DailyDose

బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో దోషి శశికృష్ణకు ఉరిశిక్ష – TNI నేర వార్తలు

బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో దోషి శశికృష్ణకు ఉరిశిక్ష – TNI  నేర వార్తలు

* బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో దోషి శశికృష్ణకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. న్యాయమూర్తి రాంగోపాల్ తుది తీర్పు వెలువరించారు. సోషల్ మీడియా ద్వారా రమ్యకు పరిచయమైన శశికృష్ణ తర్వాత క్రమంలో తన నెంబర్ బ్లాక్ చేసిందనే కారణంతో కక్షపెంచుకున్నాడు. చివరకు గత ఏడాది ఆగష్టు 15న గుంటూరు జిల్లా పరమయ్యకుంటలో రమ్యను హత్య చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఆమెను కత్తితో పొడిచి చంపాడు. ఘటనా స్థలంలోనే శశికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. 8 నెలల పాటు కేసు విచారణ సాగింది. మొత్తం 28 మంది సాక్షులను న్యాయస్దానం విచారించింది. మరోవైపు దిశ చట్టం ద్వారా తమకు న్యాయం జరిగిందని రమ్య తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వానికి, పోలీసులకు రమ్య తండ్రి నల్లా వెంకట్రావ్ కృతజ్ఞతలు తెలిపారు. ఉన్మాదులకు ఉరే సరియైన శిక్ష అని ఆయన అభిప్రాయపడ్డారు. తన కుమారుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధించడంపై అతడి తల్లి భూలక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు. తమకు తినడానికి తిండి కూడా లేదని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు

*గుంటూరు జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం ఘటన మరువక ముందే దుగ్గిరాలలో మరో మహిళపై అత్యాచారయత్నం జరిగింది. శృంగారపురంలో మహిళను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం జరిగింది. గ్రామానికి కూలి పనుల కోసం వచ్చి అక్కడే ఉంటున్న మహిళను పలువురు యువకులు బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. మహిళ కేకలు వేయడంతో యువకులు పారిపోయారు. వెంటనే కూలీలు డయల్ 100కు ఫిర్యాదు చేశారు.

*మహబూబాబాద్: జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రిని కూతురు కర్రతో మోది చంపేసింది. మహబూబాబాద్ మండలం వేమునూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి ధ్రువ పత్రాలు తండ్రి ఇవ్వడం లేదన్న కోపంతో తండ్రి వెంకన్న(46)ను కూతురు ప్రభావతి(17) కర్రతో కొట్టి చంపింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*ర్నూలు: జిల్లాలోని కౌతాళం మండలం ఏరిగేరి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ ఆర్త్ వైర్ తగిలి సాయికుమార్(4) అనే బాలుడు మృతి చెందాడు. గత రాత్రి బాలుడిని తల్లిదండ్రులు ఇంటి గుమ్మం దగ్గర పడుకోబెట్టారు. అయితే ఆర్త్ వైర్ ఇంటికి ఉన్న ఇనుప తలుపుకు తగలడంతో పక్కన పడుకున్న బాలుడు పక్కకు ఒరగడంతో విద్యుత్ ఘాతానికి గురై నిద్రలోనే మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

*నంద్యాల: జిల్లాలోని బేతంచెర్ల మండలంలో దుండగులు రెచ్చిపోయారు. ఒక్క రోజే మూడు ఆలయాల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. బేతంచర్ల శివారులోని ఆంజనేయ స్వామి గుడి, గోరు మానుకొండ హనుమ ఆంజనేయస్వామి ఆలయం, సిమెంట్ నగర్‌లోని సుంకులమ్మ గుడిలో దొంగలు హుండీలను ధ్వంసం చేసి నగదును అపహరించారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా… ఒకే వ్యక్తి 3 ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు.

