Movies

ఎట్టకేలకు నటి పూనమ్ బజ్వాకు ఓ సినీ అవకాశం

ఎట్టకేలకు నటి పూనమ్ బజ్వాకు ఓ సినీ అవకాశం

నటి పూనమ్‌ బజ్వా గతంలో ఓ కేసులో చిక్కుకుని పలు కష్టాలను ఎదుర్కొంది. అప్పటి నుంచి ఆమెకు సినీ అవకాశాలు మృగ్యమయ్యాయి. ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ భాషల్లో ఒక్క ఛాన్స్‌ కూడా ఆమెకు రాలేదు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా ఎక్స్‌పోజ్‌ చేస్తూ దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ కాలం వెళ్ళదీస్తోంది. ఇప్పుడా ఫొటోలు ఓ నిర్మాత కంటపడటంతో ఎట్టకేలకు ఆమెకు ఓ అవకాశం వరించింది. నట్టి హీరోగా నటించే చిత్రానికి ‘గురుమూర్తి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ జీవితంలోనూ, కుటుంబంలో హఠాత్తుగా ఏర్పడే కష్టాలను ఏ విధంగా ఎదుర్కొన్నారు? ఆ సమస్యలను ఎలా అధిగమించారన్న కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.