Politics

చంద్రబాబు పర్యటనతో వైసీపీ నేతల్లో భయం – TNI రాజకీయ వార్తలు

చంద్రబాబు పర్యటనతో వైసీపీ నేతల్లో భయం – TNI  రాజకీయ వార్తలు

* రాయలసీమలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనతో వైసీపీ నేతలకు భయం పట్టుకుందని మాజీ కేంద్రమంత్రి, టీడీపీ నేత పనబాకలక్ష్మి )అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… తిరుపతిలో 30 యాక్ట్ అమలుకు వైసీపీ (YCP) నేతల ఒత్తిడే కారణమని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత పర్యటన సమయంలో ఆంక్షలు పెట్టడమేంటి అని ప్రశ్నించారు. మదనపల్లె సభ జనసంద్రంగా మారిందన్నారు. అడుగడుగునా చంద్రబాబుకు జనం నీరాజనాలు పలుకుతున్నారని తెలిపారు. తిరుపతి జిల్లాలో చంద్రబాబు పర్యటనను విజయవంతం చేస్తామని… కేసులకు భయపడమని పనబాక లక్ష్మీ స్పష్టం చేశారు

*Vijayamma రాజీనామా వైసీపీకి పెద్దదెబ్బ: శ్రవణ్‌కుమార్‌
వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాజీనామా వైసీపీకి పెద్దదెబ్బ అని న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ విజయం ప్రజలతో వచ్చింది కాదని, ఆయన గెలుపు వెనుక విజయమ్మ కష్టం ఉందని గుర్తుచేశారు. అధికారం, డబ్బు కోసం తల్లిని దూరం పెట్టడం దారుణమన్నారు. తల్లి, చెల్లికి అన్యాయం చేసినవాడు రాష్ట్రానికి ఏం మంచి చేస్తాడని శ్రవణ్‌కుమార్ ప్రశ్నించారు. అధికార పార్టీగా జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విలువలు, విశ్వసనీయత అని మాట్లాడే అర్హత జగన్ కోల్పోయారని తెలిపారు. వైఎస్సార్‌, విజయమ్మ ఫొటోలు పెట్టుకోకుండా జగన్ గెలవలేరని శ్రవణ్‌కుమార్‌ పేర్కొన్నారు. విజయమ్మ సాగనంపేందుకు జగన్ ఎత్తుగడ వేశారు. ఆమెతోనే స్వయంగా రాజీనామా చేయించే విధంగా జగన్ ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు రోజులపాటు జరగనున్నాయి. విజయమ్మ తెలంగాణలో వైఎస్సార్‌టీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉండడంతో రెండు రాష్ట్రాల్లో ఉండడం కుదరదనే ఉద్దేశంతో ఆమెను తప్పించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా విజయలక్ష్మిని తొలగించాలంటే పార్టీ రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. దీనిపై న్యాయవాదులు పరిశీలిస్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఈ సమావేశాలు జరగనున్నాయి. వైఎస్ జయంతోత్సవాల సందర్భంగా సీఎం జగన్ ఇడుపులపాయకు వెళ్లి అక్కడ నుంచి నేరుగా వచ్చి ప్లీనరీ సమావేశాలు ప్రారంభిస్తారు

*దగా కేంద్రాలుగా… రైతు భరోసా కేంద్రాలు: Nakka Anand
జగన్‌ పాలనలో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జగన్ అధికారం చేపట్టాక వ్యవసాయం కుదేలయ్యిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాలు.. దగా కేంద్రాలుగా మారాయన్నారు. ప్రభుత్వం రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు లేవన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలిపారు. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించటం ప్రభుత్వానికి సిగ్గుచేటని నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు

*చరిత్రను కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది: మంత్రి Srinivas
కాకతీయుల చరిత్రను బావి తరాలకు తెలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాకతీయ వైభవ సప్తాహం ఉత్సావాలను ప్రారంభించేందుకు వరంగల్‌కు విచ్చేసిన కాకతీయ సామ్రాజ్యపు వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయకు మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భద్రకాళి ఆలయంలో కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్ సత్యవతి, ప్రభుత్వ ఛీఫ్ విప్ వినయ్ భాస్కర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… కాకతీయుల వారసున్ని పిలిచి ఉత్సవాలు చేస్తున్నామన్నారు. చరిత్రను కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. వరంగల్ అంటే కేసీఆర్‌(KCR)కు ప్రేమ ఎక్కువన్నారు. కాకతీయుల ఆదర్శంతోనే తెలంగాణ ప్రభుత్వం ఆలయాలను, చెరువులను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. తెలంగాణ పతకాలు దేశ వ్యాప్తంగా అమలుకావాలని భద్రకాళీ మాతను వేడుకున్నామన్నారు. గత ప్రభుత్వాలు కాకతీయుల ఘనమైన చరిత్రను మరుగునపడేలా చేశాయని విమర్శించారు. కేసీఆర్ పట్టుదలతో నేడు కాకతీయుల చరిత్ర ప్రపంచానికి తెలిసిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు

