DailyDose

రేపు నూజివీడు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన – TNI తాజా వార్తలు

రేపు నూజివీడు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన – TNI తాజా వార్తలు

* నూజివీడు నియోజకవర్గంంలోని అడవినెక్కలం గ్రామంలో రేపు(బుధవారం) తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో పర్యటిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. తన పుట్టినరోజును పురస్కరించుకొని తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. బుధవారం(రేపు) మధ్యాహ్నం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని అడవినెక్కలం గ్రామంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా.. గ్రామస్థులతో సమావేశమై స్థానికంగా ఉ్నన సమస్యలు తెలుసుకొనున్నారు. అయితే.. రేపు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో కార్యకర్తలు, నాయకులను కలవనున్నట్లు ఆయన తెలిపారు.

*ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఏపీలో హాల్ టికెట్లు విడుద‌ల‌య్యాయి. ప్రభుత్వ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు, విద్యార్థుల నామినల్ రోల్స్ పెట్టామని… వాటిని డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యదర్శి దేవానందరెడ్డి తెలిపారు. హాల్ టికెట్లపై ప్రధానోపాధ్యాయులు సంతకం చేసి విద్యార్థులకు ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల ఫొటోలు సరిగా లేకపోతే సరైన ఫొటోలను అతికించి, సంతకాలు చేసి ఇవ్వాలని తెలిపారు. ఏపీలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 27న ప్రారంభం కానున్నాయి.పదో తరగతి పరీక్షల తేదీలను విడుద‌ల చేశారు.ఏప్రిల్‌ 27 – తెలుగు..ఏప్రిల్‌ 28 – సెకండ్‌ లాంగ్వేజ్‌..ఏప్రిల్‌ 29 – ఇంగ్లీష్‌..మే 2 – గణితం..మే 4 – సైన్స్‌ పేపర్‌-1..మే 5 – సైన్స్‌ పేపర్‌-2..మే 6 – సోషల్ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి.

*రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను పక్కాగా అమలు చేస్తామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హోంమంత్రి తానేటి వనితను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్రైమ్ రేటు తగ్గింపు, సారా నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. నెల్లూరు కోర్టులో చోరీ విషయంలో సాక్ష్యాల ఆధారంగా ముందుకెళ్లామన్నారు. నెల్లూరు కోర్టు వివాదంపై ఎస్పీ ఇప్పటికే క్లియర్ చేశారన్నారు. చోరీ చేసినవారు పలు కేసుల్లో నిందితులని, విచారణలో వాస్తవాలు బయటపడతాయన్నారు. ఎవరి దగ్గరైనా ఆధారాలుంటే ఇవ్వాలని సమన్లు జారీ చేశామని, స్థానికంగా ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టామన్నారు.

*ఈ ఏడాది మే నెలలో ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మహానాడు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై పొలిట్ బ్యూరోలో చర్చించి టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. మహానాడులో భాగంగా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుల నియామకం నిర్ణయాన్ని జాతీయ అధ్యక్షుడు ఖరారు చేయనున్నారు. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏటామహానాడు నిర్వహణ ఆనవాయితీగా వస్తోంది. ఒక ఏడాది ఎన్నికల కారణంరెండు ఏళ్ళు కోవిడ్ కారణంగా మాహానాడు ఆన్ లైన్ కే పరిమితమైంది.

*ఈ నెల 21న సిక్కు గురు తేఘ్ బహదూర్ 400వ జయంతి(ప్రకాశ్ పర్వ్) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఎర్రకోట వేదికగా ఆయన మాట్లాడనున్నారని కేంద్ర సాంసృతిక శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా తేఘ్ బహదూర్ స్మారక నాణెంతోపాటు పోస్టల్ స్టాంపును కూడా ఆయన విడుదల చేయనున్నారని పేర్కొంది. ప్రకాశ్ పర్వ్ సందర్భంగా 400 మంది రాగీస్(సిక్ మ్యూజిషియన్స్) షబాద్ కీర్తన్ ప్రదర్శించనున్నట్టు వెల్లడించింది.

*కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని పీడీపీ అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోమవారంనాడు కలుసుకున్నారు. సోనియాగాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో ఉభయులూ దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. భారతీయ జనతా పార్టీ మరిన్ని పాకిస్థాన్‌లను ఏర్పాటు చేయాలని కోరుకుంటోందని, దేశాన్ని ఇంతవరకూ సురక్షితంగా ఉంచిన పార్టీ కాంగ్రెస్ అని సోనియాతో మెహబూబా ముఫ్తీ అన్నట్టు తెలుస్తోంది.

*లంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీల్లోని పలు విభాగాల్లో మొత్తం 1,445 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నింటిని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు (ట్రిబ్‌) ద్వారా భర్తీ చేయనున్నారు. ఖాళీలు, భర్తీ, ఉద్యోగార్థులకు శిక్షణపై మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు.

*రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు అందించే ట్రాన్స్‌ఫార్మర్ల (డీటీఆర్‌)కే స్మార్ట్‌ మీటర్లు పెట్టి, విద్యుత్తు వినియోగం కచ్చితంగా లెక్కించాలని ఆదేశాలు ఇచ్చాం. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఎక్కడా చెప్పలేదు. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు’’ అని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎ్‌సఈఆర్‌సీ) చైర్మన్‌ టి.శ్రీరంగారావు స్పష్టం చేశారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని ఈఆర్‌సీ ఆదేశాలు ఇచ్చినట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

*బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్న సంజయ్‌ పాదయాత్ర ఐదో రోజైన సోమవారం ఇటిక్యాల మండలం వేముల గ్రామం నుంచి ఉదండాపూర్‌ వరకు 13 కి.మీ మేర సాగింది. ఉదయం వేముల నుంచి యాత్ర ప్రారంభం కాగా.. గ్రామం దాటిన తర్వాత టీఆర్‌ఎస్‌ శ్రేణులు రెండుసార్లు అడ్డు తగిలే ప్రయత్నం చేశాయి. మొదట అడ్డుకున్న చోట టీఆర్‌ఎస్‌ విద్యార్థి నేతలను పోలీసులు చెదరగొట్టగా, బీజేపీ కార్యకర్తలను డీకే అరుణ సముదాయించారు. కిలోమీటరు దూరం వెళ్లాక కొందరు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు యాత్రకు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. దీంతో మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలకు గాయాలయ్యాయి. బీజేపీ నేతలకు చెందిన ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. బీజేపీ నాయకుల ఫ్లెక్సీలకు టీఆర్‌ఎస్‌ వారు నిప్పంటించారు. దీనిపై ఇరు పార్టీల వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులకు మంచి పేరు ఉండేదని, ఆ వ్యవస్థను సీఎం కేసీఆర్‌ నాశనం చేశారని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి సహకరిస్తున్న వారికే ఎస్పీ పోస్టింగులు ఇస్తున్నారని ఆరోపించారు. గాంధీభవన్‌లో సోమవారం ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడారు. ఒకప్పుడు జిల్లా ఎస్పీగా ఐపీఎఎస్‌ అధికారులే ఉండేవారని, ఇప్పుడు ఎస్పీలుగా 20 మంది నాన్‌ ఐపీఎ్‌సలు ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లక్షల రూపాయల లంచం తీసుకుని ఎస్‌ఐ, ఇతర పోస్టింగ్‌లు రికమెండ్‌ చేస్తున్నారన్నారు. అందుకే రామాయంపేట వంటి ఘటనలు జరగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వామన్‌రావు దంపతుల హత్య కేసు, కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు వేధిపులతో కుటుంబం ఆత్మహత్య కేసుల విచారణ ఏమైందో తెలియదన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలొచ్చినా.. రాష్ట్రపతి పాలనలోనే నిర్వహించాలని డిమాండ్‌ చేస్తామని ఉత్తమ్‌ చెప్పారు. కర్ణాటకతో కలిసి కేసీఆర్‌ ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయన్నారు.

*గ్రామవార్డు సచివాలయ కార్యదర్శులందరికీ శాఖాపరమైన శిక్షణ అందించనున్నట్లు ఏపీ పంచాయతీరాజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ (ఏపీఎ్‌సఐఆర్‌డీపీఆర్‌) డైరక్టర్‌ మురళి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్‌ ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ముందుగా ఎడ్యుకేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లకు శిక్షణ అందించేందుకు అసె్‌సమెంట్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు వివరించారు.

*తెలంగాణ రాష్ట్రంలో అధికారపక్షంనుంచి ఎదుర్కొన్న విమర్శలనే పుదుచ్చేరిలో విపక్షాలనుంచి గవర్నర్‌ తమిళిసై ఎదుర్కొంటున్నారు. పుదుచ్చేరి ప్రస్తుత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారని అక్కడి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రానికి రాజకీయాలతో సంబంఽధంలేని వ్యక్తిని లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై అదనపు బాధ్యతగా పుదుచ్చేరికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమెను తొలగించి పూర్తిస్థాయి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తిని నియమించాలని పుదుచ్చేరి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఏవీ సుబ్రహ్మణ్యం డిమాండ్‌ చేశారు. ఎందుకంటే తమిళిసై రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమిళిసై తన బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించడంలేదన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో గవర్నర్లంతా రాజకీయ నేతల్లాగే వ్యవహరిస్తున్నారన్నారు.