*గుంటూరు: జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఏకాహారతి మాయమైంది. రెండు నెలల క్రితం స్వామి వారికి ఓ భక్తుడు ఈ ఏకాహారతిని స్వామివారికి బహూకరించాడు. రూ.40వేలతో ఈ కానుకను ప్రత్యేకంగా తయారు చేయించాడు. నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఏకాహారతిపై అధికారులను భక్తుడు ప్రశ్నించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఏకాహారతి కోసం గర్భగుడిని శుభ్రం చేసి బయట పడేసిన చెత్తలో గాలించారు. చెత్తలో ఏకాహారతి బయటపడింది. సిబ్బంది తీరుపై భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

*యూపీలోని అయోధ్య‌లో ఉన్న మ‌సీదుల్లో అభ్యంత‌ర‌క‌ర‌మైన పోస్టర్లు, వ‌స్తువుల్ని ప‌డేసిన ఘ‌ట‌న‌లో ఏడుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతికి భంగం క‌లిగిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై వాళ్లు అరెస్టు చేశారు. అరెస్టు అయిన‌వారిలో మ‌హేశ్ కుమార్ మిశ్రా, ప్ర‌త్యూష్ శ్రీవాత్స‌వ్‌, నితిన్ కుమార్‌, దీపక్ కుమార్ గౌర్‌, బ్రిజేశ్ పాండే, శ‌త్రుఘ్న ప్ర‌జాప‌తి, విమ‌ల్ పాండేలు ఉన్నారు.వీళ్లంతా అయోధ్య న‌గ‌రానికి చెందిన‌వాళ్లే. 11 మంది వ్య‌క్తులు మ‌సీదుల్లో అభ్యంత‌ర‌క‌ర వ‌స్తువుల్ని జార‌విడిచార‌ని, దీంతో ఏడుగుర్ని ప‌ట్టుకున్న‌ట్లు అయోధ్య ఎస్పీ శైలేశ్ కుమార్ పాండే తెలిపారు. మ‌రో న‌లుగురు ప‌రారీలో ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

*పంజాబ్‌లోని బటిండాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో బటిండా బస్‌స్టాండ్‌లో ఆగిఉన్న ఓ బస్సులో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కన బస్సులకు కూడా వ్యాపించాయి. దీంతో మూడు బస్సులు కాలి బూడిదయ్యాయి. అయితే బస్సులో నిద్రిస్తున్న కండక్టర్‌ (conductor) సజీన దహనమయ్యాడు

* అయోధ్య నగరంలోని పలు మసీదులపై అభ్యంతరకరమైన పోస్టర్లు వేసి, వస్తువులను విసిరి నగర శాంతి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఏడుగురిని అయోధ్య పోలీసులు గురువారం అరెస్టు చేశారు.అరెస్టయిన నిందితుల్లో మహేష్ కుమార్ మిశ్రా, ప్రత్యూష్ శ్రీవాస్తవ, నితిన్ కుమార్, దీపక్ కుమార్ గౌర్ అలియాస్ గుంజన్, బ్రిజేష్ పాండే, శత్రుఘ్న ప్రజాపతి, విమల్ పాండేలుగా గుర్తించారు. వీరంతా అయోధ్య వాసులని అయోధ్య సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేష్ కుమార్ పాండే చెప్పారు. 11 మంది ఈ సంఘటనకు పాల్పడ్డారని, వారిలో ఏడుగురిని అరెస్టు చేశామని, మరో నలుగురు పరారీలో ఉన్నారని ఎస్పీ చెప్పారు.

