాలం నుంచే వారణాసి కీర్తి దశదిశలా వ్యాపించింది. ‘కాశి’ అంటే ‘నిరంతరం వెలుగొందునది’ అన్న అర్థం ఉంది. పేరుకు తగ్గట్టుగానే ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రతీది నిత్యనూతనంగా ప్రకాశిస్తుంది. మోక్షపురిగా, కళలకు కాణాచిగా, పట్టుచీరలకు పట్టుకొమ్మగా, సంప్రదాయాలకు చిరునామాగా అలరారుతున్నది. వరుణ, అసి రెండు నదులు కలిసిన భూభాగం కావడంతో ‘వారణాసి’ అన్న పేరు వచ్చింది. ఆలయ నగరిగా ప్రసిద్ధిచెందిన కాశీలో చిన్నా పెద్దా ఆలయాలు వేలల్లో ఉంటాయి. ప్రతి ఆలయం వెనుక ఓ పౌరాణిక గాథ వినిపిస్తుంది. గుడి ఆకారం చూసి దాని ప్రాముఖ్యాన్ని అంచనావేయడం కష్టమే. ప్రతి గుడీ విశేష ప్రాశస్త్యం కలిగి ఉన్నదే. ప్రతి దేవుడూ స్వయంగా వచ్చి కొలువుదీరినదే!
*మోక్షపురి
‘అయోధ్య, మధుర, మాయా (హరిద్వార్‌), కాశీ, కాంచి (కంచి), అవంతిక, పూరి, ద్వారవతి (ద్వారక).. సప్తయితే మోక్షదాయకః’ అని వేద వచనం. మోక్షాన్ని ప్రసాదించే ఏడు క్షేత్రాల్లో కాశీ ఒకటి. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. చావును కోరుకుంటూ వారణాసికి వచ్చేవాళ్లు వేలల్లో ఉంటారు. శేష జీవితాన్ని కాశీనాథుని సన్నిధిలో సాధనకు అంకితం చేసి తరించేవాళ్లు అనేకులు. అవసాన దశలో పట్టుదలతో కాశీకి వచ్చి కన్నుమూసిన వ్యక్తుల కథలూ వినిపిస్తాయి. అంతేకాదు, కాశీలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే మోక్షం లభిస్తుందని, ‘ఎక్కడ పోయినా, కాశీలోనే తమ కట్టె కాలాలి’ అని చివరి కోరికగా విన్నవించుకునే వాళ్లూ ఉంటారు. చివరికి పోయినవారి అస్థికలు కాశీలో గంగలో కలిపినా ముక్తి లభిస్తుందని చెబుతారు. అందుకే నిత్యం వందలాది మంది తమ ఆత్మీయుల అస్థికలు తెచ్చి గంగలో నిమజ్జనం చేస్తుంటారు.
*జ్యోతిర్లింగ క్షేత్రం.. శక్తిపీఠం
తనకు తానుగా కోరుకొని, దేవతల కోరిక మేరకు కైలాసం నుంచి కదిలివచ్చిన శివుడు కాశీలో విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశాడని ప్రతీతి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇదీ ఒకటి. యుగాలుగా కొలువుదీరిన ఈ క్షేత్రం, ఎందరో రాజులకు రాజధాని నగరంగా విలసిల్లింది. ముమ్మరంగా సాగిన వర్తక వాణిజ్యాలతో సంపన్న నగరంగా ఎదిగింది. మధ్యయుగంలో జరిగిన దండయాత్రలతో విశ్వనాథుడి కోవెల అనేకసార్లు విధ్వంసానికి గురైంది. రాజపుత్రులు, మరాఠా పాలకులు ఎన్నో ఆలయాలను తిరిగి నిర్మించారు. ఇప్పుడున్న విశ్వనాథుడి ఆలయాన్ని 1780లో ఇండోర్‌ రాణి అహల్యాబాయి హోల్కర్‌ నిర్మించారు. ఈ విధ్వంసాలు చరిత్రపుటల్లో ఎలా మిగిలిపోయినా, కాశీ పవిత్రత మాత్రం చెక్కుచెదరలేదు.
జ్యోతిర్లింగ క్షేత్రంగా మాత్రమే కాదు శక్తిపీఠంగానూ వారణాసి ప్రసిద్ధిచెందింది. (ఇలాంటి మరో క్షేత్రం శ్రీశైలం.) మీర్‌ ఘాట్‌ సమీపంలో ఉన్న దేవాలయంలో అమ్మవారు విశాలాక్షిగా కొలువుదీరింది. సతీదేవి చెవికమ్మలు లేదా కన్నులు ఈ ప్రదేశంలో పడ్డాయని స్థలపురాణం. అన్నపూర్ణాదేవి ఆలయం కూడా అపర శక్తిపీఠంగా దర్శనమిస్తుంది.