*ఏపీ వైద్య విధాన్‌ పరిషత్‌లో విధులు నిర్వహించే వైద్యుల వేతనాలను ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (స్పె షలిస్ట్)లకు రూ. 53,500 వేతనం ఉండగా, ఆ మొత్తాన్ని 85,000 చేస్తున్నట్లు సోమవారం ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా నియమితులయ్యే వైద్యులకు కూడా దీనిని అమలు చేస్తున్నారు. పెంచిన జీతాలను ఏప్రిల్‌ నుంచి అమలులోకి రా నున్నాయి. దీంతో పాటు కొత్తగా విధుల్లోకి వచ్చిన వైద్యుల ప్రొబేషన్‌ కాలాన్ని రెండేళ్లకు తగ్గించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

*తెలుగు అకాడమీ విభజన కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 29వ తేదికి వాయిదా వేసింది. ఈ కేసును సోమవారం జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ ధర్మాసనం విచారణకు చేపట్టింది. తెలుగు అకాడమీతో పాటు విభజన చట్టంలోని షెడ్యూల్‌ 10 సంస్థల విభజనకు మాజీ న్యాయమూర్తితో కమిటీని ఏర్పాటు చేస్తామనిఅందుకు అభిప్రాయం తెలియజేయాలని ఇరు రాష్ట్రాలను గతంలో ధర్మాసనం ఆదేశించింది. అయితేతల్లి మరణించడంతో సెలవుపై వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారమే విధుల్లో చేరారనికనుక అభిప్రాయం తెలుసుకోడానికి మరికొంత సమయం ఇవ్వాలని తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ విజ్ఞప్తి చేశారు.

*గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులందరికీ శాఖాపరమైన శిక్షణ అందించనున్నట్లు ఏపీ పంచాయతీరాజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ (ఏపీఎ్‌సఐఆర్‌డీపీఆర్‌) డైరక్టర్‌ మురళి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 20 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్‌ ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ముందుగా 10,308 ఎడ్యుకేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లకు శిక్షణ అందించేందుకు ఈ నెల 20న ఉదయం 11నుంచి 11.45 గంటలకు, మధ్యాహ్నం 12నుంచి 12.30 గంటల వరకు అసె్‌సమెంట్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు వివరించారు.

*ముందు చూపు లేకుండా ఆరోగ్యశాఖలో చేపట్టిన వైద్యులు, సిబ్బంది బదలీల ప్రక్రియ.. పేదలకు అందించే వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపిందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కరెంటు కోతల కారణంగా ఆస్పత్రుల్లో టార్చ్‌లైట్ల వెలుతురులో పురుళ్లు పోయాల్సిన పరిస్థితి వచ్చిందని, కడప రిమ్స్‌లో కరెంటు కోతలతో ముగ్గురు పసిపిల్లలు మృతి చెందారని ఆదివారం సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు.

*‘దేశంలో బీజేపీ పతనానికి పునాదులు పడడం ప్రారంభమైంది. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అధికారంలో ఉన్న స్థానాలను కోల్పోవడమే దీనికి నిదర్శనం. ఈ ఎన్నికల్లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీ గొప్ప విజయాలేమీ సాధించలేదు. లోగడ కంటే ఇప్పుడు ఓట్లు పెరిగినా సీట్లు మాత్రం తగ్గాయి’’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. విజయవాడ బాలోత్సవ భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ పతనానికి సూచికలు వస్తుండడంతో సంఘ్‌ పరివార్‌ మళ్లీ మతోన్మాదాన్ని పైకి తీస్తోంది. కొద్దిరోజుల క్రితం జరిగిన శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి వేడుకల ఊరేగింపుల్లో సంఘ్‌ కార్యకర్తలు ఆయుధాలతో హల్‌చల్‌ చేశారు.

*కళల కాణాచిగా పేరొందిన తెనాలి గడ్డపై తెలంగాణ నుంచి వచ్చి అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో సాహితీ, సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక 23వ వార్షికోత్సవం, ఉగాది పురస్కార కార్యక్రమాన్ని ఆదివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భరద్వాజకు స్వరలయ జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. భరద్వాజ మాట్లాడుతూ, సన్మానం అందుకోవడం కంటే ఇతరులను సత్కరించడంలోనే ఎక్కువ ఆనందపడతానన్నారు. కవులు, సాహితీ ప్రియులు అందరూ తెనాలి సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆ దిశలో తనవంతు పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ అన్నారు. మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

