DailyDose

గల్ఫ్‌ లో వేలాది యాచకుల అరెస్టు – TNI నేర వార్తలు

గల్ఫ్‌ లో వేలాది యాచకుల అరెస్టు – TNI  నేర వార్తలు

* దుబాయిలో గత మూడు నెలల్లో 1000 మంది యాచకులను అరెస్టు చేసినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. అరెస్టయిన వారిలో అత్యధికులు పవిత్ర రంజాన్‌ మాసంలో, ఈద్‌ పండుగ రోజు భిక్షాటన చేస్తున్న వారేనని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో 902 మంది పురుషులు, 98 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. నగరంలో భిక్షాటన చేస్తున్న వారు కనిపిస్తే 901 నెంబరుకు ఫోన్‌ చేయాలని పోలీసులు సూచించారు. రంజాన్‌ మాసంలో అరెస్టు చేసిన ఒక యాచకుడి వద్ద నుంచి 40 వేల దిర్హంలు (సుమారు రూ.8.4 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియాలోనూ భిక్షాటన చేస్తున్న 3,719 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మక్కా పుణ్యక్షేత్రం వద్ద ఒక మహిళ నుంచి రూ.24 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కువైత్‌లోనూ పిల్లలతో సహా భిక్షాటన చేస్తున్న వందలాది మంది విదేశీయులను అరెస్టు చేసి దేశ బహిష్కార దండన విధించారు.

*పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణం
తాడేపల్లిగూడెంలో దారుణం జరిగింది. కొండ్రుపోలుమెట్టలోని కేఎస్ఎన్ కాలనీలో సామాజిక బహిష్కరణ కలకలం రేపుతోంది. హత్యాయత్నం కేసులో సంబంధం లేని వ్యక్తిపై నిందలు మోపి తప్పు పేరుతో రూ.60 వేలు కట్టాలంటూ వడ్డీల సంఘం పెద్దలు తీర్పు ఇచ్చారు. వడ్డీల సంఘం పెద్దలు గుంజె వెంకట్రావు అనే వ్యక్తితో ముందుగా పది వేలు కట్టించుకున్నారు. మళ్లీ మరో రూ. 50 వేలు కట్టాలని కుల పెద్దలు దుర్గారావు, రామకృష్ణ, వెంకట్రావు, కృష్ణ డిమాండ్ చేశారు. లేకపోతే కులం నుంచి వెలి వేస్తామని బెదిరించారు. డబ్బు చెల్లించే వరకూ కదిలేదంటూ వెంకట్రావు కుటుంబాన్ని నిర్బంధించారు. వారి నుంచి తప్పించుకున్న వెంకట్రావు.. తమకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.

*ఐపీఎస్‌ అధికారిణికి మెసేజ్‌లు.. అమెరికా నుంచి వచ్చి అరెస్ట్‌
అమెరికాలో ఉంటున్న ఓ ట్రక్‌ డ్రైవర్‌ ఓ ఐపీఎస్‌ అధికారిణికి సంక్షిప్త సందేశాలు పంపి.. ఆమెను కలిసేందుకు వచ్చి.. హైదరాబాద్‌ పోలీసులకు చిక్కాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌ సమీపంలోని తర్న్‌తరన్‌ ప్రాంతానికి చెందిన మల్‌రాజ్‌ సింగ్‌ అలౌక్‌(29) కాలిఫోర్నియాలో ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి గ్రీన్‌కార్డు సైతం ఉంది. పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన ఓ మహిళా ఐపీఎస్‌ అధికారిణికి అతను కొన్నాళ్లుగా సామాజిక మాధ్యమాల్లో సంక్షిప్త సందేశాలు పంపుతున్నాడు. ఆమె జనవరి 17 నుంచి ఏప్రిల్‌ 29 వరకు జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులోని ఓఅతిథి గృహంలో ఉంటున్నారు. మల్‌రాజ్‌సింగ్‌ అలౌక్‌ ఆమెకోసం అమెరికా నుంచి నేరుగా పంజాబ్‌ వచ్చాడు. హైదరాబాద్‌లో శిక్షణలో ఉన్నట్లు తెలుసుకొని నేరుగా ఇక్కడికి వచ్చాడు. ఈనెల 1న ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీకి వెళ్లి వివరాలు తెలుసుకొని అధికారిణి ఉంటున్న అతిథిగృహం వద్దకు వెళ్లాడు. అలౌక్‌తో మాట్లాడటానికి ఆమె నిరాకరించి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సోమవారం నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