*బండి సంజయ్ తొండి సంజయ్: Jeevan reddy
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ తొండి సంజయ్ అని… గుండు అరవింద్ , లండు అరవింద్ అని వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపినట్లు చెప్పిన దానిపై తాను ఆర్టీఐ లో వివరాలు కోరామన్నారు. ప్రధాని విద్యార్హతలపై కూడా వివరాలు అడిగినట్లు చెప్పారు. మోదీ వస్త్రాల ధరలు, వాటిని కుట్టిన దర్జీ జీతం వివరాలు కోరామన్నారు. భాగ్యలక్ష్మి టెంపుల్‌కు ఏమైనా నిధులు ఇచ్చారా అని అడుగుతున్నామని అన్నారు. ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు ఎంత? గత ప్రధానుల విదేశీ పర్యటనల ఖర్చు ఎంత?… ఇలా తమకు అనుమానాలు ఉన్న అనేక అంశాలపై ఆర్టీఐ ద్వారా వివరాలు కోరుతున్నామని తెలిపారు. గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచారని మండిపడ్డారు. పరిస్థితి గ్యాస్ నుంచి కట్టెల పొయ్యికి వచ్చింది జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

*ద్యావ్యవస్థ సర్వనాశనం.. జగన్ సాధించిన ప్రగతి ఇదే : పట్టాభి
జగన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ సర్వనాశనమైందని తెదేపా నేత పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. 10వ తరగతిలోనూ 31 శాతం డ్రాపౌట్స్ ఉండడమే.. వైకాపా సర్కారు సాధించిన ప్రగతి అని ఎద్దేవా చేశారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం పిల్లల భవిష్యత్ ను తాకట్టు పెట్టారని మండి పడ్డారు.జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థ సర్వనాశనమైందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాలు, అంతులేని అవినీతి కోసం.. విద్యార్థుల భవిష్యత్ ను జగన్ రెడ్డి ప్రశ్నార్థకం చేస్తున్నారని మండి పడ్డారు. 2 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు అప్పు కోసం.. రాష్ట్ర విద్యా వ్యవస్థను తాకట్టు పెట్టిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు.మూడేళ్లుగా రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో కేంద్ర ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయని పట్టాభిరామ్‌ విమర్శించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఎన్ రోల్ మెంట్ 2 లక్షల 80వేలకు తగ్గిపోయిందని సమగ్ర శిక్షా అభియాన్ నివేదికలో స్పష్టం చేయడంపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ నివేదికలో చెప్పినట్టు 10వ తరగతిలో 31.3 శాతం డ్రాప్అవుట్ రేటు ఉండటమే విద్యా వ్యవస్థలో జగన్ రెడ్డి సాధించిన ప్రగతి అని ఎద్దేవా చేశారు.ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడానికి.. 51 వేల టీచర్ పోస్టులు ఖాళీగా పడిఉండటానికి ప్రపంచబ్యాంక్ పెట్టిన రుణ షరతు కారణం కాదా? అని నిలదీశారు. విద్యారంగాన్ని భ్రష్టుపట్టించడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంగా ప్రజలకు సమాధానం చెప్పాలని పట్టాభిరామ్‌ డిమాండ్‌చేశారు.

