NRI-NRT

లండన్‌లో ఎన్నారైల సంబరాలు.. సీఎం కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు

లండన్‌లో ఎన్నారైల సంబరాలు.. సీఎం కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు

తెలంగాణ రాష్ట్ర టీవీ, చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంను నియమించినందుకు లండన్‌లోని ఎన్నారైలు సంబరాలు చేసుకొని, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్ర‌త్యేక‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎన్నారైలు కేక్ క‌ట్ చేసి ఘ‌నంగా సంబరాలు చేసుకున్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంటే నడుస్తూ, తెలంగాణ కోసం ఎన్నో ర్యాలీలు, ధర్నాలు చేశార‌న్నారు. నేడు బంగారు తెలంగాణ కోసం అదే స్ఫూర్తి తో పనిచేస్తున్న ఒక క్రమశిక్షణ గల ఉద్యమకారునికి దక్కిన గౌరవమ‌ని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు అశోక్ దూసరి తెలిపారు.ప్రపంచ దేశాలలో వున్నా ప్రతి ప్రవాస బిడ్డకు దక్కిన గౌరవం ఇది. అనిల్ కూర్మాచలం జర్నీ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని, ఇలాగే ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేరుకొని కేసీఆర్ అడుగుజాడల్లో బంగారు తెలంగాణ‌ కోసం కృషి చేయాల‌ని తెలంగాణ‌ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డ‌మ్‌ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల తెలిపారు.
Anil-London1
టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని క్రమశిక్షణగా పని చేసిన వారికి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని మరోసారి రుజువైందని అనిల్ కుర్మాచ‌లం భార్య ప్ర‌భ‌ల‌త పేర్కొన్నారు. మా కుటుంబ సభ్యుల పక్షాన లండన్‌లోని ఎన్నారై సంస్థలకు, మిత్రులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంబరాలలో ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు అశోక్ దుసరి, టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుడుల, అనిల్ కుర్మాచ‌లం కుటుంబం సభ్యులు ప్రభలత కూర్మాచలం, నిత్య శ్రీ, టాక్, ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు వెంకట్ రెడ్డి దొంతుల, స్వాతి బుడగం, శుష్మున రెడ్డి, సత్య చిలుముల, సురేష్ బుడగం, జాహ్నవి, నవీన్ రెడ్డి, రవి రెటినేని, సుప్రజ పులుసు, మల్లా రెడ్డి, హరిబాబు గౌడ్ నవాపేట, శ్రీ శ్రావ్య వందనపు, సత్యపాల్ రెడ్డి పింగిలి, రవి ప్రదీప్ పులుసు, పృథ్వీ రావుల,అపర్ణ, రవికిరణ్, మణి తేజ, జస్వంత్, నిఖిల్ త‌దితరులు పాల్గొన్నారు.