*చోడవరంలో దారుణం చోటు చేసుకుంది. చోడవరంలో ఓ యువకుడు చిన్నారిపై అత్యాచారం చేశాడు. చిన్నారి ప్రస్తుతం వ తరగతి చదువుతోంది. చిన్నారి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

* తమిళనాడులోని మధురైలో హైవేపై రూ.10 లక్షల విలువైన మద్యం బాటిళ్లతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. దీంతో మద్యం బాటిళ్లన్ని ఒక్కసారిగా రహదారిపై అడ్డంగా పడిపోయాయి. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదన్నట్లుగా అక్కడ ఉండే స్థానికులు ఆ బాటిళ్లను ఎత్తుకుపోవడం ప్రారంభించారు. దీంతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారడమే కాకుండా ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది.ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ని క్లియర్‌ చేసేందుకు ఉపక్రమించారు. అంతేకాదు కేరళలోని మనలూర్‌లో ఉన్న గోదాం నుంచి మద్యం బాటిళ్లను లోడ్ చేసి తీసుకువెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ వాహనాన్ని కంట్రోల్‌ చేయలేకపోవడంతో అదుపుతప్పి బొల్తాపడిందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

*ప్రియురాలితో గొడవ పడిన ఓ వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన సానుతపా(28) రెండేళ్ల క్రితం బతుకు దెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి దుండిగల్‌లోని గ్రీన్‌ మెట్రోలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన ప్రేయసితో ఫోన్‌లో మాట్లాడుతూ గొడవ పడ్డాడు. విషయాన్ని దుండిగల్‌ చౌరస్తాలో నివాసముండే తన చిన్నాన్న కుమారుడు, సెక్యూరిటీగార్డు సాహిల్‌కు చెప్పి తనకు ఇది మామూలే అంటూ పడుకునేందుకు ఇంటికి వెళ్లిపోయాడు. అయితే మంగళవారం ఉదయం సాహిల్‌కు తోటి కార్మికుడైన టీకా రామ్‌ ఫోన్‌ చేసి దుండిగల్‌ గ్రీన్‌ మెట్రో సమీపంలోని తుమ్మచెట్టుకు సానుతపా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపాడు. ఈ విషయాన్ని అతను పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌ మార్టమ్‌ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సాహిల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

*IPS అధికారిణిని అభ్యంతరకర మెసేజ్లతో వేధిస్తున్న nri అరెస్ట్
IPS అధికారిణిని అభ్యంతరకర మెసేజ్‌లతో ఓ ఎన్నారై (nri) వేధింపులకు గురిచేస్తుండడంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిన ఘల్ రాజు.. అమెరికాలోని Californiaలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా పంజాబ్ మహిళా ఐపీఎస్ అధికారిణిని వేధిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఘల్ రాజు తన స్వస్థలమైన పంజాబ్‌కు వచ్చాడు. కాగా మహిళా ఐపీఎస్ అధికారిణి హైదరాబాద్‌లో hrd శిక్షణ తీసుకుంటున్న విషయం తెలుసుకుని నగరానికి వచ్చాడు. హెచ్ఆర్డీ లోపలకువెళ్లి మహిళా ఐపీఎస్ అధికారిణిని వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘల్ రాజుని పోలీసులు అరెస్టు చేశారు.