*చెంగల్పట్టు సమీపంలో ట్యాంకర్‌ లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మదురైకి చెందిన అశ్వినికుమార్‌ (28), ఆయన భార్య శివభాగ్యం (23), కుమార్తె దీవానా (2), ఆరు నెలల మగబిడ్డ కారులో సోమవారం నగరంలో బంధువుల ఇంటి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. మంగళవారం వేకువజామున వీరందరూ మళ్ళీ కారులో మదురై బయలుదేరారు. అశ్వినికుమార్‌ నడుపుతున్న కారు మధురాంతకం సమీపంలోని చెన్నై – తిరుచ్చి రహదారిలో అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపి వున్న ట్యాంకర్‌ లారీని ఢీకొన్నది. ఈ సంఘటనలో అశ్వినికుమార్‌, ఆరునెలల మగబిడ్డ ఘటనా స్థలంలోనే మరణించారు. అశ్వినికుమార్‌ భార్య శివభాగ్యం, కుమార్తె దీవానా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద విషయం తెలియగానే పట్టాలం పోలీసులు అక్కడికి చేరుకుని కారు శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టంకు తరలించి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపారు.*భూపాలపల్లి కాకతీయ థర్మల్‌ కేంద్రం(కేటీపీపీ)లో ప్రమాదానికి కారకులైన ఇద్దరిని సస్పెండ్‌ చేస్తూ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈనెల 25న జరిగిన ప్రమాదానికి కారకులై అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ ఎం.రూప, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ సాకేత్‌ కొండ పల్లిలను సస్పెండ్‌ చేశారు. అలాగే డివిజనల్‌ ఇంజనీర్‌ కె.శివమోహన్‌పై బదిలీ వేటు వేశారు.

* బాపట్ల జిల్లాలోని చీరాల మండలం పాత చీరాలలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి అమ్మమ్మ, మనవడు మృతి చెందారు. మృతులు సామ్రాజ్యం(65), సాయికుమార్(25)గా గుర్తించారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

*చిత్తూరు జిల్లాలో టెన్త్‌ ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనలో నారాయణ విద్యాసంస్థల వైస్‌ ప్రిన్సిపాల్‌ గిరిధర్‌, ఎన్‌ఆర్‌ఐ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ను అరెస్టు చేశామని విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. నంద్యాల ఘటనలో 9మంది ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశామని తెలిపారు. విజయవాడలో గురువారం రాత్రి మంత్రి మీడియాతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, మాల్‌ప్రాక్టీస్‌ ఎక్కడా జరగలేదని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో హిందీ ప్రశ్నపత్రం లీకైందన్న వార్తలను మంత్రి కొట్టిపారేశారు. ట్విటర్‌లో కన్నీళ్లు పెట్టుకుంటున్న చంద్రబాబు, లోకేశ్‌లు నారాయణ సంస్థల నుంచి పేపర్‌ లీకైన విషయంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పైకప్పు ఊడిపడడంతో పరీక్ష రాస్తున్న విద్యార్థికి గాయమైతే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించామన్నారు. చంద్రబాబు హయాంలో స్కూళ్లను పట్టించుకోకపోవడమే దీనికి కారణమన్నారు.

*వరకట్నం కోసం భర్త పెడుతున్న హింసలను భరించలేకపోయిన ఓ మహిళ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్‌, కూకట్‌పల్లిలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా అంగిళ్లపల్లి మండలం కాజ్వేకట్నార్‌ గ్రామానికి చెందిన జూపల్లి శ్రీనివాసరావు పిల్లల చదువు కోసం కూకట్‌పల్లిలో నివాసముంటున్నారు. అయితే, తమ పెద్ద కూతురు నిఖిత(26)కు సిరిసిల్లకు చెందిన చేటి ఉదయ్‌తో గతేడాది జూన్‌లో వివాహం చేశారు. ఆ సమయంలో రూ.10లక్షల నగదు, 35 తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. మరో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని తన మరణానంతరం ఇస్తానని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. నిఖిత, ఉదయ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కాగా వర్క్‌ఫ్రమ్‌ హోం కావడంతో ఇద్దరు సిరిసిల్లలో ఉండేవారు. అయితే, గత డిసెంబర్‌ నుంచి సదరు వ్యవసాయ భూమి కోసం ఉదయ్‌ తన భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఇందుకు ఉదయ్‌ తల్లిదండ్రులు శ్యామల, అశోక్‌, సోదరుడు ఉపేందర్‌ కూడా సహకరించేవారు.