*వారు రాజ్యసభకు నామినేట్ కావటం సంతోషాన్నిచ్చింది: చంద్రబాబు
రాజ్యసభకు నామినేట్ అయిన సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, సంగీత దర్శకుడు ఇళయరాజాలకు చంద్రబాబు, లోకేశ్ అభినందనలు తెలియజేశారు. తమ అపార ప్రతిభతో ప్రజల్ని మంత్రముగ్ధులను చేసిన ఇద్దరు దిగ్గజాలకు తగిన గుర్తింపు లభించిందని వారు వ్యాఖ్యనించారు.రాజ్యసభకు నామినేట్ అయిన లెజెండరీ స్క్రీన్ రైటర్, డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్, అసమాన సంగీత దర్శకుడు ఇళయరాజాలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇరువురూ రాజ్యసభకు నామినేట్ కావటం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. వారి పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.లోకేశ్ అభినందనలు: రాజ్యసభకు నామినేట్ అయిన కేవీ విజయేంద్ర ప్రసాద్, ఇళయరాజా లకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. తమ అపార ప్రతిభతో ప్రజల్ని మంత్రముగ్ధులను చేసిన ఇద్దరు దిగ్గజాలకు తగిన గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. ఇద్దరూ రాజ్యసభకు నామినేట్ అయ్యారని తెలుసుకుని ఎంతో సంతోషించాని అన్నారు.పెద్దల సభకు నలుగురు ప్రముఖులు: రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు ప్రముఖులను కేంద్రం నామినేట్ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత .విజయేంద్రప్రసాద్‌, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజ, పరుగుల రాణి పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డే ఆ జాబితాలో ఉన్నారు. ఆయ రంగాలో వీరు చేసిన విశేష కృషిని గుర్తిస్తూ.. కేంద్ర ప్రభుత్వం వి.విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజ, పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డేను పెద్దల సభకు ఎంపిక చేసింది.

*అచ్చే దిన్ అంటూ.. చచ్చే ది చూపిస్తున్నారు: Tulasireddy
కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం పదే పదే వంట గ్యాస్ ధర పెంచడం శోచనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… గడిచిన మూడు నెలల్లో నాలుగు సార్లు పెంచిందన్నారు. కాంగ్రెస్ పాలనలో సిలిండర్ ధర రూ.410 ఉండగా, నేడు రూ.1100లు దాటిందని మండిపడ్డారు. గృహిణులు వంట గదిలోకి వెళ్ళాలంటే భయపడిపోతున్నారన్నారు. ‘‘ఒక వైపు అచ్చే దిన్ అంటూ, మరోకవైపు చచ్చే ది చూపిస్తున్నారు ప్రధాని’’ అంటూ మండిపడ్డారు. పెంచిన వంట గ్యాస్ ధర వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. వంట గ్యాస్ ధర తగ్గిస్తేనే రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇస్తామని లేకుంటే వ్యతిరేకంగా ఓటు వేస్తామని వైసీపీ, టీడీపీ పార్టీలు ప్రకటించాలని పేర్కొన్నారు. వంట గ్యాస్ ధర పెంపుపై జనసేన తన వైఖరిని స్పష్టం చేయాలని తులసిరెడ్డి తెలిపారు

*ఆ వార్త ఎంతో ఆనందాన్ని కలిగించింది: Pawan
రాజ్యసభ కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా , ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ , వీరేంద్ర హెగ్గడే, శ్రీమతి పి.టి.ఉష సభ్యులుగా నియమితులయ్యారనే వార్త ఎంతో ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయిన వీరికి తన తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ నలుగురూ తమ తమ రంగాల్లో మన దేశ పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేశారని కొనియాడారు. వీరి సేవలు, అనుభవాన్ని సముచితరీతిన గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి, కేంద్ర నాయకత్వానికి అభినందనలు తెలిపారు. ఇంకా పవన్ మాట్లాడుతూ.. ‘‘పదవులు ఇవ్వాలంటే రాజకీయంగా ఎంత లబ్ది కలుగుతుంది? ఎన్ని కోట్లు మన ఇంట్లోకి వచ్చి చేరతాయి? అని కొన్ని పార్టీల అధినాయకులు లెక్కలు వేసుకుని.. ముక్కు ముఖం తెలియని వారికి పెద్ద పదవులు కట్టబెట్టడం జగమెరిగిన సత్యం. ఇటువంటి ఈ కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని మనసారా స్వాగతిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