*ఆటో ట్రాలీని ఓ ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు సజీవదహనం అవ్వగా.. మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ వద్ద.. ఎన్‌హెచ్‌-65పై ఆల్గోల్‌ చౌరస్తా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన షేక్‌సమీర్‌(22), షేక్‌ ఖలీం, షేక్‌ ఇమామ్‌, కుమార్‌సింగ్‌.. పెళ్లి సామగ్రి కొనుగోలు కోసం సిబ్బూ అనే వ్యక్తికి చెందిన ఆటో ట్రాలీలో హైదరాబాద్‌ వచ్చారు. సోమవారం అర్ధరాత్రి దాటాక తిరుగు ప్రయాణమయ్యారు. ఆల్గోల్‌ చౌరస్తా వద్ద ఆటో ట్రాలీ యూటర్న్‌ తీసుకుంటుండగా.. హైదరాబాద్‌ వైపు వెళ్తున్న సిటిజన్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొంది. దీంతో.. ఆటో ట్రాలీ పల్టీలు కొట్టింది. డీజిల్‌ ట్యాంకు పగిలి, మంటలు చెలరేగాయి. ట్రాలీలో ఉన్న సమీర్‌పై బీరు వా పడడంతో.. తప్పించుకునే మార్గం లేక ఆయన సజీవ దహనమయ్యాడు. ట్రాలీలో ప్రయాణిస్తున్న మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. అటు బస్సు ముందు భాగంలో కూర్చున్న క్లీనర్‌ నరేశ్‌.. బస్సు కుదుపుతో మంటల్లోకి ఎగిరిపడ్డాడు. బస్సులో ప్రయాణిస్తున్న మల్లేశ్‌, వెంకటేశ్‌, దీపక్‌లకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను జహీరాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారకుడైన ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

*అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి క్రాంతి కిరణ్‌రెడ్డి దుర్మరణం చెందాడు. మిస్సోరి రాష్ట్రం వారెన్స్‌బగ్‌లో ఈ నెల 7వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూ సింది. విద్యార్థి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాసరెడ్డి, అరుణ దంపతుల చిన్న కుమారుడు క్రాంతి కిరణ్‌రెడ్డి(25) ఎంఎస్‌ చదివేందుకు గత ఏడాది వారెన్స్‌బగ్‌లోని మిస్సోరి సెంట్రల్‌ యూనివర్సిటీకి వెళ్లాడు. ఈ నెల 7వ తేదీన రాత్రి 7.30 గంటలకు స్నేహితులతో కలిసి వెళ్తుండగా వీరి కారును ఓ కంటైనర్‌ ఢీకొట్టింది. డ్రైవర్‌ పక్కనే కూర్చున్న కిరణ్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమెరికాలోనే ఉంటున్న శ్రీనివాస్‌రెడ్డి బావమరిది మంగళవారం సమాచారం ఇవ్వడంతో విషయం తెలిసింది. క్రాంతికిరణ్‌రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి 2, 3 రోజుల్లో తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు బంధువులు తెలిపారు.

* దేశ రాజధాని ఢిల్లీలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు భారీగా హెరాయిన్‌ను పట్టుకున్నారు. 62 కిలోల హెరాయిన్‌ను తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ హెరాయిన్‌ విలువ రూ.434 కోట్ల విలువ ఉంటుందని డీఆర్‌ఐ అధికారులు పేర్కొన్నారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో కాంప్లెక్స్‌లో మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఉగాండాలోని ఎంటెబ్బే నుంచి కార్గోలో దుబాయి మీదుగా ఢిల్లీకి హెరాయిన్‌ చేరినట్లు చెప్పారు. కార్గోలో వచ్చిన 330 ట్రాలీ బ్యాగులు ఉండగా.. 126 ట్రాలీ బ్యాగ్‌ మెటల్‌ ట్యూబ్‌లలో దాచి హెరాయిన్‌ను రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు డీఆర్‌ఐ పేర్కొంది. ఈ సందర్భంగా ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అలాగే పలువురు అనుమానితులను సైతం విచారిస్తున్నట్లు తెలిపింది. గతేడాది డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ విభాగం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నది.2021 సంవత్సరంలో 3,300 కిలోలకుపైగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోగా.. ఈ ఏడాది జనవరి నుంచి డీఆర్‌ఐ న్యూఢిల్లీలోని ఐసీడీ తుగ్లక్‌బాద్‌లోని ఓ కంటైనర్‌లో 34 కిలోలు, ముంద్రా పోర్ట్‌లో ఓ కంటైనర్‌ నుంచి 201 కిలోలు, 392 కిలోల యార్న్‌ ను స్వాధీనం చేసుకున్నారు. విమానాల ద్వారా తరలిస్తుండగా పలువురి నుంచి 60 కిలోలకుపైగా హెరాయిన్‌ను డీఆర్‌ఐ స్వాధీనం చేసుకున్నది.

