DailyDose

అంతర్జాతీయ ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ – TNI – తాజా వార్తలు

అంతర్జాతీయ ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ – TNI – తాజా వార్తలు

అంతర్జాతీయ ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ – TNI – తాజా వార్తలు
* కరోనా నుంచి దేశాలన్నీ దాదాపు బయటపడుతున్న వేళ అంతర్జాతీయ ప్రయాణికులకు భారత ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలను నడపనున్నట్టు ప్రకటించింది.కరోనా వైరస్ కారణంగా రెండేళ్ల క్రితం ఆగిపోయిన అంతర్జాతీయ విమాన సేవలు మళ్లీ మొదలుకానున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా టీకాలు తీసుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని చివరిసారి గత నెల 28న పొడిగించారు. కొవిడ్ నేపథ్యంలో 23 మార్చి 2020న అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ‘వందేభారత్’ మిషన్‌లో భాగంగా ప్రత్యేక విమానాలకు మే 2020 నుంచి అనుమతిచ్చారు. ఇందులో భాగంగా యూఎస్, యూకే, యూఏఈ, కెన్యా, భుటాన్, ఫ్రాన్స్ తదితర 32 దేశాల నుంచి భారతీయులను తరలించేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కవరేజ్ పెరగడంతో అంతర్జాతీయ విమాన ప్రయాణాలను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని డీజీసీఏ తెలిపింది. ఈ నెల 27 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని తెలిపింది.నిజానికి గతేడాది డిసెంబరు 15 నుం అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని డీజీసీఏ నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన కూడా చేసింది. అయితే, ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ వెలుగు చూసి దేశాలను చుట్టేయడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నిషేధాన్ని మరోమారు పొడిగించింది.

* బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఆ పార్టీ సీనియర్ నేత జై ప్రకాష్ మజుందార్ మంగళవారంనాడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఎంసీ అధినేత్రిపశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్న కార్యక్రమంలో ముజుందార్ ఆ పార్టీ తీర్ధం తీసుకున్నారు. పార్టీలో చేరిన కొద్దిసేపటికే ఆయనకు టీఎంసీ రాష్ట్ర కమిటీలో స్థానం కలిపించారు. టీఎంసీ ఉపాధ్యక్షులలో ఒకరిగా ఆయనను ఆ పార్టీ నియమించింది.

* వ‌న‌ప‌ర్తి జిల్లా కేంద్రంలో నూత‌నంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో టీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్క‌రించారు. కార్యాల‌యం ప్రారంభోత్స‌వం అనంత‌రం జిల్లా పార్టీ అధ్య‌క్షుడు గ‌ట్టు యాద‌వ్‌ను కేసీఆర్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములుతో పాటు ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

* హైదరాబాద్ నగరంలోని లక్డీకాపూల్‌లో గల స్కూల్ ఎడ్యుకేషన్ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. డీసీఎస్ భవన్‌ను ముట్టడించేందుకు స్పౌజ్ కోటా ఉపాధ్యాయులు యత్నించారు. జీఓ 317తో భర్త ఒక చోట, భార్య ఒక చోట ఎలా పని చేస్తారని స్పౌజ్ టీచర్స్ ప్రశ్నించారు. 20 జిల్లాల్లో భార్యాభర్తలను ఒక చోట చేర్చారని… 13 జిల్లాలను మాత్రమే ఎందుకు బ్లాక్‌లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 13 జిల్లాల పరిధిలో స్పౌజ్ బదిలీలు చేపట్టాలని స్పౌజ్ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.

* గుంటూరు నగరంలో సైక్లింగ్ జోన్ ఏరియా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి లక్ష్మీపురం కొరిటిపాడు, విద్యానగర్, గుజ్జనగుండ్ల వరకూ సైక్లింగ్ జోన్ ఏర్పాటు కానుంది. మున్సిపల్ అధికారులతో కలసి సైక్లింగ్ జోన్ ఏరియాను మేయర్ మనోహర్ పరిశీలించారు. రహదారిపై ఉన్న ఆక్రమణలు తొలగించాలని సంబంధిత అధికారాలకు మేయర్ సూచించారు.