*పెగాసెస్‌పై అనవసరపు రాద్ధాంతం: Payyavula kesav
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెగాసెస్ ఇక్యూప్‌మెంట్ కొన్నారని అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… పెగాసెస్ ఇక్యూప్‌మెంట్ చంద్రబాబు కొనలేదని గౌతమ్ సవాంగ్ ఆర్‌టీఐ సమాధానం ఇచ్చారని… కేవలం అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు డేటా చౌర్యం చేశారని గతంలో అక్రమ కేసు పెట్టి దాన్ని నిరూపించడానికి అనవసరంగా ఉద్యోగస్థులను వేధించారని ఆయన విమర్శించారు.పెగాసెస్‌పై పెద్ద సభా కమిటిని వేసి చర్చ నిర్వహించడం వృధాప్రాయాసే అయిందన్నారు. పెగాసెస్ మీద చర్చ జరగాలని శాసనసభలో వేస్ట్‌గా షార్ట్ డిస్కసన్ కూడా పెట్టారని అన్నారు. ఇదంతా వైసీపీ ప్రభుత్వ అభద్రతకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుగ్గన రాజేందర్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన ల్యాప్‌ట్యాప్‌లు ఏ ఎమ్మెల్యే వాడటంలేదని తెలిపారు. సమాజానికి హానికరమైన వ్యక్తులపై పెట్టాల్సిన నిఘా టీడీపీ నాయకులపై నిరర్థకం కొనసాగిస్తున్నారని పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*దళితులు స్వీయరక్షణకు ఏకమవ్వాలి: జవహర్‌
రాష్ట్రంలో పోలీసులు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి జగన్‌ను సంతృప్తి పరిచే పనిలో ఉన్నారని మాజీ మంత్రి జవహర్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ఆదేశాలను సైతం రాష్ట్రంలో పట్టించుకునే పరిస్థితి లేదని ఒక ప్రకటనలో మండిపడ్డారు. జగన్‌ పాలనలో దళితుల మానప్రాణాలు గాలిలో దీపాలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను నమ్ముకునే బదులు స్వీయ రక్షణకు దళితులు ఏకమవ్వాలని సూచించారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఏమి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.

*జగన్‌రెడ్డికి ప్రధాని అయ్యే చాన్స్‌: ఎంపీ కోటగిరి
‘‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ప్రధాన మంత్రి అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గి వైసీపీకి పెరుగుతాయి. ప్రత్యేక హోదా కూడా సాధిస్తామనే నమ్మకం ఉంది’’ అని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ అన్నారు. బుధవారం ఏలూరులో వైసీపీ జిల్లా ప్లీనరీలో కోటగిరి మాట్లాడారు. ‘ వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక మంది నాయకులు కాంట్రాక్టులు చేశారు. నేటికీ వారికి బిల్లులు రాలేదు. అయినా వారిలో వైసీపీపై అభిమానం పోలేదు.’’ అని కోటగిరి అన్నారు.

*దళితులు స్వీయరక్షణకు ఏకమవ్వాలి: జవహర్‌
రాష్ట్రంలో పోలీసులు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి జగన్‌ను సంతృప్తి పరిచే పనిలో ఉన్నారని మాజీ మంత్రి జవహర్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ఆదేశాలను సైతం రాష్ట్రంలో పట్టించుకునే పరిస్థితి లేదని ఒక ప్రకటనలో మండిపడ్డారు. జగన్‌ పాలనలో దళితుల మానప్రాణాలు గాలిలో దీపాలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను నమ్ముకునే బదులు స్వీయ రక్షణకు దళితులు ఏకమవ్వాలని సూచించారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఏమి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.

*జగన్‌రెడ్డికి ప్రధాని అయ్యే చాన్స్‌: ఎంపీ కోటగిరి
‘‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ప్రధాన మంత్రి అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గి వైసీపీకి పెరుగుతాయి. ప్రత్యేక హోదా కూడా సాధిస్తామనే నమ్మకం ఉంది’’ అని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ అన్నారు. బుధవారం ఏలూరులో వైసీపీ జిల్లా ప్లీనరీలో కోటగిరి మాట్లాడారు. ‘ వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక మంది నాయకులు కాంట్రాక్టులు చేశారు. నేటికీ వారికి బిల్లులు రాలేదు. అయినా వారిలో వైసీపీపై అభిమానం పోలేదు.’’ అని కోటగిరి అన్నారు.

