Movies

బాలీవుడ్‌లో బిజీ బిజీ

Auto Draft

సమంత ఇప్పుడు ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నారు. ‘యశోద’, ‘శాకుంతలమ్‌’ సెట్స్‌పై ఉన్నాయి. త్వరలోనే విజయ్‌ దేవరకొండతో జట్టు కట్టబోతున్నట్టు టాలీవుడ్‌ టాక్‌. మరోవైపు ఓ బాలీవుడ్‌ సినిమా కూడా ఒప్పుకొన్నారు. రాజ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్‌ ధావన్‌ కఽథానాయకుడు. ఇటీవల సమంత ముంబై వెళ్లారు. అక్కడ కథకు సంబంఽధించిన చర్చలు జరిగాయి. కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. జులై నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు అమేజాన్‌, నెట్‌ ఫ్లిక్స్‌ నుంచి సమంతకు కొన్ని ఓటీటీ ఆఫర్లు వస్తున్నట్టు టాక్‌. సినిమాల పనిమీద తరచూ  ముంబై వెళ్లి రావడం కోసమే సమంత ఇటీవలే ముంబైలో ఓ ఫ్లాటు తీసుకొన్నారు. అతి త్వరలోనే మరికొన్ని బాలీవుడ్‌ ప్రాజెక్టులపై సమంత సంతకాలు పెట్టే అవకాశాలున్నాయి