*గవర్నర్ వ్యవస్థపై సీపీఐ నేత నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనుభవంతో కూడిన వ్యక్తులు గవర్నర్‌గా వస్తే ఆ పదవికి గౌరవం చేకూరాలన్నారు. భారతదేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగాన్ని శాసనసభ సమావేశంలో బహిష్కరించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ముఖ్యమంత్రికి హెడ్‌క్లర్క్‌గా మారారని విమర్శలు గుప్పించారు. ఎలక్షన్ కమిషన్ విషయంలో చర్యలు తీసుకునే అధికారం పార్లమెంట్‌కు తప్ప ఎవరికీ లేదని అన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న బాల్య చాపల్య చర్యలను అనుభవంతో కూడిన గవర్నర్ సరి చేయాల్సింది పోయి వంతపాడారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు

*అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీస్ అధికారులు సీపీ సీవీ ఆనంద్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. 1200 మంది మహిళా సిబ్బందికి ఈరోజు సాయంత్రం జీవీకే మాల్‌లో పవర్ పవన్ కళ్యాణ్ నటించిన ‘‘భీమ్లా నాయక్’’ సినిమాను ఫ్రీ గా చూసే అవకాశాన్ని సీపీ ఆనంద్ కల్పించారు. దీనిపై మహిళా పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

*సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీలో మున్సిపల్ మహిళా కార్మికులు రిలే నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మహిళా కార్మికురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ.. మాట తప్పనంటూ నమ్మించిన జగన్ మహిళా వర్కర్లను మోసం చేశాడన్నారు. మిశ్రా నివేదికను ఆలస్యంగా బయట పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో నివేదిక ఎందుకు చూపలేదని ధనలక్ష్మి నిలదీశారు. మున్సిపల్ కార్మికులకు 20వేల వేతనం ఇవ్వాల్సి ఉందన్నారు. 15వేలు మాత్రమే ఇస్తూ… వారి హక్కులను కాల రాస్తున్నారన్నారు. సమాన పనికి.. సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు సమస్యలు పరిష్కరించి జగన్ మాట నిబెట్టుకోవాలన్నారు.

*సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీలో మున్సిపల్ మహిళా కార్మికులు రిలే నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మహిళా కార్మికురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ.. మాట తప్పనంటూ నమ్మించిన జగన్ మహిళా వర్కర్లను మోసం చేశాడన్నారు. మిశ్రా నివేదికను ఆలస్యంగా బయట పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో నివేదిక ఎందుకు చూపలేదని ధనలక్ష్మి నిలదీశారు. మున్సిపల్ కార్మికులకు 20వేల వేతనం ఇవ్వాల్సి ఉందన్నారు. 15వేలు మాత్రమే ఇస్తూ… వారి హక్కులను కాల రాస్తున్నారన్నారు. సమాన పనికి.. సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు సమస్యలు పరిష్కరించి జగన్ మాట నిబెట్టుకోవాలన్నారు.

*బడ్జెట్‌లో ఎంఎంటీఎస్‌ రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మొండిచేయి చూపించింది. మెట్రోకు రూ.2,377.35 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఎంఎంటీఎస్‌కు రూపాయి కూడా మంజూరు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ వాటా కింద రూ.631 కోట్లను చెల్లించాల్సి ఉందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. మూడేళ్లుగా బడ్జెట్‌లో ఎంఎంటీఎస్‌ ప్రస్తావనే ఉండడం లేదు.

*తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలు, దివంగత నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. కమిటీలో నారా లోకేశ్‌, కె.అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్‌బాబు, నిమ్మల రామానాయుడు, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్‌రెడ్డి, బీద రవిచంద్రయాదవ్‌, అనగాని సత్యప్రసాద్‌, చింతకాయల విజయ్‌లను టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో నియమించినట్లు పేర్కొన్నారు

*‘ఈ ముఖ్యమంత్రి మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం.. ఆడబిడ్డలపై రోజుకో అఘాయిత్యం జరిగేలా రాష్ట్రాన్ని తయారు చేసిందుకా? మహిళల అక్రమ రవాణాలో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచినందుకా?’ అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిలదీశారు. సోమవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌రెడ్డికి నిజంగా ధైర్యముంటే, ఆయన నిజంగా మహిళల్ని గౌరవించే వాడైతే పోలీసు పహరాలు, పరదాలు లేకుండా అమరావతి మహిళల మధ్య నుంచి అసెంబ్లీకి వెళ్లాలని సవాల్‌ చేశారు. ముఖ్యమంత్రికి మహిళా దినోత్సవం నిర్వహించే హక్కు లేదన్నారు. సొంత చెల్లికి, తల్లికి న్యాయం చేసిన తర్వాత జగన్‌రెడ్డి జగన్‌రెడ్డి రాష్ట్రంలోని మహిళల గురించి మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. సమావేశంలో మహిళా నేతలు ఆచంట సునీత, అన్నాబత్తుని జయలక్ష్మి పాల్గొన్నారు.