*తిరుమలలో అన్యమత గుర్తులు కలకలం సృష్టించాయి. వేరే మతానికి చెందిన చిహ్నాలతో ఉన్న ట్యాక్సీలో ఆదివారం కొందరు భక్తులు తిరుమలకు వచ్చారు. స్థానిక జీఎన్సీ కాటేజీల వద్ద ఈ కారు ఉండటాన్ని గమనించిన భక్తుల సమాచారంతో మీడియా ఆ వాహనం వద్దకు చేరుకుంది. ఈ గుర్తులతో తిరుమలకు రాకూడదని తనకు తెలియదని ట్యాక్సీ డ్రైవర్‌ తెలిపారు. సాధారణంగా రాజకీయ పార్టీకి చెందిన జెండాలు, పోస్టర్లు, అన్యమతానికి చెందిన గుర్తులతో కూడిన వాహనాలు తిరుమలకు రావడం నిషేధం. వీటిని అలిపిరి చెక్‌పాయింట్‌లోనే సిబ్బంది గుర్తించి.. తొలగించాలి. అయితే, భద్రతా సిబ్బంది నిఘా వైఫల్యంతోనే అన్యమత గుర్తులున్న కారు తిరుమలకు వచ్చిందని పలువురు భక్తులు ఆగ్రహించారు. ఆ తర్వాత విజిలెన్స్‌ సిబ్బంది కారులోపల, వెలుపల ఉన్న గుర్తులను తొలగించి వాహనాన్ని తిరుమల నుంచి తిరుపతికి పంపేశారు.

*ఆయుష్మాన్‌ భారత్‌ 4వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వారాంతపు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ హైమావతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం రాష్ట్రంలోని అన్ని వెల్‌నెస్‌ సెంటర్లలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలోని 72 ప్రాంతాల్లో హెల్త్‌ మేళాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. 72 ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏయే కార్యక్రమాలు నిర్వహించేదీ జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వివరించారు.

*‘‘మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని రక్షించడానికే నెల్లూరు కోర్టు లో ఆయన కేసుకు సంబంధించిన సాక్ష్యాల చోరీ జరిగింది. దీనిని సాధారణ చోరీగా తీసుకోకుండా న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణించి లోతుగా విచారణ జరపాలి’’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదివారం డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి లేఖ రాశారు. ఈ కేసుపై ఎవరి ప్రభావం లేకుండా చూడటానికి ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని పర్యవేక్షణ అధికారిగా నియమించాలని డీజీపీని కోరారు. భాగస్వాములైన అందరినీ అరెస్టు చేయాలన్నారు.

*మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుఆయన చిన్న కుమారుడుకౌన్సిలర్‌ రాజేశ్‌తోపాటు మరో ఏడుగురిపై శనివారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.మరిడి మహాలక్ష్మి జాతర సందర్భంగా శుక్రవారం రాత్రి నర్సీపట్నం అబీద్‌ సెంటర్‌లోని జీసీసీ పెట్రోల్‌ బంకు సమీపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల స్టేజీ వద్దపోలీసుల విధులకు భంగం కలిగించారనిదుర్భాషలాడారనిఅవమాన పరచారనిబెదిరింపులకు పాల్పడ్డారనినాతవరం ఎస్‌ఐ డి.శంకరం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.\

*మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని రక్షించడానికే నెల్లూరు కోర్టు లో ఆయన కేసుకు సంబంధించిన సాక్ష్యాల చోరీ జరిగింది. దీనిని సాధారణ చోరీగా తీసుకోకుండా న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణించి లోతుగా విచారణ జరపాలిఅని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదివారం డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి లేఖ రాశారు.ఈ కేసుపై ఎవరి ప్రభావం లేకుండా చూడటానికి ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని పర్యవేక్షణ అధికారిగా నియమించాలని డీజీపీని కోరారు. భాగస్వాములైన అందరినీ అరెస్టు చేయాలన్నారు.

*వీధిలోని డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరిన ఓ మహిళపై విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చిందులేశారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని కేఎల్‌ పురంలో వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే హాజరయ్యారు.శిలాఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత ఓ మహిళ తమ వీధిలోని మురుగు కాల్వ సమస్యను నగర పాలక సంస్థ అధికారులకు విన్నవించుకునే ప్రయత్నం చేశారు. కాల్వ లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలో ఎమ్మెల్యే కోలగట్ల కలగజేసుకుని సమస్యను ఇప్పుడు చెప్పడమేంటంటూ ఆ మహిళపై మండిపడ్డారు. వాటర్‌ ట్యాంక్‌ కావాలా?వద్దా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం సరదాకి ఇక్కడికి వచ్చామనుకుంటున్నారా? తమాషానా? కూర్చో.. అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.