Devotional

చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవం – TNI ఆధ్యాత్మికం

చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవం  – TNI ఆధ్యాత్మికం

1. తెలంగాణ తిరుమలగా పేరొందిన చిలుకూరు బాలాజీ ఆలయానికి 500 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. హైదరాబాద్ నగరానికి చేరువలో ఉస్మాన్ సాగర్ తీరాన చిలుకూరు బాలాజీ దేవాలయం సుప్రసిద్ధం. ఇక్కడి స్వామివారిని వీసాల బాలాజీ అని కూడా పిలుస్తుంటారు. చైత్రమాసంలో చిలుకూరు బాలాజీకి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.ప్రత్యేక దర్శనాలు, అర్చన టిక్కెట్లు, హుండీల గొడవలు లేని ఆలయంగా చిలుకూరు బాలాజీ క్షేత్రం వినుతి కెక్కింది. దేవుని వద్ద అంతా సమానమే. ఆలయంలో భక్తుడు చూడవలసింది దైవాన్ని మాత్రమే. భగవంతునికి భక్తునికి మధ్య డబ్బు వ్యవహారం అవసరం లేదనే పద్ధతిని చిలుకూరు ఆలయం పాటిస్తోంది. ప్రజాభిప్రాయాన్ని, అర్చకుల అభిమతాన్ని గౌరవించి రాష్ట్రప్రభుత్వం స్వయంప్రతిపత్తినిచ్చింది. చిలుకూరు స్వామిని వీసాల బాలాజీ అని కూడా పిలుస్తారు. అందువల్ల యువతకు ఆరాధ్య క్షేత్రమయ్యింది. మొదటిసారి ఈ దర్శించుకున్నప్పుడు. 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటారు. కోర్కె తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు.

2. వేములవాడ రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. శ్రీరామనవమి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సోమవారం రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. సోమవారం సందర్భంగా ఆలయ అధికారులు లఘుదర్శనం అమలు చేశారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో రద్దీగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు. బోనాల ఊరేగింపు సందర్భంగా హిజ్రాలు, శివపార్వతులు నృత్యాలతో అలరించారు. ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

3. హంస వాహనంపై శ్రీరాముని చిద్విలాసం
ధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండోరోజు సోమవారం ఉదయం వేణు గోపాలుని అలంకారంలో శ్రీరాముడు దర్శనమిచ్చాడు. మాడవీధులలో ఉదయం గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. కోలాటాలు, చెక్కభజనలు, భజన బృందాలు, మంగళవాయిద్యాలు నడుమ కోదండరాముడిని కీర్తిస్తూ గ్రామోత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని కర్పూర హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. సాయంత్రం స్వామి వారికి ఊంజల సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి హంసవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు.

4. వేములవాడ రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. శ్రీరామనవమి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సోమవారం రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. సోమవారం సందర్భంగా ఆలయ అధికారులు లఘుదర్శనం అమలు చేశారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో రద్దీగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు. బోనాల ఊరేగింపు సందర్భంగా హిజ్రాలు, శివపార్వతులు నృత్యాలతో అలరించారు. ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

5. ఈ ఏడాది హజ్‌ యాత్రకు సంబంధించి స్వల్ప మార్పులు జరిగాయని మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఏకే ఖాన్‌ తెలిపారు. సౌదీ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన మేరకు 65 ఏళ్లు పైబడిన వారిని యాత్రకు అనుమతించడం లేదన్నారు. ఈ నెల 30 నాటికి 65 ఏళ్లలోపు వయసు ఉన్న వారినే అనుమతిస్తామని వెల్లడించారు. హజ్‌ యాత్రకు వెళ్లాలనుకునే వారు ఏప్రిల్‌ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ www.Hajcommittee.gov.inలో లేదా 040-23298793 నంబరుకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు.

6. రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. శ్రీరామనవమి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సోమవారం రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు కోడెమొక్కు చెల్లించుకున్నారు. సోమవారం సందర్భంగా ఆలయ అధికారులు లఘుదర్శనం అమలు చేశారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో రద్దీగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు.

7. యాదాద్రిలో 20 నుంచి శివాలయ మహాకుంభాభిషేకం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఈ నెల 20 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో ఎన్‌ గీత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శివాలయ ప్రతిష్ఠ, ఉపదేవీ, దేవతల ప్రతిష్ఠ, పంచకుండాత్మక పాంచాహ్నిక దీక్షా విధానంతో సుమారు 54 మంది ఆచార్య బ్రహ్మ వేద పారాయణ, యజ్ఞాచార్య, రుత్విక్‌, పరిచారక బృందంతో మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. 25న ఉదయం 10:25 గంటలకు ధనిష్ట నక్షత్ర యుక్త మిథునలగ్న పుష్కరాంశ సుముహూర్తాన తొగుట పీఠాధీశ్వరుడు మాధవానంద సరస్వతీస్వామి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తామని ఈవో వెల్లడించారు.