*కేసీఆర్ సర్కార్ విద్యావ్యవస్ధను నిర్ల‌క్ష్యం చేస్తోంది:Vijaya shanti
తెలంగాణలో కేసీఆర్ స‌ర్కార్ విద్యావ్య‌వ‌స్థ‌ను తీవ్ర నిర్ల‌క్ష్యం చేస్తోందని బిజెపి సీనియర్ నేత విజయశాంతి ఆరోపించారు. కార్పొరేట్ స్కూల్స్‌ను ప్రోత్స‌హిస్తూ ప్ర‌భుత్వ పాఠశాలలను(schools) నిర్వీర్యం చేస్తోందని సోషల్ మీడియా ద్వారా విమర్శించారు. రాష్ట్రంలో దాదాపు 20 వేలకు పైగా టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ బడుల్లో పిల్లలకు చదువు చెప్పేందుకు సరిపోను సార్లు లేరు. వేల బడుల్లో ఒకరిద్దరు టీచర్లతోనే విద్యాబోధన జరుగుతోందని అన్నారు. ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియం కూడా ప్రవేశపెట్టడంతో టీచర్ల అవసరం మరింత పెరిగింది. సమస్య తీవ్రత దృష్ట్యా టీచర్ల రిక్రూట్మెంట్ను వేగంగా చేపట్టాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు దుయ్యబట్టారు.

*వైసీపీ నాయకుల స్వలాభం కోసమే ప్రాజెక్టులు : అమర్నాథ్ రెడ్డి
మదనపల్లి టీడీపీ మినీ మహానాడు వేదికపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి మదనపల్లికు కృష్ణా నది జలాలు తీసుకొస్తే.. వైసీపీ ప్రభుత్వం దాన్ని పక్కనపెట్టి ప్రజలకు తాగు, సాగునీరు అందకుండా చేస్తోందని ఆరోపించారు. వైసీపీ నాయకుల స్వలాభం కోసమే పుంగనూరు తంబళ్లపల్లె మండలంలో మినీ రిజర్వాయర్ల పేర్లతో ప్రాజెక్టులు కడుతున్నారని విమర్శించారు. జగన్ పాలన, పథకాల గురించి ప్రశ్నించిన వారిపై ఆక్రమ కేసులు పెట్టడం రివాజుగా మారిందని, బెదిరింపులు, కేసులకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భయపడరని పేర్కొన్నారు.

*పేదలకు విద్యను దూరం చేయొద్దు: లోకేశ్‌
జాతీయ విద్యావిధానం, పాఠశాలల విలీనంతో పేదపిల్లలకు ప్రభుత్వ విద్యను దూరం చేయొద్దని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి బుధవారం ఆయన లేఖ రాశారు. ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత, అరకొర సౌకర్యాలతో ప్రభుత్వ విద్యాలయాలు కునారిల్లుతుంటే, పాఠశాల విలీన నిర్ణయం మూలికే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైందని విమర్శించారు. పాఠశాలల ప్రారంభం రోజునే లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సీఎం నిర్ణయం శరాఘాతమయిందని పేర్కొన్నారు.

*34 వేల స్కూళ్ల మూతకు పథకం: టీడీపీ
రాష్ట్రంలో 34 వేల ప్రభుత్వ స్కూళ్ల మూతకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ‘‘రాష్ట్రంలో ఇప్పుడు 45 వేల స్కూళ్లు ఉంటే వాటిని 11 వేలకు తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రేషనలైజేషన్‌ పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో 10 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి 3 కిలోమీటర్ల అవతల ఉన్న ఇతర స్కూళ్లలో కలిపారు. ప్రభుత్వ స్కూళ్లను మూయవ ద్దని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్లెక్కి ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. పేద వర్గాల పిల్లలు చదువు మానేసే దుస్థితి కల్పిస్తున్నారు. స్కూళ్ల మూతతో 10 వేల టీచర్‌ పోస్టులు రద్దయ్యాయి. ఎయిడెడ్‌ పాఠశాలల విలీనంతో మరో 10 వేల ఎస్జీటీ పోస్టులు రద్దయ్యాయి. మోడల్‌ స్కూళ్లలో టీజీటీ పోస్టులను ఎస్జీటీలుగా మార్చడం వల్ల 6 వేల పోస్టులు రద్దయ్యాయి. పోయిన ఏడాది… ఈ ఏడాది కలిపి మొత్తం 54 వేల పోస్టులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. మొత్తం విద్యా వ్యవస్థను ఇంత ఘోరంగా భ్రష్టు పట్టించిన ప్రభుత్వం మరొకటి లేదు’’ అని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ విమర్శించారు. విద్యా బోధనను పట్టించుకోకుండా ప్రచారానికి రూ.వందల కోట్లు ఖర్చు పెట్టడంపైనే ఈ ప్రభుత్వానికి ధ్యాస ఎక్కువైందని ఎమ్మెల్సీ అశోక్‌ బాబు విమర్శించారు.

