Movies

హృదయాలను హత్తుకునేలా ‘గొలుసు కట్టు గోసలు’ పాట

హృదయాలను హత్తుకునేలా ‘గొలుసు కట్టు గోసలు’ పాట

ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మే 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచింది చిత్ర యూనిట్‌.ఇటీవల పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా విడుదల చేసిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘గొలుసు కట్టు గోసలు’ లిరికల్‌ సాంగ్‌ని విడుదల చేశారు. ‘కలిసి బతికే కాలమేమాయే నేడే..పగటి వేళ పీడ కలలాయే, అలసి పోని ఆశలేమాయే అయ్యో… గొలుసు కట్టు గోసలైపోయే’ అంటూ చాలా ఎమోషనల్‌గా సాగే పాట ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా ఉంది. సినిమాలో సుమ దయనీయ పరిస్థితిని ఈ పాట వివరిస్తుంది. ఈ పాటకు కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించమే కాకుండా.. హరిహరన్‌తో కలిసి ఆలపించారు. చైతన్య ప్రసాద్‌ లిరిక్స్‌ అందించారు.