*భైరవుడి అనుగ్రహం ఉంటేనే..
జన్మాంతర యోగం ఉంటే గానీ, కాశీలో అడుగుపెట్టలేం అని చెబుతారు పెద్దలు. ఇలా అనుకోగానే అలా వారణాసికి అందరూ వెళ్లలేరు. కాశీలో అడుగుపెట్టాలంటే ముందుగా కాలభైరవుడి అనుగ్రహం ఉండాలి. ఎంత దూరంనుంచి కాశీపురికి వచ్చినా.. కాలభైరవుడి ఆజ్ఞ తీసుకున్న తర్వాతే మిగతా ఆలయాల దర్శనానికి వెళ్తుంటారు. కాశీ నగరం భద్రత వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటాడని నమ్మకం. అందుకు తగ్గట్టే కాశీ క్షేత్రానికి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది భైరవ ఆలయాలు ఉంటాయి. అన్ని ఆలయాలనూ దర్శించుకుంటే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని అంటారు. భక్తులే కాదు, వారణాసికి వచ్చే కొత్త కొత్వాల్‌ (పోలీస్‌ కమిషనర్‌) సైతం ముందుగా భైరవుడి ఆలయాన్ని సందర్శించుకుంటాడు. ‘నీ ప్రతినిధిగా కాశీ రక్షణ బాధ్యతలు నిర్వర్తించే అధికారం నాకు ప్రసాదించు స్వామి’ అని అభ్యర్థించిన తర్వాతే విధుల్లో చేరుతాడు.
*కాశీ గంగ ప్రత్యేకం
దివిజ గంగకు భువిలో అత్యంత ప్రాధాన్యం కాశీలో కనిపిస్తుంది. ‘కాశీ గంగ’ను తలుచుకున్నంత మాత్రాన పాపాలు పరిహారం అవుతాయని అంటారు. హిమాలయాల్లో పుట్టింది మొదలు దక్షిణముఖంగా ప్రవహించే గంగా నది.. కాశీలో ఉత్తరంగా ప్రవహించడమే ఇంతటి ప్రాధాన్యానికి కారణం. ఉత్తరవాహినిగా ప్రవహించే గంగలో మునకేయడం జన్మజన్మల అదృష్టంగా భావిస్తారు. భారతదేశ చరిత్ర, సంస్కృతి, భారతీయ నాగరికతలో అతిముఖ్య భాగమైన గంగ ఒడ్డున కాశీ వైభవం అంతా కనిపిస్తుంది. పుణ్యస్నానాలు ఆచరించే వారు ఒకవైపు, పితృదేవతలకు తిల తర్పణాలు విడిచేవారు మరోవైపు, ఓ ఘాట్‌లో కర్మకాండలు, మరో ఘాట్‌లో అభిషేకాలు, ఒకచోట హోమాలు, మరోచోట దహనక్రియలు.. సనాతన సంప్రదాయంలోని సంస్కారాలన్నిటినీ ఇక్కడ చూడొచ్చు. ఒకసారి రుద్రభూమిగా, మరోసారి అమరధామంగా దర్శనమిస్తుంది గంగా తటి. కాశీలో గంగ పొడవునా 84 ఘాట్లు ఉన్నాయి. దశాశ్వమేధ ఘాట్‌, తులసీ ఘాట్‌, కేదార్‌ ఘాట్‌, లలితా ఘాట్‌, అస్సీ ఘాట్‌.. ఇలా ఎన్నో. వేటికదే ప్రత్యేకం. ప్రతి ఘాట్‌దీ ఓ ప్రత్యేక పౌరాణిక, చారిత్రక నేపథ్యం. హరిశ్చంద్ర, మణికర్ణిక ఘాట్‌లలో నిరంతరం దహనక్రియలు జరుగుతూనే ఉంటాయి. దశాశ్వమేధ ఘాట్‌, దర్భంగా ఘాట్‌, హనుమాన్‌ ఘాట్‌, మాన్‌మందిర్‌ ఘాట్లు ప్రత్యేకమైనవిగా చెబుతారు. మానసరోవర్‌ ఘాట్‌, నారద ఘాట్‌, మణికర్ణిక ఘాట్‌లు పితృదేవతలకు పిండప్రదానాలు, అస్థికల నిమజ్జనానికి ప్రత్యేకం. కాశీలో రెండు వారాలు విడిది చేసినా.. ఈ ఘాట్లన్నీ దర్శించుకోలేం. చాలామంది పడవలపై గంగానదిలో విహరిస్తూ ఘాట్లన్నీ దర్శించుకుంటారు. తొలి, మలి సంధ్యల్లో గంగానదిపై విహారం అద్భుతమైన అనుభూతిని మిగుల్చుతుంది.
*మనసుతో వెతికితేనే..