*రైతు భరోసా కేంద్రాలు దోపిడీ కేంద్రాలుగా మారాయి: Dhulipalla
వైసీపీ(YCP) ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల వ్యవసాయం సంక్షోభంలో పడుతుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు. రైతులు పంటను తక్కువ ధరకే అమ్ముకొని ఎకారానికి రూ.10 వేలు నష్టపోయారన్నారు. రైతు భరోసా కేంద్రాలు దోపిడీ కేంద్రాలుగా మారాయన్నారు. కోపరేటివ్ సొసైటీ బ్యాంకు లో రైతులు డబ్బులు దోచుకున్నారని ధూళిపాళ్ల పేర్కొన్నారు. కో ఆపరేటివ్ బ్యాంకులో అవినీతిపై ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదన్నారు. రైతాంగ సమస్యలపై పోరాటం చేస్తామని.. ప్రభుత్వం మెడలు వంచుతామని పేర్కొన్నారు. డైరీ రంగంపై కేంద్ర జీఎస్టీ 5శాతం వేయడం వల్ల పాడి పరిశ్రమ బతికే అవకాశం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల డైరీ రంగం కుదేలవుతుందని ధూళిపాళ్ల పేర్కొన్నారు.

*వైసీపీ నాయకుల స్వలాభం కోసమే ప్రాజెక్టులు : అమర్నాథ్ రెడ్డి
మదనపల్లి టీడీపీ మినీ మహానాడు వేదికపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి మదనపల్లికు కృష్ణా నది జలాలు తీసుకొస్తే.. వైసీపీ ప్రభుత్వం దాన్ని పక్కనపెట్టి ప్రజలకు తాగు, సాగునీరు అందకుండా చేస్తోందని ఆరోపించారు. వైసీపీ నాయకుల స్వలాభం కోసమే పుంగనూరు తంబళ్లపల్లె మండలంలో మినీ రిజర్వాయర్ల పేర్లతో ప్రాజెక్టులు కడుతున్నారని విమర్శించారు. జగన్ పాలన, పథకాల గురించి ప్రశ్నించిన వారిపై ఆక్రమ కేసులు పెట్టడం రివాజుగా మారిందని, బెదిరింపులు, కేసులకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భయపడరని పేర్కొన్నారు.

*జగన్ జైలుకు వెళ్తాడు: ఆనంద్ బాబు
అమర్తలూరు మండలం ఇంటూరులో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. జగన్‌కి వ్యతిరేకంగా గ్రామ, పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనపడుతుందన్నారు. వైసీపీలో మోసానికి గురైన వారు టీడీపీలో జాయిన్ అవుతున్నారని మండిపడ్డారు. జగన్ ఒక్క చాన్స్ అన్న మాటకి ప్రజలు మోసపోయారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక మొదటిగా ఈడ్చి తన్నింది దళితులనేనని చెప్పారు. దళితులు ఎప్పటినుంచో స్కాలరుషిప్ ద్వారా చదువుకుంటున్నారని.. ఆ విషయాన్ని జగన్ రెడ్డి గుర్తించాలని సూచించారు. జగన్ సీబీఐ కేసు దర్యాప్తు ప్రారంభం అయితే చాలు జైలుకి పోతాడని నక్కా ఆనంద్ బాబు

*కడపలోనూ బారికేడ్ల మధ్యే పర్యటనా!: తులసి రెడ్డిt
సీఎం జగన్‌ కడపలోని తన స్వంత నియోజకవర్గంలో పర్యటించేటపుడు ప్రజలు కలుసుకునే వీలులేకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడం ఏమిటని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ప్రశ్నించారు. బుధవారం వేంపల్లెలో ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద ఆయన మాట్లాడారు. ‘‘సీఎం 7, 8 తేదీల్లో పులివెందుల, వేంపల్లెలో పర్యటించనున్నారు. రోడ్లకు ఇరువైపుల కిలోమీటర్ల పొడవునా బారికేడ్లు అమర్చారు. గతంలో ఏ సీఎం పర్యటనలోనూ ఇలాంటి వికృత చర్యలు లేవు’’ అని అన్నారు. సీఎం నిర్ణయాలతో విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు.