Movies

ఎంతో అదృష్టం

ఎంతో అదృష్టం

మహారాష్ట్ర మగువ రిద్దికుమార్ ‘లవర్’తో తెలుగువారి ముందుకు వచ్చింది. తాజాగా ‘రాధేశ్యామ్’లో కీలకపాత్ర పోషించింది. “ధేశ్యామ్’లో ఆర్చరీ క్రీడాకారిణిగా నటించేందుకు కొన్నాళ్ళు ఆర్చరీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. కొంచెం కష్టంగానే అని పించింది కాని, ప్రభాస్ గారితో కలిసి పనిచేసే అవకాశాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. వెబ్ సిరీస్, కొన్ని సినిమాలు చేస్తున్నాను. డిటెక్టివ్ క్యారెక్టర్లు, ఫన్ క్యారెక్టర్లు అంటే చాలా ఇష్టం. తెలుగులో చాలామంది హీరోలతో కలిసి నటించాలని వుంది “అంటూ గడగడా. పాఠం అప్పగించేసింది రిద్దికుమార్.