కాశీపురి పైకి ఎంత హడావుడిగా కనిపిస్తుందో, మనసుతో చూస్తే అంత నిగూఢంగా ఉంటుంది. ఏదో ఆధ్యాత్మిక శక్తి అంతరంగా దాగి ఉందనిపిస్తుంది. అభిషేకాలు, సత్సంగాలు, భజనలు ఇదంతా ఒక పార్శమే! సాధకులు, అఘోరాలు, సాధనలు ఇవి సామాన్యుల కంటికి కనిపించవు. పైపైన చూస్తే.. ఏమీ అంతుపట్టదు. లోలోపల దర్శిస్తే అణువణువూ శివుడే కనిపిస్తాడు. ఈ మహిమను దర్శించడానికి అణిమాది అష్టసిద్ధులు సాధించిన యోగులెందరో కాశీలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సిద్ధులను పొందడానికి దేశదేశాల నుంచి సాధకులు వారణాసికి వచ్చి ఇక్కడే ఉండిపోతారు. తులసీదాసు, కీనారాం అఘోరీ, త్రైలింగ స్వామి.. ఇలాంటి మహామహులు ఎందరో విశ్వనాథుడి సన్నిధిలో సంచరించినవారే. నేటికీ ఎందరో సిద్ధులు కాశీలో తపస్సు ఆచరిస్తుంటారు. కొందరు బైరాగుల్లా కనిపిస్తారు. మరికొందరు మాటాపలుకూ లేకుండా మౌనదీక్షలో తరిస్తుంటారు. కాశీ పరిసరాల్లో అఘోరాలు కోకొల్లలు. కానీ, సామాన్యంగా వారు ఎవరి కంటాపడరు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే బయటికి వస్తుంటారు. అంతేకాదు, కొన్ని మార్మిక, తాంత్రిక విద్యలకు కాశీ కేంద్ర బిందువు. హిందువులకు మాత్రమే కాదు, ఇతర మతాలకూ కాశీ ప్రాధాన్య క్షేత్రమే! నగర శివారులో ఉన్న సారనాథ్‌ బౌద్ధుల పుణ్యస్థలి. గౌతమ బుద్ధుడు మొదటిసారి ధర్మోపదేశం చేసింది సారనాథ్‌లోనే. జైన ఆలయాలు కూడా కాశీలో కనిపిస్తాయి. ముస్లింలు ఇక్కడి జ్ఞాన్‌వాపి మసీదును పవిత్రమైనదిగా భావిస్తారు.
*ఎంత మారినా అదే వింత
వారణాసి అంటే ఇరుకు వీధులు, ఇసుకేస్తే రాలనంత జనాలు. కాలక్రమంలో చోటు చేసుకుంటున్న మార్పులు, కొత్త నిర్మాణాలు ఈ క్షేత్రానికి కొత్త సొబగులు అద్దుతున్నాయి. ఎంత మారినా, కొత్తగా ఎన్ని హంగులు వచ్చిచేరినా కాశీపురికి చిరునామా అచంచలమైన భక్తి మాత్రమే! లక్షల్లో తరలి వచ్చే భక్తులు, గంగ ఒడిలో వేసే మునకలు, తర్పణాలు, దాన ధర్మాలు, సంస్కృతీ సంప్రదాయాలు ఇవే కాశీని అపర కైలాస సదనంగా నిలబెడుతున్నాయి. కార్తిక మాసం, మహాశివరాత్రి వంటి ప్రత్యేక సమయాల్లో కాశీ వైభవం చూసి తరించాల్సిందే. శివరాత్రి సందర్భంగా మృత్యుంజయ ఆలయం నుంచి విశ్వనాథుడి సన్నిధి వరకు కోలాహలంగా ఊరేగింపు నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొని ‘జై బోలేనాథ్‌’ అంటూ జేజేలు పలుకుతారు. కార్తిక పౌర్ణమి సందర్భంగ గంగ ఒడ్డున అన్ని ఘాట్లలోనూ లక్షల్లో దీపాలు వెలిగిస్తారు. గంగ ఒడ్డున దీపాలు, గంగా తరంగాలపై ఆ దీపాల ప్రతిబింబాలు చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటాయి. కాలం మారినా, కొత్త వసతులు ఎన్ని చేర్చినా.. కాశీ పవిత్రతలో ఏ మార్పూ కనిపించదు.