*వనరుల శాఖ 2017లో చేపట్టిన నీరు-చెట్టు పనులపై శాంపిల్‌ సర్వేలను చేపట్టి నాణ్యత ప్రమాణాలను నిర్దేశించాలని జిల్లా కలెక్టర్లకు జల వనరుల శాఖ ఆదేశించింది. కోర్టు ఆదేశించినా నీరు-చెట్టు కింద చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదంటూ జల వనరుల శాఖను తప్పుబడుతూ రైతులు భారీగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రైతులకు బిల్లులను చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశించింది. అయినా.. బిల్లులు చెల్లించలేదు. దీంతో రైతులు కోర్టు ధిక్కార నోటీసు ఇచ్చారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఈ నెల 11న జల వనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు మొదలు ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లతో జల వనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నీరు-చెట్టు పనులపై గ్రామీణ నీటి సరఫరా విభాగంతో సహా.. ఇతర ఇంజనీరింగ్‌ విభాగాల ఇంజనీరింగ్‌ అధికారులతో ఐదు శాతం వరకు నమూనా సర్వే నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. న్యాయస్థానంలో వ్యాజ్యం ఉన్న తరుణంలో,ఇలా జల వనరులేతర శాఖలతో నమూనా సర్వేను చేపట్టి నాణ్యతను పరిశీలించే పనిలో నిమగ్నం కావడం చర్చనీయాంశమైంది.

*నైరుతి బంగాళాఖాతంలో గల అల్పపీడనం సోమవారం పూర్తిగా బలహీనపడింది. ఉత్తర తమిళనాడు నుంచి గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు ఉపరితలద్రోణి విస్తరించింది. దీని ప్రభావం కోస్తా, రాయలసీమలపై ఉండదని, వచ్చే 24 గంటల్లో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి

*రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ ఏపీ) నూతన కార్యవర్గం ఎన్నికైంది. సంఘం 75వ వార్షికోత్సవ కౌన్సిల్‌ సమావేశాలు విజయవాడ ఐఎం హాల్‌లో ఈనెల 5, 6వ తేదీల్లో జరిగాయి. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎల్‌.సాయి శ్రీనివా్‌స(పశ్చిమగోదావరి), ప్రధాన కార్యదర్శిగా హెచ్‌. తిమ్మన్న (కర్నూలు), ఆర్థిక కార్యదర్శిగా ఎంవీఎ్‌సఎన్‌ ప్రసాద్‌ (కృష్ణా), అసోసియేట్‌ అధ్యక్షులుగా వై.సుబ్రహ్మణ్యం రాజు (కడప), గంటా మోహన్‌ (చిత్తూరు), ఎం.గౌరి ప్రసాద్‌ (కృష్ణా), పీవీఎస్‌ రామారావు (తూర్పుగోదావరి), కె.ఎర్రయ్య (ప్రకాశం), ఎస్‌.చంద్రశేఖర్‌ (కర్నూల్‌), జి.శ్రీనివాస్‌ (పశ్చిమ గోదావరి), ఎస్‌.రామచంద్రయ్య (గుంటూరు), అదనపు ప్రధాన కార్యదర్శులుగా పి.ప్రభాకరరావు (శ్రీకాకుళం), ఎం.శామ్యూల్‌ (పశ్చిమ గోదావరి), సి.నాగరాజు (కర్నూల్‌), కె.చంద్రశేఖర్‌ (అనంతపురం), వీసీ జాకోబ్‌ (తూర్పు గోదావరి), కె.బాలగంగిరెడ్డి (కడప), ఎల్‌వీ రామిరెడ్డి (గుంటూరు), జి.నాగేశ్వరరావు (చిత్తూరు)తోపాటు 16 మంది ఉపాధ్యక్షులు, 16 మంది కార్యదర్శులు, 8 మంది ఆర్ధిక కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా సి.రమేశ్‌, పరిశీలకుడిగా ఏఐఎ్‌సటఎఫ్‌ నాయకుడు ఎ.నీలకంఠయ్య వ్యవహరించారు.

*ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్‌ పరీక్షలకు హాల్‌టికెట్లు సిద్ధమయ్యాయి. ప్రాక్టికల్స్‌కు హాజరయ్యే విద్యార్థులు.. ఫస్టియర్‌ హాల్‌ టికెట్‌ నంబర్‌ కానీ, ఆధార్‌ కార్డు నంబరు కానీ ఎంటర్‌ చేసి… బీఐఈఏపీ వెబ్‌సైట్‌నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

*ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్‌ పరీక్షలకు హాల్‌టికెట్లు సిద్ధమయ్యాయి. ప్రాక్టికల్స్‌కు హాజరయ్యే విద్యార్థులు.. ఫస్టియర్‌ హాల్‌ టికెట్‌ నంబర్‌ కానీ, ఆధార్‌ కార్డు నంబరు కానీ ఎంటర్‌ చేసి… బీఐఈఏపీ వెబ్‌సైట్‌నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.