8. తిరుమల శ్రీవారిని దర్శించకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల దగ్గర తోపులాట జరిగింది. దీంతో టీటీడీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆఫ్‌లైన్ విధానంలో సర్వదర్శన టోకేన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. టోకేన్లు లేకూండానే భక్తులను తిరుమలకు అనుమతిస్తోంది. రెండు సంవత్సరాల తరువాత వైకుంఠ క్యూ కాంప్లేక్స్‌లోని కంపార్టుమెంట్లలోకి భక్తులను టీటీడీ అనుమతిస్తోంది. భక్తులను కంపార్టుమెంట్లలోకి అనుమతించడాన్ని టీటీడీ నిలిపివేసింది. టోకేన్ పోందిన భక్తులను ముందుగా కంపార్టుమెంట్లలోకి అనుమతిస్తున్న టీటీడీ… రెండు గంటల తరువాత టోకేన్ లేని భక్తులను కంపార్టుమెంట్లలోకి అనుమతించనుంది.

9. 13 నుంచే ప్రాణహిత పుష్కరాలు
ప్రాణహిత జన్మ స్థలి అయిన తుమ్మిడిహెట్టి ప్రాణహిత నదీ తీరంలో బుధవారం నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు ఊదాసీనంగా వ్యవహరిం చిన అధికారులు ఒక్కసారి పనులు ప్రారంభించారు. మహిళాభక్తుల సౌక ర్యార్థం దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు, పిండప్రదానం, కేశఖండన కోసం తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా మరుగుదొడ్లు నిర్మించారు. గత పుష్కరాల మాదిరిగా ఈ పుష్కరాల్లో షవర్లు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు నిరాశ చెందుతున్నారు. ఘాట్ల మరమ్మతులు చేయించి స్నానాలు ఆచరించేలా మరమ్మ తులు చేపట్టారు. అయినప్పటికీ దివ్యాంగులు, వయో వృద్ధులు నదిలోకివెళ్లి స్నానంచేయాలంటే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. షవర్లు ఏర్పాటు చేసినట్లయితే సౌకర్యవంతంగా ఉండేదని భక్తులు పేర్కొంటున్నారు. ఈనెల 13నుంచి 24వరకు నిర్వహించనున్న పుష్క రాల్లో 12రోజుల పాటు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్న దానం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

10. ఇళ్లకే రామయ్య కల్యాణ తలంబ్రాలు.. భారీ స్పందన
భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకే చేర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సర్వీసు విభాగం చేసిన ప్రయత్నానికి భారీస్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 88,704 మంది భక్తులు సీతారాముల కల్యాణ తలంబ్రాలను బుక్‌ చేసుకున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తొలి బుకింగ్‌ నమోదు చేసుకున్నారు. ఈ బుకింగ్‌ రూపంలో ఆర్టీసీకి మంచి ఆదాయమే లభించింది.బుక్‌ చేసుకున్నవారు రూ.80 చెల్లించా లి. ఈ రూపేణా రూ.70,96,320 ఆదాయం సమకూరింది. ఇందులో దేవాలయవాటా కొంత ఉం టుంది. ఆదివారమే స్వామి అమ్మవార్ల కల్యాణం జరిగినందున, మంగళవారంనాటికి తలంబ్రాలతో కూడిన పొట్లాలు సంబంధిత జిల్లాలకు చేరతాయి. బుధవారం నుంచి భక్తులకు అందజేయనున్నారు. ‘సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలు బుక్‌ చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ రీజియన్‌ నుంచి అత్యధికంగా 14,735 బుకింగ్స్‌ వచ్చాయి’ అని అధికారులు చెప్పారు.

11. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో 5 రోజుల పాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఆదివారం వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతి ఇచ్చింది. అలిపిరి నుంచి దర్శన టోకెన్లు లేకపోయినా తిరుమలకు అనుమతి ఇచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ కంపార్ట్‌మెంట్లలోకి రెండేళ్ల తర్వాత భక్తులను టీటీడీ అనుమతించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

12. ఇళ్లకే రామయ్య కల్యాణ తలంబ్రాలు.. భారీ స్పందన
భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకే చేర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సర్వీసు విభాగం చేసిన ప్రయత్నానికి భారీస్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 88,704 మంది భక్తులు సీతారాముల కల్యాణ తలంబ్రాలను బుక్‌ చేసుకున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తొలి బుకింగ్‌ నమోదు చేసుకున్నారు. ఈ బుకింగ్‌ రూపంలో ఆర్టీసీకి మంచి ఆదాయమే లభించింది.బుక్‌ చేసుకున్నవారు రూ.80 చెల్లించా లి. ఈ రూపేణా రూ.70,96,320 ఆదాయం సమకూరింది. ఇందులో దేవాలయవాటా కొంత ఉం టుంది. ఆదివారమే స్వామి అమ్మవార్ల కల్యాణం జరిగినందున, మంగళవారంనాటికి తలంబ్రాలతో కూడిన పొట్లాలు సంబంధిత జిల్లాలకు చేరతాయి. బుధవారం నుంచి భక్తులకు అందజేయనున్నారు. ‘సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలు బుక్‌ చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ రీజియన్‌ నుంచి అత్యధికంగా 14,735 బుకింగ్స్‌ వచ్చాయి’ అని అధికారులు చెప్పారు

13. విశాఖ విమానాశ్రయంలో చందనధారుడు ప్రయాణికులకు దర్శనమివ్వనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో అప్పన్న ఆలయ అధికారులు చందన రూపంలో ఉండే శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ సోమవారం తొలి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో చంద్రకళ మాట్లాడుతూ.. విశాఖపట్నం వచ్చే ప్రయాణికులు అప్పన్నను దర్శనం చేసుకునే అవకాశం కల్పించామన్నారు. స్వామి వారి చరిత్ర, డొనేషన్లు ఇచ్చే వారి కోసం వెబ్‌సైట్లు ఏర్పాటు చేశామన్నారు.స్వామి చరిత్ర ఆడియో వినేందుకు క్యూఆర్‌ కోడ్‌ త్వరలోనే సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే విశాఖ రైల్వే స్టేషన్‌లో అప్పన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలో భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్‌లోనూ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, స్థానాచార్యులు రాజ్‌గోపాల్, పురోహితులు కరి సీతారామాచార్యులు, ఏఈవో రమణమూర్తి, శిల్పి రమణ, ఈఈ శ్రీనివాసరావు, పాలకమండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్‌రాజు, దొడ్డి రమణ, సతీష్, పాత్నుడు, చందు, సువ్వాడ శ్రీదేవి, వంకాయల నిర్మల, రామలక్ష్మి పాల్గొన్నారు.

14. భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకే చేర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సర్వీసు విభాగం చేసిన ప్రయత్నానికి భారీస్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 88,704 మంది భక్తులు సీతారాముల కల్యాణ తలంబ్రాలను బుక్‌ చేసుకున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తొలి బుకింగ్‌ నమోదు చేసుకున్నారు. ఈ బుకింగ్‌ రూపంలో ఆర్టీసీకి మంచి ఆదాయమే లభించింది.
బుక్‌ చేసుకున్నవారు రూ.80 చెల్లించాలి. ఈ రూపేణా రూ.70,96,320 ఆదాయం సమకూరింది. ఇందులో దేవాలయవాటా కొంత ఉంటుంది. ఆదివారమే స్వామి అమ్మవార్ల కల్యాణం జరిగినందున, మంగళవారంనాటికి తలంబ్రాలతో కూడిన పొట్లాలు సంబంధిత జిల్లాలకు చేరతాయి. బుధవారం నుంచి భక్తులకు అందజేయనున్నారు. ‘సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలు బుక్‌ చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ రీజియన్‌ నుంచి అత్యధికంగా 14,735 బుకింగ్స్‌ వచ్చాయి’ అని అధికారులు చెప్పారు.

15. యాదాద్రి శ్రీల‌క్ష్మీ నార‌సింహ స్వామి వారిని విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్త‌రాధికారి స్వాత్మా నందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి వారు ద‌ర్శించుకున్నారు. గ‌ర్భ‌గుడిలోకి స్వామి వారికి స్వ‌రూపానందేంద్ర స్వామి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ద‌ర్శ‌నానంత‌రం స్వామి వారికి తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. ఆ త‌ర్వాత ప్ర‌ధానాల‌య నిర్మాణాల‌ను ప‌రిశీలించారు. ఇవాళ మ‌ధ్యాహ్నం ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తి స్వామికి ఆల‌య అర్చ‌కులు, ఈవో గీత పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. ఆల‌య ఉద్ఘాట‌న త‌ర్వాత ద‌ర్శించుకున్న మొట్ట‌మొద‌టి పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి వారు మాత్ర‌మే.