*కైలాసం కాదని వారణాసికి
భగవంతుడు విశ్వవ్యాప్తంగా ఉంటాడు. కానీ, అంతటా నిండి ఉన్న దేవుడి తత్తాన్ని తెలియజేసే పుణ్యక్షేత్రాలు మాత్రం కొన్నే. అందులో ప్రముఖమైనది వారణాసి. కైలాస సదనంలో కులాసాగా ఉంటున్న శంకరుడికి.. ఒకసారి హిమగిరులు దాటి ఆవల ఉండాలని మనసు పుట్టింది. పార్వతితో కలిసి ఏదైనా సిద్ధక్షేత్రంలో నివసించాలని కోరుకున్నాడు. చివరికి కాశీని ఎంచుకున్నాడు శివుడు. అప్పటికే కాశీని రాజధానిగా చేసుకొని ఆ ప్రాంతాన్ని దివోదాసు అనే రాజు పరిపాలిస్తున్నాడు. పరమేశ్వరుడి ఆనతితో నికుంభుడనే రాక్షసుడు వారణాసికి వెళ్లి అక్కడి ప్రజలను, రాజును తరలించి, శివుడు నివసించడానికి అనువైన ఏర్పాట్లు చేస్తాడు. తన రాజ్యం పోయిందన్న బాధతో దివోదాసు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. అప్పుడు కాశీరాజు ‘దేవతలు దేవలోకంలో, నాగులు పాతాళంలో, భూలోకంలో మనుషులు మాత్రమే ఉండే విధంగా వరం ఇవ్వమ’ని కోరుతాడు. ‘తథాస్తు’ అంటాడు బ్రహ్మ. దీంతో కాశీనాథుడు మళ్లీ కైలాసానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లినా శివుడి మనసు మనసులో ఉండదు. కాశీలో ఉండటానికి మార్గం సుగమం చేయమంటూ 64 మంది యోగినులను పంపిస్తాడు. ఆ వచ్చిన దేవతలను గంగాతీరంలో ప్రతిష్ఠిస్తాడు దివోదాసు. శివాజ్ఞ మేరకు సూర్యుడు రాగా, ద్వాదశాదిత్య రూపాలుగా గంగ ఒడ్డున ప్రతిష్ఠిస్తాడు. దివోదాసును ఒప్పించడానికి స్వయంగా బ్రహ్మదేవుడే వారణాసికి వెళ్తాడు. ఆయననూ మచ్చిక చేసుకున్న రాజు.. బ్రహ్మతో గంగాతీరంలో దశాశ్వమేథ హోమం చేయిస్తాడు. చివరికి విష్ణుమూర్తి కాశీకి వెళ్లి, దివోదాసుకు జ్ఞానోపదేశం చేస్తాడు. అలా శివుడు మళ్లీ కాశీ విశ్వనాథుడు అయ్యాడని స్థలపురాణం.
*దర్శనీయాలు కోకొల్లలు
కాశీ వెళ్లిన యాత్రికులు అక్కడ తొమ్మిది రాత్రులు నిద్ర చేయాలనే సంప్రదాయం ఉంది. అలా తొమ్మిది రాత్రులు బస చేసినవారికి ముక్తి లభిస్తుందని నమ్మకం. ఆ మాట అలా ఉంచితే, కాశీని కండ్లారా చూడటానికి, మనసారా అనుభవించడానికి మూడు వారాలున్నా సయమం సరిపోదు. పదుల సంఖ్యలో ఘాట్లు, వందల సంఖ్యలో వీధులు, వేలాది ఆలయాలు ఇవన్నీ చూడాలంటే కనీసం రెండుమూడు నెలలైనా పడుతుంది. అందుకే చాలామంది జీవిత చరమాంకంలో కాశీకి వెళ్లి అక్కడ వానప్రస్థాశ్రమం హాయిగా గడుపుతారు. యాత్రగా కాశీ వెళ్లే భక్తులు తప్పకుండా దర్శించుకునే ఆలయాలు కొన్ని ఉన్నాయి. కాలభైరవ మందిర్‌, బిందుమాధవుడి సన్నిధి, సంకటమోచన హనుమాన్‌ ఆలయం, రోజుకు నువ్వు గింజ ప్రమాణంలో పెరిగే తిలభాండేశ్వర సజీవ లింగం, కేదార్‌ ఘాట్‌లోని కేదారేశ్వర ఆలయం, అపమృత్యుదోషాలను తొలగించే మృత్యుంజయ మందిరం, తులసీదాసు రామాయణాన్ని రచించిన తులసీ మానస మందిరం, నీలకంఠేశ్వరుడి గుడి, ఓంకారేశ్వర ఆలయం, డుండి గణపతి దేవాలయం, అన్నపూర్ణ కోవెల, వారాహి మందిరం, కాళీ దేవాలయం వంటివి తప్పక చూడాల్సినవి. గంగా నది అవతలి వైపున్న రామ్‌నగర్‌ కోట అద్భుతంగా ఉంటుంది. పడవలో ఆ ఒడ్డుకు చేరుకొని, కోటంతా కలియ తిరగొచ్చు. ఇప్పటికీ ఆ కోటలో కాశీ రాజుల వారసుల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. జంతర్‌ మంతర్‌, పోర్ట్‌ మ్యూజియం యాత్రికులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. గంగకు అవతలి ఒడ్డున ఉన్న దాన్ని వ్యాసకాశీ అని పిలుస్తారు. వేదవ్యాసుడు ఇక్కడే అష్టాదశ పురాణాలు రాశాడని ప్రతీతి.