*విదేశీ సహకార నియంత్రణ (ఎఫ్‌సీఆర్‌ఏ) చట్టాన్ని ఉల్లంఘిస్తూ విదేశీ విరాళాలు సేకరణ జరిపిన కేసులో సీబీఐ మందిని అరెస్ట్‌ చేసింది. ఇందులో కేంద్ర హోం శాఖ ఉద్యోగులుఎన్జీవోల ప్రతినిధులుమధ్యవర్తులు ఉన్నారు. విదేశీ విరాళాల సేకరణలో అవినీతికి సంబంధించి కేంద్ర హోం శాఖ నుంచి అందిన ఫిర్యాదు మేరకు సీబీఐ చర్యలు తీసుకుంది. ఢిల్లీచెన్నైహైదరాబాద్‌మైసూర్‌ సహా ప్రాంతాల్లో మంగళవారం దాడులు చేసింది. ఎన్జీవోలు విదేశాల నుంచి విరాళాలను సేకరించేందుకు కొందరు అధికారులు ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల అతిక్రమణకు పాల్పడినట్టు తేల్చారు. సదరు అధికారులు ఇందుకోసం ఎన్జీవోల నుంచి లంచాలు స్వీకరించినట్టు కనిపెట్టారు. అంతేకాక రూ. కోట్ల హవాలాకు సంబంధించిన లావాదేవీలను ఇప్పటిదాకా గుర్తించారు.

*నిర్మాణంలోని భవనం పిట్ట గోడ కూలింది. ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయమై స్థానికులు జీహెచ్‌ఎంసీ సర్కిల్‌- డీఎంసీ రమే్‌షకు ఫిర్యాదు చేశారు. మధురానగర్‌ ఈ బ్లాక్‌ బిల్డింగ్‌ నాలుగో అంతస్తు నుంచి మూడు వరుసలుగా పేర్చిన పిట్టగోడ ఇటుకలు మంగళవారం కింద పడ్డాయి. ఈ ఇటుకలు సమీపంలోని ఇళ్లల్లో పడటంతో ఆయా ఇళ్లల్లోని నివాసితులు ఆందోళన చెందారు. భవన యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వారు డీఎంసీకి ఫిర్యాదు చేశారు.

*జర్మనీలో జరిగిన ఓ పడవ ప్రమాదంలో గల్లంతైన తెలంగాణ విద్యార్థి ఆచూకీ కనిపెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖతోపాటు బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయానికి(ఎంబసీ) మంగళవారం లేఖలు పంపింది. రాష్ట్రానికి చెందిన కడారి అఖిల్‌(కెమికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేసేందుకులో జర్మనీ వెళ్లాడు. అయితేమే జరిగిన ప్రమాదంలో అఖిల్‌ ఉన్న పడవ నీళ్లలో మునిగింది. అప్పట్నించి అతని ఆచూకీ లేకుండా పోయింది. ఈ క్రమంలో అఖిల్‌ సోదరి ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ను సాయం కోరారు. కేటీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవసరమైన చర్యలు తీసుకున్నారు.

*ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలో గుడివాడ ఆంధ్రాబ్యాంకు శాఖ వద్ద రూ. 36.97 కోట్ల మేర రుణం తీసుకుని, బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టిన కేసులో ఆ బ్యాంకు మాజీ మేనేజర్‌ ఎస్‌ రామచంద్ర రావు సహా పలువురిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తాజాగా చార్జిషీటు నమోదు చేసింది. ఈ మేరకు ఒక ప్రకటనలో సంస్థ వెల్లడించింది. బ్యాంకులో తీసుకున్న రుణాన్ని ‘ఆకాశమే హద్దు’ అనే సినిమాకు పెట్టుబడులుగా పెట్టారని, అందువలన వడ్డీతో కలిపి బ్యాంకుకు రూ. 54.64 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది. రామచంద్రరావుతో పాటు వీనస్‌ ఆక్వా ఫుడ్స్‌ లిమిటెడ్‌ అనే సంస్థపైనా, దాని మేనేజింగ్‌ డైరెక్టర్‌ నిమ్మగడ్డ రామకృష్ణ సహా పలువురిపైనా చార్జిషీటు నమోదు చేశామని వెల్లడించింది. విశాఖపట్నంలోని నగదు అక్రమ రవాణా నివారణ చట్టం(పీఎంఎల్‌ఏ)కు సంబంధించిన ప్రత్యేక కోర్టులో చార్జిషీటును దాఖలు చేశామని, కోర్టు ఈ నెల 9న దాన్ని కోర్టు విచారణకు స్వీకరించిందని ఈడీ పేర్కొంది. ‘‘వీనస్‌ ఆక్వా సంస్థకు సంబంధించిన డైరెక్టర్లు, వారి కుటుంబీకులు కలిసి చేపల పెంపకం కోసం బ్యాంకు నుంచి రూ. 36.97 కోట్ల రుణం తీసుకున్నారు. బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ వారికి సహకరించారు. కానీ తీసుకున్న రుణాన్ని ఉద్దేశించిన పనికి వారు వినియోగించలేదు. పాత రుణాల్ని తీర్చుకునేందుకు, ఇతర స్థిరాస్థుల్ని కొనుగోలు చేసేందుకు ఆ మొత్తాన్ని వాడి, బ్యాంకుకు నష్టాన్ని చేకూర్చారు’’ అని ఈడీ స్పష్టం చేసింది.

*ముత్తుకూరు మండలంలోని రొయ్యలపాళెంలో అన్నను హత్య చేసిన కేసులో పోలీసులు నిందితుడైన తమ్ముడిని అరెస్టు చేశారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కృష్ణపట్నం సీఐ వేమారెడ్డి వివరా లను వెల్లడించారు. రొయ్యలపాళేనికి చెందిన అన్నదమ్ములు పాముల సుబ్రహ్మణ్యం, పాముల శ్రీనివాసులు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ నేపఽథ్యంలో ఇంటికి మరమ్మతులు చేయిస్తున్న తమ్ముడు శ్రీనివాసులును అన్న సుబ్రహ్మణ్యం అడ్డుకుని పెద్దమనుషుల సమక్షంలో పరిష్కరించుకుందామని పనులు ఆపివేశాడు. కోపం పెంచుకున్న శ్రీనివాసులు గత నెల 29 ఉదయం అన్న సుబ్రహ్మణ్యంపై ఇనుపరాడ్డుతో తలపై కొట్టి పెట్రోలు పోసి తగులబెట్టాడు. చికిత్స పొందుతూ సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. రూరల్‌ డీఎస్పీ హరినాఽథరెడ్డి ఆధ్వర్యంలో కృష్ణపట్నం సీఐ వేమారెడ్డి, ముత్తుకూరు, కృష్ణపట్నం ఎస్‌ఐలు శివకృష్ణారెడ్డి, అంజిరెడ్డి, సిబ్బందితో బృందంగా ఏర్పడి నిందితుడు పాముల శ్రీనివాసులును పంటపాళెం పోర్టు రహదారిపై అరెస్టు చేశారు. కేసును త్వరగా ఛేదించి, నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన సిబ్బందికి రివార్డులు అందజేసి అభినందించారు.

*నిర్మాణంలోని భవనం పిట్ట గోడ కూలింది. ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయమై స్థానికులు జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-19 డీఎంసీ రమే్‌షకు ఫిర్యాదు చేశారు. మధురానగర్‌ ఈ బ్లాక్‌ బిల్డింగ్‌ నాలుగో అంతస్తు నుంచి మూడు వరుసలుగా పేర్చిన పిట్టగోడ ఇటుకలు మంగళవారం కింద పడ్డాయి. ఈ ఇటుకలు సమీపంలోని ఇళ్లల్లో పడటంతో ఆయా ఇళ్లల్లోని నివాసితులు ఆందోళన చెందారు. భవన యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వారు డీఎంసీకి ఫిర్యాదు చేశారు.

*జర్మనీలో జరిగిన ఓ పడవ ప్రమాదంలో గల్లంతైన తెలంగాణ విద్యార్థి ఆచూకీ కనిపెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖతోపాటు బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయానికి(ఎంబసీ) మంగళవారం లేఖలు పంపింది. రాష్ట్రానికి చెందిన కడారి అఖిల్‌(25) కెమికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేసేందుకు 2018లో జర్మనీ వెళ్లాడు. అయితే, మే 8న జరిగిన ప్రమాదంలో అఖిల్‌ ఉన్న పడవ నీళ్లలో మునిగింది. అప్పట్నించి అతని ఆచూకీ లేకుండా పోయింది. ఈ క్రమంలో అఖిల్‌ సోదరి ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ను సాయం కోరారు. కేటీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవసరమైన చర్యలు తీసుకున్నారు.

