Business

జోయాలుక్కాస్‌ ఆఫర్‌ పొడిగింపు – TNI వాణిజ్య

జోయాలుక్కాస్‌ ఆఫర్‌ పొడిగింపు – TNI వాణిజ్య

* ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్‌ ‘అతుల్యమైన ఫ్లాట్‌ 50%’ ఆఫర్‌ను మార్చి 27 వరకు పొడిగించింది. కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభించడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని జోయాలుక్కాస్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జాయ్‌ అలూక్కాస్‌ చెప్పారు.అతుల్యమైన ఫ్లాట్‌ 50%తో మజూరీ ఛార్జీల విషయంలో మార్కెట్‌లో అత్యంత పోటీ ధరల్ని తీసుకొచ్చామన్నారు. పరిమిత కాల ఆఫర్‌ను అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ ఆఫర్‌కు అదనంగా కొనుగోలు చేసిన అన్ని ఆభరణాలపై ఏడాది ఉచిత బీమా, జీవిత కాల ఉచిత నిర్వహణ, పసిడి మారి్పడి ఆఫర్లను పొందవచ్చన్నారు.
*బ్రిటానియా సంచలన నిర్ణయం.. 50 శాతం బాధ్యతలు వారికే !
ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్‌ మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచుతోంది. 2024 నాటికి సంస్థలో వీరి వాటాను 50 శాతానికి చేర్చనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం మహిళా ఉద్యోగుల సంఖ్య 38 శాతం ఉందని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అమిత్‌ వెల్లడించారు. గువాహటి ఫ్యాక్టరీలో వీరి సంఖ్య 60 శాతం ఉందని, దీనిని 65కు చేర్చనున్నట్టు తెలిపారు. మహిళా సాధికారత కోసం కంపెనీ ఇప్పటికే స్టార్టప్‌ చాలెంజ్‌ను ప్రారంభించిందన్నారు.
* రష్యా చమురు రేసులో దేశీ సంస్థలు
భారీ డిస్కౌంటుతో లభిస్తున్న రష్యా ముడి చమురును కొనుగోలు చేసేందుకు దేశీ రిఫైనరీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మూడు మిలియన్‌ బ్యారెళ్లు కొనుగోలు చేసిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) బాటలోనే తాజాగా హిందూస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) రెండు మిలియన్‌ బ్యారెళ్లు తీసుకుంది. యూరప్‌కు చెందిన ట్రేడరు విటోల్‌ ద్వారా రష్యన్‌ ఉరల్స్‌ క్రూడాయిల్‌ను హెచ్‌పీసీఎల్‌ కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ (ఎంఆర్‌పీఎల్‌) కూడా అదే తరహాలో ఒక మిలియన్‌ బ్యారెళ్ల క్రూడాయిల్‌ కోసం టెండర్లు ఆహ్వానించింది.
*ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ వీ వైధ్యనాథన్‌ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. చనిపోయిన ఒక ఉద్యోగి కుటుంబానికి తన ఖాతాలోని 5 లక్షల ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్లను బహుమతిగా ఇచ్చారు. ఆ ఉద్యోగి పిల్లల విద్య, ఆర్థిక భద్రత కోసం ఆయన ఈ షేర్లు ఇచ్చినట్టు ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌ తెలిపింది. వైద్యనాథన్‌ గతంలోనూ తన ట్రెయినర్‌, డ్రైవర్‌, ఇంట్లోని పనిమనిషి సొంతింటి కోసం ఇలానే తన ఖాతాలోని ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్లను బహుమతిగా ఇచ్చారు.
*దేశంలోని డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌లైన పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే, అమెజాన్‌ పేకు పోటీగా మరో కొత్త యాప్‌ మార్కెట్లోకి రాబోతోంది. దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్‌ కూడా యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ) ఆధారిత చెల్లింపుల సేవల్లోకి ప్రవేశించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.
*డ్రోన్‌ ఆధారిత ఖనిజ అన్వేషణకు ఐఐటీ ఖరగ్‌పూర్‌తో ఎన్‌ఎండీసీ ఒప్పందం కుదుర్చుకుంది. రాగి, రాక్‌ ఫాస్ఫేట్‌, సున్నం, ఇనుప ఖనిజం, టంగ్‌స్టన్‌ వంటి అనేక లోహాల ఖనిజాలను అన్వేషించి ఎన్‌ఎండీసీ వెలికి తీస్తోంది. డ్రోన్‌ల ద్వారా ఖనిజ అన్వేషణకు ఎన్‌ఎండీసీ, ఐఐటీ ఖరగ్‌పూర్‌ కలిసి ప్రత్యేక ఆల్గారిథమ్స్‌, ఇతర సొల్యూషన్లను అభివృద్ధి చేస్తాయి.
*హైదరాబాద్‌కు చెందిన మ్యాగ్నమ్‌ వింగ్స్‌ వాణిజ్యపరంగా వినియోగించడానికి తన తొలి అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికల్‌ (యూఏవీ)ని విడుదల చేసింది. ‘ఎండబ్ల్యూ వైపర్‌’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ యూఏవీని గ్రౌండ్‌ సర్వే, పేలోడ్‌ డెలివరీ, కాపలా, వంటి పనులకు వినియోగించవచ్చని మ్యాగ్నమ్‌ వింగ్స్‌ సీఈఓ అభిరామ్‌ చావా తెలిపారు. 5 నుంచి 60 కేజీల బరువు మోసుకుపోయే సామర్థ్యం ఈ యూఏవీకి ఉంది. గంటకు 30 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో 100 నుంచి 2,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుందని వివరించారు.
*విమానాల తయారీ కంపెనీ బోయింగ్‌కు హైదరాబాద్‌కు చెందిన అజాద్‌ ఇంజనీరింగ్‌ విమాన విడి భాగాలను సరఫరా చేసింది. బోయింగ్‌కు విమాన విడి భాగాలను సరఫరా చేయడానికి అజాద్‌ ఇంజనీరింగ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మొదటి విడత కన్‌సైన్‌మెంట్‌ను బోయింగ్‌కు అందించినట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ చోప్డార్‌ తెలిపారు. కఠినమైన ఆడిట్‌లు, పరీక్షల అనంతరం బోయింగ్‌ నుంచి విడి భాగాల సరఫరాకు ఆర్డర్‌ సంపాదించామని.. కంపెనీకి ఇది ఒక మైలురాయి అని అన్నారు. నిర్ణీత కాలంలో మొదటి విడత విడి భాగాలు సరఫరా చేయడం అజాద్‌ ఇంజనీరింగ్‌ సమర్థతను ప్రతిబింబిస్తోందని వివరించారు.
*ఉబెర్ ఇంటర్‌సిటీ ట్రిప్ బుకింగ్‌లతో ముంబై అగ్రస్థానంలో ఉందని రైడ్ హెయిలింగ్ దిగ్గజం ఉబెర్ గురువారం వెల్లడించింది. ఉబెర్ ఇంటర్‌సిటీ ట్రిప్‌లు 2021 లో… మూడు వేలకంటే ఎక్కువ రూట్‌లను కవర్ చేసినట్లు తెలిపింది. ఉబెర్ డేటా ప్రకారం… ప్రతి 5 ఇంటర్‌సిటీ రైడర్‌లలో ఒకరు… మొదటి సారి ప్లాట్‌ఫారమ్ యూజర్. వన్-వే ట్రిప్పులను ఎంచుకునే సౌలభ్యం, రోడ్డు ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్, డోర్-స్టెప్ పిక్-అప్‌లు, 24X7 భద్రతా మద్దతు, పారదర్శక ఛార్జీలు… ఉబెర్ ఇంటర్‌సిటీకి పెరుగుతున్న డిమాండ్ వెనుక ప్రధాన కారణాలుగా ఉన్నాయని సంస్థ వివరించింది.
*కొవిడ్‌ చికిత్సకు నోటి ద్వారా తీసుకునే ఫైజర్‌ ఔషధం ‘నిర్మట్రెల్‌విర్‌’ జెనరిక్‌ను తయారు చేయడానికి మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌ (ఎంపీపీ)తో అరబిందో ఫార్మా సబ్‌-లైసెన్స్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు అనుగుణంగా నిర్మట్రెల్‌విర్‌ ఔషధాన్ని తయారు చేసి భారత్‌తో సహా 95 దేశాలకు సరఫరా చేస్తుంది.
*రష్యన్ క్రూడ్‌ను భారీ తగ్గింపు ధరతో ఐఓసీ(ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) కొనుగోలు చేసింది. ఐఓసి… రష్యా ప్రస్తుత అంతర్జాతీయ ధరలకు ‘తగ్గింపు’తో ఆఫర్ చేసిన 3 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 24 న ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత, పుతిన్‌ను ఒంటరి చేయడం కోసం… అంతర్జాతీయంగా తలెత్తిన ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో… ఓ వ్యాపారి ద్వారా కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. ఐఓసీ యురల్స్ క్రూడ్‌ను మే డెలివరీ కోసం బ్యారెల్‌కు $20-25 తగ్గింపుతో బ్రెంట్‌కు కొనుగోలు చేసిందని ఆ వర్గాలు వెల్లడించాయి. అమెరికా సహా ఇతర పశ్చిమ దేశాలు… మాస్కోపై ఆంక్షలు విధించడంతో, రష్యా… చమురు, ఇతర వస్తువులను భారత్ సహా ఇతర పెద్ద దిగుమతిదారులకు తగ్గింపు ధరలకు అందించడం ప్రారంభించిన విషయం తెలిసిందే.