*నిత్య హారతి..
వారణాసికి వెళ్లిన భక్తులు విశ్వనాథుడి దర్శనం తర్వాత ఆత్రుతగా ఎదురుచూసేది గంగా స్నానం గురించే. ఆ తర్వాత మనసుపడేది గంగమ్మకు నిర్వహించే హారతిపైనే. ప్రతి రాత్రి గంగమ్మతల్లికి లయబద్ధంగా ఇచ్చే హారతి మనోహరంగా ఉంటుంది. ‘గంగమ్మా నీవు వేద సారానివి, సకల జీవరాశులకు ఆహారం ఇవ్వడానికి పరమాత్మ నిన్ను సృష్టించాడ’ని స్తుతిస్తూ గంగామాతకు హారతి ఇస్తారు అర్చకులు. విశ్వనాథ ఆలయానికి సమీపంలోని దశాశ్వమేధ ఘాట్‌, రాజేంద్రప్రసాద్‌ ఘాట్‌, అస్సీ ఘాట్లలో గంగా హారతి నిర్వహిస్తారు. అస్సీ ఘాట్‌లో తొలి సంధ్యవేళలో హారతి ఇస్తారు. ఘాట్‌ సమీపంలో ‘సుబాహ్‌-ఎ-బనారస్‌’ వేదికగా దీనిని నిర్వహిస్తారు. ఇక్కడే పలు సాంస్కృతిక కార్యక్రమాలూ జరుగుతాయి. యోగసాధకులు అస్సీఘాట్‌ సమీపంలో ప్రతి ఉదయం యోగాభ్యాసం చేస్తూ కనిపిస్తారు. సూర్యోదయం సమయంలో అస్సీఘాట్‌ ప్రాంతానికి వెళ్తే ప్రశాంత కాశీని దర్శించుకోవచ్చు. దశాశ్వమేధ్‌, రాజేంద్రప్రసాద్‌ ఘాట్లలో సూర్యాస్తమయం తర్వాత హారతి నిర్వహిస్తారు. గంగమ్మను కీర్తిస్తూ, భజనలు చేస్తూ, మేళతాళాల విన్యాసాలకు దీటుగా అర్చకులు సమర్పించే హారతి అలౌకిక ఆనందాన్ని కలుగజేస్తుంది. యాత్రికులు పడవల్లో గంగానదిపై తేలుతూ హారతిని నేత్రపర్వంగా తిలకిస్తారు. ఈ సేవలో భక్తులు కూడా పాల్గొనవచ్చు. టికెట్‌ తీసుకున్న భక్తుల గోత్రనామాలు చెబుతారు.
*శరీరంలో జీవుడు ఉన్నన్ని రోజులు, అనురాగ పరాయణత్వంతో వారణాసిలో జీవించాలి. సంకల్ప పూర్వకంగా మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయాలి. కాశీ విశ్వేశ్వరుడిని గంధాక్షతలతో, ఫల పత్ర పుష్పాలతో పూజించాలి. ఆత్మ ధర్మాలైన శమదమాదులలో, తనకు విహితాలైన వర్ణధర్మాలలో,ఆశ్రమ ధర్మాలలో, దోషం దొర్లకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. తనశక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. వీటిని ఆచరించడం ద్వారా కాశీలో కైవల్యం లభిస్తుంది.
*వందేండ్ల విశ్వవిద్యాలయం
కాశీలో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి బెనారస్‌ హిందూ యూనివర్సిటీ ( Banaras Hindu University ). 1916లో వసంత పంచమినాడు దీనిని ప్రారంభించారు. విద్యావేత్త మహామాన్య మదన్‌ మోహన్‌ మాలవీయ, అనీబిసెంట్‌ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అప్పటి రాజులు, సంస్థానాదీశుల దగ్గరినుంచి విరాళాలు సేకరించి దీనిని నిర్మించారు. ఆనాటి అందమైన భవనాలు, వేలమంది విద్యార్థులతో విశ్వవిద్యాలయ ప్రాంగణం సందడిగా కనిపిస్తుంది. 2015లో వందేండ్ల ఉత్సవాన్ని నిర్వహించారు. విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయంలో పురాతన గ్రంథాలు ఎన్నో చూడొచ్చు.
*పురమంతా వేదికే!