*ఆటో ట్రాలీని ఓ ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు సజీవదహనం అవ్వగా.. మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ వద్ద.. ఎన్‌హెచ్‌-65పై ఆల్గోల్‌ చౌరస్తా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన షేక్‌సమీర్‌(22), షేక్‌ ఖలీం, షేక్‌ ఇమామ్‌, కుమార్‌సింగ్‌.. పెళ్లి సామగ్రి కొనుగోలు కోసం సిబ్బూ అనే వ్యక్తికి చెందిన ఆటో ట్రాలీలో హైదరాబాద్‌ వచ్చారు. సోమవారం అర్ధరాత్రి దాటాక తిరుగు ప్రయాణమయ్యారు. ఆల్గోల్‌ చౌరస్తా వద్ద ఆటో ట్రాలీ యూటర్న్‌ తీసుకుంటుండగా.. హైదరాబాద్‌ వైపు వెళ్తున్న సిటిజన్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొంది. దీంతో.. ఆటో ట్రాలీ పల్టీలు కొట్టింది. డీజిల్‌ ట్యాంకు పగిలి, మంటలు చెలరేగాయి. ట్రాలీలో ఉన్న సమీర్‌పై బీరు వా పడడంతో.. తప్పించుకునే మార్గం లేక ఆయన సజీవ దహనమయ్యాడు. ట్రాలీలో ప్రయాణిస్తున్న మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. అటు బస్సు ముందు భాగంలో కూర్చున్న క్లీనర్‌ నరేశ్‌.. బస్సు కుదుపుతో మంటల్లోకి ఎగిరిపడ్డాడు. బస్సులో ప్రయాణిస్తున్న మల్లేశ్‌, వెంకటేశ్‌, దీపక్‌లకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను జహీరాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారకుడైన ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

*నిర్మల్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మందుల కోసం ఆస్పత్రిలో వేచి ఉన్న వృద్ధురాలి(58)పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. లక్ష్మణచాంద మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు మందుల కోసం సోమవారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఆ సమయంలో ఆస్పత్రి సిబ్బంది ఎవ్వరు అక్కడ లేరు. దీంతో రోగులు వేచి ఉండే గదిలోని బెంచీపై ఆమెపై పడుకొని ఉంది. వృద్ధురాలు ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన శ్రీకాంత్‌(23) అనే యువకుడు ఆరోగ్య కేంద్రం లోపలికి వెళ్లాడు. మందులు ఇప్పిస్తానని నమ్మబలికి ఆమెను మరో గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం వృద్ధురాలు కేకలు వేయగా శ్రీకాంత్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు వృద్ధురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడు శ్రీకాంత్‌ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మద్యానికి బానిసైన శ్రీకాంత్‌ గ్రామంలో జులాయిగా తిరుగుతుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆస్పత్రిలో సిబ్బంది ఎవ్వరు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

* పరీక్ష కేంద్రంలో గుండెపోటు రావడంతో ఇంటర్‌ విద్యార్థి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి జిల్లా సైదాపురం మండలం కమ్మవారిపల్లె గిరిజన కాలనీకి చెందిన వెంకటసతీశ్‌ (18) గూడూరులోని ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వెంకట సతీశ్‌కు గుండె సంబంధిత వ్యాధి ఉండడంతో ఆరేళ్ల క్రితం శస్త్రచికిత్స చేయించారు. సతీశ్‌ మంగళవారం గూడూరు మున్సిపల్‌ కార్యాలయ సమీపంలోని ఓ కళాశాలలో ఇంగ్లీషు పరీక్ష రాసేందుకు వచ్చాడు. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీ సు సిబ్బందితో గుండెనొప్పిగా ఉందని చెప్పడంతో పక్కనే ఉన్న బెంచీపై కూర్చోబెట్టారు. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందంటూ అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆ విద్యార్థిని ఏరియా ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

