Politics

ఎమ్మెల్యే పిన్నెల్లికి మంత్రి వర్గంలో స్థానం కల్పించాలి

ఎమ్మెల్యే పిన్నెల్లికి మంత్రి వర్గంలో స్థానం కల్పించాలి

వైఎస్. జగన్ ను కోరుతున్న మాచర్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధులు

ముకుమ్మడి రాజీనామాకు రంగం సిద్ధం

ముఖ్యమంత్రి జగన్ మొహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి ఎమ్మెల్యే పదవిని సైతం త్యాగం చేసి జగన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారాని మాచర్ల నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెలుపుతున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నూతన జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే అయినా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి కి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని వారు జగన్ ను కోరుతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మాచర్ల చరిత్రను తిరగరసిన పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వకపోవటం ఏమిటీ అని కార్యకర్తలు పార్టీ రాష్ట్ర అధిష్టానన్ని ప్రశ్నిస్తున్నారు. పార్టీకి సేవచేసే వారికీ పదవులు దక్కవా అంటూ పార్టీ కార్యకర్తలు నిరాశవ్యక్తంచేస్తున్నారు. విశ్వాసనీయతకు స్థానం లేదా అంటూ కార్యకర్తలు నిరాశను వ్యక్తం చేస్తూ పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.