*అధికార పార్టీ నేతల దాష్టీకానికి హద్దులు లేకుండా పోతున్నాయి. ఏలూరు గాంధీనగర్‌ కాకివారివీధిలో గిరిజాల దేవికుమార్‌ (60) అనే వితంతువు నివాసముంటున్నారు. ఆమె ఇంటి పక్కనే నివాసముంటున్న అల్లు రామారావుతో సరిహద్దు గొడవలు ఉన్నాయి. కోర్టులో కేసు నడుస్తోంది. తాజాగా వచ్చిన తీర్పు దేవికుమార్‌కి అనుకూలంగా ఉంది. కోర్టు తీర్పును ఏమాత్రం ఖాతరు చేయని రామారావు… తన భార్య, కుమారుడు, అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌ భీమవరపు హేమసుందరి, అనుచరులు సాంబ, మధు, మరికొందరితో కలిసి వివాదానికి కారణమైన గోడను కూల్చివేశారు. దీనిని ప్రశ్నించిన దేవికుమారిపై, హేమసుందరి తన అనుచరులతో కలిసి దాడిచేసి కొట్టారు.

*అప్పుల బాధ తాళలేక రాష్ట్రంలో ఇద్దరు కౌలు రైతులు సహా ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన జయరామిరెడ్డి (48) తనకున్న మూడెకరాల పొలంలో పంటలు సాగు చేసేవాడు. కొన్నేళ్లుగా పంటలు సరిగా పండక నష్టాలు ఎదురయ్యాయి. వ్యవసాయపెట్టుబడులు, కూతురు పెళ్లి, కుమారుడి చదువులకు మొత్తం రూ.8లక్షలు అప్పు చేశాడు. బ్యాంకులో పంట రుణం మరో రూ.75వేలు ఉంది. వీటిని ఎలాతీర్చాలో తెలియక మనస్తాపం చెందిన జయరామిరెడ్డి బుధవారం పెనుకొండ సమీపంలోని కృష్ణదేవరాయల సర్కిల్‌లోని దర్గా వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం తాటిపాడు గ్రామానికి చెందిన చిన్నశంకర్‌ (36) 11.5 ఎకరాలు కౌలుకు తీసుకుని మూడేళ్లుగా మినుము, కంది పంటలు సాగు చేస్తున్నాడు. పంట సరిగా రాక ఏటికేడు అప్పులు పెరిగి రూ.9.53 లక్షలు అయింది. దీంతో మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. చిన్నశంకర్‌ గత స్థానిక ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన రైతు ఇప్పల శ్రీనివాస్‌ రెడ్డి (54) గత పదేళ్లుగా పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. సాగులో నష్టాలు రావటంతో రూ.20 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఊరి చివర తాగునీటి బావిలో పడి గురువారం మృతి చెందాడు. మృతుడి భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సోమేశ్వరరావు తెలిపారు.

*వనపర్తి జిల్లా గణపురం మండలం గుర్రంపేటలో కౌలు రైతు అజ్మీరా రాజన్నగురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజన్న రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తివరిని పండిస్తుండేవాడు. ఇందుకు రూ. లక్షల అప్పులు చేయాల్సి వచ్చింది. పంట దిగుబడి సరిగా రాక అప్పులెలా తీర్చాలో తెలియక గురువారం ఉరేసుకున్నాడు. కాగావడదెబ్బతో గురువారం ఇద్దరు రైతులుఓ కూలీ మృతి చెందారు. వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో రైతు మామిండ్ల ఆదిరెడ్డిములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పెద్ద వెంకటాపురంలో రైతు మొయినుద్దీన్‌(కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేటలో ఉపాధిహామీ కూలీ బూదవ్వ మృతి చెందినవారిలో ఉన్నారు.