విశ్వనాథుడి కాశీలో శ్రీరాముడి లీలలు చూసే సౌభాగ్యం కలుగుతుంది. తులసీదాస విరచిత ‘రామచరిత మానస్‌’ ఆధారంగా రామ్‌లీలా కళాకారులు ప్రదర్శించే రామాయణ దృశ్యకావ్యం అపురూపం. ఉత్తరాదిలో రామ్‌లీలా ప్రదర్శనలు చాలా చోట్ల జరుగుతాయి. కానీ, వారణాసిలో నిర్వహించే ప్రదర్శనకు ఓ ప్రత్యేకత ఉంది. ఎక్కడైనా ఒకే వేదికపై నాటకాన్ని ప్రదర్శిస్తారు. కాశీలో మాత్రం సన్నివేశాన్ని బట్టి వేదికలు మారుతుంటాయి. కాశీలో జనకపురి, పంచవటి, లంక, అశోకవాటిక ఇలా.. రామాయణ కావ్యంలో పేర్కొన్న ప్రాంతాల పేరుతో పలు వేదికలు ఉన్నాయి. ఆయా ఘట్టాలను బట్టి వేదికలు ఎంచుకుంటారు కళాకారులు. ఆ వేదికపై ప్రదర్శించాల్సిన ఘట్టం పూర్తికాగానే, మరుసటి రోజు మరో సన్నివేశం ఇంకో వేదికపై ప్రదర్శిస్తారు. ఒక్కోసారి ఒకే రోజు రెండు మూడు వేదికలు మారుతూ రామాయణాన్ని ప్రదర్శిస్తారు. ఒక ఘట్టం పూర్తికాగానే నాటకాన్ని చూసేందుకు వచ్చినవాళ్లు కూడా కళాకారుల వెంట బయల్దేరి మరో వేదిక దగ్గరికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా ఆశ్వయుజంలో నెల రోజులపాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది.
*పట్టుచీరల కార్ఖానా
బెనారస్‌లో చూడాల్సిన మరో అద్భుత ప్రదేశం అక్కడి పట్టుచీరల తయారీ పరిశ్రమ. కాశీ, పరిసర గ్రామాల్లో వేలాది కుటుంబాలకు చీరలు నేయడం జీవనోపాధి. 14వ శతాబ్దం నుంచే కాశీలో చేనేత పరిశ్రమ ఉన్నట్టుగా తెలుస్తున్నది. కాలక్రమంలో పట్టుచీరల తయారీ కేంద్రంగా ప్రఖ్యాతిగాంచింది. సాధారణ నేత చీరలు మొదలు బంగారు తీగలతో నేసిన ఖరీదైన పట్టుచీరలూ ఇక్కడ దొరుకుతాయి. చీర అంచుకు పట్టుపోగులతోపాటు వెండి, బంగారు పోగులను కలిపి నేయటం బెనారస్‌ నేతకారుల ప్రత్యేకత. సాధారణ నూలు దుస్తులు తక్కువ ధరకే దొరుకుతాయి. పట్టుచీరల కొనుగోలు విషయంలో ఆచితూచి బేరమాడాల్సిందే. కాశీ చెంబు (గంగా జలం), కాశీ వీధిలో కొనే రుద్రాక్షమాల, బెనారస్‌ పట్టు చీర.. కాశీ యాత్రను జీవితకాలం గుర్తుండిపోయేలా చేస్తాయి.‘కాశీ క్షేత్రంలో ఒక్క ప్రాణాయామం వల్ల మనిషి పొందే సమగ్ర ఫలసమృద్ధిని, ఏ ఇతర క్షేత్రంలోనూ అష్టాంగ సహిత యోగ మార్గం ద్వారా కూడా పొందలేరు’ అన్న కాశీఖండంలోని వాక్యాలు కాశీ యాత్రకు అందమైన ముగింపు.
np3
3. శివరాత్రి ఎలా జరుపుకోవాలి……………!!
సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.
*ఉపవాసం…..
శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.
*జీవారాధాన…..
అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద ‘జీవారాధానే శివారాధాన’ అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.
* మౌనవ్ర…..
శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర – నమకచమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి.ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.
*అభిషేకం…..
శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.
*జాగరణ……
శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది.
*మంత్ర జపం….
శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.

np
4. పంచారామ క్షేత్రాలు
పంచారామ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఈ క్షేత్రాల పుట్టుక గురించి వేర్వేరు పురాణాల్లో వేర్వేరు గాథలు ఉన్నాయి. శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణంలో ఉన్న కథ ఏమిటంటే– క్షీరసాగర మథనంలో పుట్టిన అమృతం పంపిణీలో జగన్మోహిని రూపంలో మహావిష్ణువు తమకు చేసిన అన్యాయానికి అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురాసురుల నాయకత్వంలో తపస్సు చేసి, శివుణ్ణి మెప్పించి వరాలు పొందారు. వర గర్వంతో వారంతా దేవతలపై తరచు దాడులు సాగిస్తూ, నానా యాతన పెడుతుండటంతో దేవతలంతా కలసి రాక్షసులకు వరాలు ఇచ్చిన శివుణ్ణే శరణు వేడుకున్నారు. దేవతలపై జాలిపడిన శివుడు తన పాశుపతాస్త్రంతో త్రిపురాసుర సంహారం చేశాడు.