*రోడ్డు పక్కన మాట్లాడుకుంటున్న వారిపై కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. రాజపాళయం మలయడిపట్టికి చెందిన అయ్యనార్‌ (31), కమ్మాపట్టికి చెందిన రామసుబ్రమణియన్‌ (35) ఎలక్ట్రీషియన్‌లుగా పనిచేస్తున్నారు. వీరు మంగళవారం శ్రీవిల్లిపుత్తూర్‌ సమీపంలోని ఓ ఇంట్లో ఎలక్ట్రిక్‌ పనుల కోసం మోటార్‌సైకిల్‌పై బయల్దేరారు. లక్ష్మిపురం సమీపంలో రోడ్డు పక్కన బైక్‌ నిలిపిన వీరు మాట్లాడుకుంటున్న సమయంలో ఆ మార్గంగా వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి వీరిపై దూసుకుపోయింది. మోటార్‌సైకిల్‌తో పాటు కారు బ్రిడ్జి నుంచి కిందకు పడింది. ఈ ఘటనలో అయ్యనార్‌, రామసుబ్రమణియన్‌ సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై నత్తంపట్టి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

*కడలూరు జిల్లా పాళయంకోటలో తనకు పెళ్లి చేయడంలేదన్న ఆగ్రహంతో కన్నతండ్రిని కుమారుడు దారుణంగా హత్య చేశాడు. కీళ్‌పాది ప్రాంతంలో లూర్థుసామి, ముగ్గురు కుమారులతో నివసిస్తున్నాడు. వీరిలో చిన్నకుమారులు ఇద్దరూ బాగా చదవి ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద కుమారుడు జాన్‌సన్‌ (39) నిరక్షరాస్యుడిగా ఏ పనులకు వెళ్ళకుండా జులాయిగా తిరుగుతున్నాడు. దీనికితోడు అతడికి మద్యం అలవాటు తోడైంది. రోజు పీకల దాకా తాగి ఇంటికి వచ్చి తనకు పెళ్ళి చేయమంటూ తండ్రి లూర్థుసామిని వేధించేవాడు. సోమవారం రాత్రి తాగి ఇంటికి వచ్చిన జాన్‌సన్‌ తన పెళ్ళి విషయమై తండ్రితో గొడవపడ్డాడు. బండరాయితో లూర్థుసామిపై దాడి జరిపి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ లూర్థుసామిని చికిత్స కోసం తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సఫలించక మంగళవారం అతడు మృతి చెందాడు.

*సత్య సాయి: జిల్లాలో మరో మహిళ దారుణ హత్యకు గురైంది. గోరంట్ల మండలం వానవోలు గ్రామానికి చెందిన చాకలి ఈశ్వరమ్మ(35) అనే మహిళను వ్యవసాయ పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో కొట్టి హత్య చేశారు. పొలంలో విగతజీవిగా పడి ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. బైక్ (Bike) యాక్సిడెంట్‌కు గురై తీవ్రగాయాలతో అధ్యాపకుడు రామకృష్ణ, చిరంజీవి అనే మరో వ్యక్తి ఆస్పత్రికి వచ్చారు. అయితే డ్యూటీ డాక్టర్ ఉన్నప్పటికీ సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు వారికి చికిత్స చేశారు. తలకి కట్లు కట్టడం, సెలైన్లు పెట్టడం అంత సెక్యూరిటీ గార్డులు, స్వీపరులే చేశారు. డాక్టర్ అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం ఇంజక్షన్ వేసి సరిపెట్టుకున్నాడు. కాగా లెక్చరర్ రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ అంబులెన్స్‌లో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

*అల్లూరి జిల్లాలో కోటిన్నర విలువ చేసే గంజాయి స్వాధీనం జిల్లాలో కోటిన్నర విలువ చేసే 1800 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదబయలు మండలం గుల్లెలు సమీపంలో రవాణాకు సిద్ధం చేసిన 1800 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ కోటి 50 లక్షలు ఉంటుందని, పాడేరు సీఈబీ సీఐ ఎ. సంతోష్ తెలిపారు. గంజాయి తరలించేందుకు యత్నించిన నిందితులను గుర్తించామని త్వరలో పట్టుకుంటామని చెప్పారు.