*పాశుపతం ధాటికి త్రిపురాసురుల రాజ్యమంతా భస్మీపటలమైనా, వారు పూజిస్తూ వచ్చిన పెద్దశివలింగం మాత్రం చెక్కుచెదరలేదు. శివుడు ఈ లింగాన్ని ఐదు ముక్కలుగా ఛేదించి, వేర్వేరు చోట్ల ప్రతిష్ఠించడానికి దేవతలకు ఇచ్చాడు. దేవతలు వీటిని ప్రతిష్ఠించిన క్షేత్రాలే పంచారామ క్షేత్రాలు. తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం (దక్షారామం), సామర్లకోటలోన కుమారారామం, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో క్షీరారామం, భీమవరంలో సోమారామం, గుంటూరు జిల్లా అమరావతిలో అమరారామం పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి.
*పంచారామ క్షేత్రాల పుట్టుక గురించి స్కాందపురాణంలో మరో కథ ఉంది. అదేమిటంటే– తారకాసురుడనే రాక్షసుడు ఘోరతపస్సు చేసి, శివుడిని మెప్పించి, ఆయన నుంచి ఆత్మలింగాన్ని పొందాడు. బాలకుడి చేత తప్ప ఇంకెవ్వరి చేత తన మరణం ఉండరాదనే వరం పొందాడు. వరగర్వంతో తారకాసురుడు దేవతలను ముప్పుతిప్పలు పెట్టసాగాడు. దేవతలంతా శివపార్వతులను దర్శించుకుని, తారకాసురుణ్ణి సంహరించగల బాలుడిని తమకు అనుగ్రహించమని ప్రార్థించారు. శివపార్వతులకు జన్మించిన కుమారస్వామి దేవతల సైన్యానికి నాయకత్వం వహించి, తారకాసురుణ్ణి సంహరించాడు. తారకాసురుడు నేలకూలడంతో అతడి గొంతులోని ఆత్మలింగం ఐదుముక్కలైంది. దేవతలు వాటిని ఐదుచోట్ల ప్రతిష్ఠించారు.
*పంచారామాల్లోని అమరావతిలో ఉన్న శివలింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ద్రాక్షారామంలో దక్షుడు తపస్సు చేశాడని, ఇక్కడ వెలసిన శివలింగానికి సూర్యభగవానుడు తొలి అభిషేకం చేశాడని పురాణాల కథనం. భీమవరంలోని సోమారామంలో శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది. సామర్లకోటలోని కుమారభీమారామంలో భీమేశ్వర ఆలయాన్ని చాళుక్య భీముడు నిర్మించాడు. పాలకొల్లులోని క్షీరారామ క్షేత్రంలో శివలింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించినట్లు ప్రతీతి.
**విదేశాల్లో శివాలయాలు
నేపాల్‌లోని పశుపతినాథ క్షేత్రమే కాకుండా, భారత్‌కు వెలుపల వివిధ దేశాల్లో శివాలయాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, మయాన్మార్‌ వంటి దేశాల్లో కొన్ని పురాతన శివాలయాలు ఉన్నాయి. అమెరికా, కెనడా, జపాన్, జర్మనీ, ఫిజీదీవులు, ఘనా, గయానా, నైజీరియా, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఆధునికకాలంలో నిర్మించిన శివాలయాలు ఉన్నాయి.
**వివిధ రూపాల్లో శివారాధన
శివుడిని ఎక్కువగా లింగరూపంలోనే భక్తులు పూజిస్తారు. కొన్నిచోట్ల శివుడిని మానుషవిగ్రహ రూపంలోనూ ఆరాధిస్తారు. సింధులోయ నాగరికత కాలం నాటికి శివుడిని పశుపతిరూపంలో ఆరాధించేవారు. శివుడికి యోగీశ్వర, అర్ధనారీశ్వర, నటరాజ, రుద్ర, వీరభద్ర, భైరవ తదితర రూపాలు ఉన్నాయి. లోకరక్షణ కోసం శివుడు అరవై ఐదు లీలారూపాలు దాల్చినట్లు శివపురాణం చెబుతోంది. వీటిలో ఇరవైనాలుగు రూపాలు ప్రధానమైనవి కాగా, మూడు రూపాలు అత్యంత ముఖ్యమైనవని శివపురాణ కథనం. శివుడు సగుణ రూపంలో ఫాలనేత్రంతో, ఒకచేత త్రిశూలం, మరోచేత డమరుకం, శిరసుపై నెలవంక, జటాఝూటంలో గంగ, మెడలోను, చేతులపైన సర్పాలు, శరీరంపై గజచర్మం, విబూది పూతతో దర్శనమిస్తాడు. చెంత జింక, వాహనంగా నంది ఎల్లప్పుడూ శివుడిని అంటిపెట్టుకుని ఉంటాయి. త్రిశూలం త్రిగుణాలకు సంకేతమని ‘లింగపురాణం’ చెబుతోంది. తలపైన నెలవంక మనశ్శాంతికి, గంగ మనోనిశ్చలతకు సంకేతాలు. సర్పాలు జీవాత్మలు. గజచర్మం అహంకార పరిత్యాగానికి సంకేతం. జింక చతుర్వేదాలకు, నంది సత్సాంగత్యానికి, ఫాలభాగాన ఉన్న మూడోకన్ను ధర్మపరిరక్షణకు చిహ్నాలు.శివుడు సృష్టి స్థితి లయకారకుడు. ప్రళయకాలంలో జగత్తును తనలో లయం చేసుకున్న శివుడు, సృష్టి స్థితులను కొనసాగించడానికి బ్రహ్మ విష్ణువులను నియమించినట్లు పురాణాల కథనం. శివుడిని జ్ఞానప్రదాతగా ప్రస్తుతించింది స్కాందపురాణం. లౌకికభోగాలు పొందడానికి శివలింగమే ఆలంబన అని శివభక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం శివుడే ఆదిగృహస్థుడు. ఆదర్శ దాంపత్యానికి శివపార్వతులే ప్రతీకలు. శివపూజ కోసం అట్టహాసమైన ఏర్పాట్లేవీ అవసరం లేదు.చెంబుడు నీటితో శివలింగాన్ని అభిషేకించి, చిటికెడు విబూది, మారేడు దళం భక్తిగా సమర్పించుకుంటే చాలు, తప్పక శివానుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. తీవ్రమైన అనారోగ్య కారణాల వల్ల కదల్లేని స్థితిలో ఉన్నవారు శివ మానసిక పూజ ద్వారా శివానుగ్రహం పొందగలరని అనుగ్రహిస్తూ ఆదిశంకరాచార్యులు శివ మానసిక పూజా స్తోత్రాన్ని రచించారు. కదల్లేని స్థితిలో ఉన్నవారు ఎలాంటి నియమాలూ పాటించలేకున్నా, ఈ భక్తి శ్రద్ధలతో స్తోత్రాన్ని పఠించినా, మననం చేసుకున్నా శివానుగ్రహం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం.
np2
5. శివరాత్రి నాడు ఉపవాసం ఎందుకు చేయాలి
‘ఓ జగదీశ్వరా! మహా ఫలితాన్నిచ్చే ఈ శివరాత్రి నాడు నేను చేసే నీ పూజలను నిర్విఘ్నంగా జరిగేలా చూడు. ముక్తిని కోరుతూ ఈ రోజు ఉపవాసం చేసి మరుసటి రోజున ఒక్కపొద్దు విడిచి భోజనం చేస్తాను. దయతో నన్నెప్పుడూ రక్షిస్తూ ఉండుమ’ని శివుణ్ని వేడుకొని శివరాత్రి రోజున విధిగా ఉపవాసం చేయాలని శాస్త్ర వచనం.శంకరుడు అంటే అందరికీ శుభాలు కలిగించే వాడని అర్థం. ఈ విశ్వాన్ని నడిపించే పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది ఈ రోజే. పార్వతిని వివాహం చేసుకున్నదీ ఇదే రోజు. క్షీరసాగర మథనంలో పుట్టిన గరళాన్ని విశ్వరక్షణ కోసం తీసుకొని, తన కంఠంలో దాచుకుని శివుడు నీలకంఠుడిగా మారింది కూడా ఈ పర్వదినం నాడే. అందుకే శివర్రాతి రోజు గరళం వల్ల ఆయనకు కలిగే మంట నుంచి ఉపశమనాన్ని కలిగించడం కోసం, శివలింగానికి అభిషేకాలు నిర్వహించి, ఉపవాస దీక్ష చేయాలని పురాణాలు చెబుతున్నాయి. ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగానూ ఉపవాస నియమం అందరికీ మేలు చేస్తుంది. మాఘమాసం వరకూ మందగించి ఉండే జీర్ణవ్యవస్థ, వేసవి రాకతో తీవ్రం అవుతుంది. శీతకాలం, వేసవి సంధికాలంలో వచ్చే శివరాత్రి నాడు ఉపవాసం చేయడంతో శరీరం వాతావరణంలో జరిగే మార్పులకు తగినట్లుగా సిద్ధమవుతుందని చెబుతారు.